Big Stories

Krishna : పొలిటికల్ మూవీస్ సూపర్ హిట్..ఎంపీగా సేవలు..

Krishna : రాజకీయకథాంశాలతో కృష్ణ నటించిన సినిమాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. సూపర్ స్టార్ గా ఎనలేని కీర్తి సంపాదించిన కృష్ణ రాజకీయాలపై ఆసక్తి చూపించారు. 1972లో జైఆంధ్ర ఉద్యమానికి బహిరంగంగా మద్దుతునిచ్చారు. ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశానికి ముందు 1982 డిసెంబర్ 17న కృష్ణ కథానాయకుడిగా విడుదలైన రాజకీయ చిత్రం ఈనాడు సినిమా తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలకు , ప్రచారానికి అనుకూలంగా ఉంది. ఎన్నికలకు 3 వారాలు ఉన్న సమయంలో విడుదలైన ఈ సినిమా తెలుగుదేశం విజయంలో తనవంతు చిన్న పాత్ర పోషించింది. 1983లో ఎన్టీఆర్ సీఎం అయ్యారు. ఆ తర్వాత ఎన్టీఆర్ విధానాలను కృష్ణ వ్యతిరేకించారు. 1984లో ఇందిరా గాంధీ దారుణహత్యకు గురైనప్పుడు కృష్ణ ఆమె అంత్యక్రియలకు ఢిల్లీ వెళ్లారు. అదే సమయంలో ప్రధానిగా, కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన రాజీవ్ గాంధీని కృష్ణ కలిశారు. ప్రజాకర్షణ ఉన్న కృష్ణ కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడతారని కాంగ్రెస్ నాయకులు భావించారు. ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. 1984లో కృష్ణ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

- Advertisement -

ఆ తర్వాత కృష్ణ టీడీపీ ప్రభుత్వ చర్యలను విమర్శిస్తూ సినిమాలు తీశారు. సింహాసనం సినిమాలో కైకాల సత్యనారాయణ పోషించిన ప్రతినాయకుడి పాత్ర ఎన్టీఆర్ ను పోలి ఉండటంతో ఈ సినిమాపై వివాదం రేగింది. నా పిలుపే ప్రభంజనం సినిమాలో ఎన్టీఆర్ ను డైరెక్ట్ గా ఎటాక్ చేశారు. ఈ సినిమాలో ప్రతి నాయకుడి పాత్ర ఎన్టీఆర్ ను పోలి ఉంటుంది. ఈ సినిమాలో కృష్ణ డీసీపి పాత్ర పోషించారు. ఈ సినిమా వివాదాలు సృష్టించింది. విజయనిర్మల దర్శకురాలిగా కృష్ణ కథానాయకుడిగా సాహసమే నా ఊపిరి సినిమా తీశారు. పూర్తి రాజకీయ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా వివాదం సృష్టించడమే కాదు సూపర్ హిట్ అయ్యింది.

- Advertisement -

1989లో కృష్ణ రాజకీయాల్లోకి పూర్తిస్థాయిలో అడుగుపెట్టారు. 1989లో కాంగ్రెస్ తరఫున ఏలూరు లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 1991 లోక్ సభ ఎన్నికల్లో గుంటూరు నుంచి పోటీ చేయాలని భావించారు. అయితే కాంగ్రెస్ తిరిగి ఏలూరు టిక్కెట్ ఇచ్చింది. ఆ ఎన్నికల్లో31 వేల ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థి బోళ్ల బుల్లిరామయ్య చేతిలో ఓడిపోయారు. రాజకీయాల్లో తనను ప్రోత్సహించిన రాజీవ్ గాంధీ 1991 లో హత్యకు గురికావడం, తాను కోరిన చోట పార్టీ టిక్కెట్ దక్కకపోవడంతో ప్రత్యక్ష రాజకీయాలకు కృష్ణ గుడ్ బై చెప్పారు. 2009 ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కోరిక మేరకు కాంగ్రెస్ పార్టీకి కృష్ణ కుటుంబం నైతిక మద్దతు అందించింది. కానీ క్రియాకీలక రాజకీయాల్లో కృష్ణ లేరు. ఆ తర్వాత రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉన్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News