E-Paper
Advertisement

KTR: BRSలో టెన్షన్ టెన్షన్.. KTR ఏ క్షణమైనా ..

KTR: BRSలో టెన్షన్ టెన్షన్.. KTR  ఏ క్షణమైనా ..
Advertisement

KTR: తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఫార్ములా-ఈ కార్ రేసు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను విచారించేందుకు అవినీతి నిరోధక శాఖకి గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ ఆమోదం తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వం పంపిన ఫైలుపై ఆయన సంతకం చేశారు. కేటీఆర్‌పై విచారణకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం బీఆర్ఎస్‌లో కలకలం రేపుతోందంట.

ఈ-కారు రేసు కేసులో కేటీఆర్‌కు బిగ్‌‌షాక్‌

తెలంగాణలో ఫార్ములా ఈ-కారు రేసు కేసులో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు బిగ్‌ షాక్‌ తగిలింది. కేటీఆర్‌పై విచారణకు గవర్నర్‌ జిష్ణుదేవ్‌‌వర్మ అనుమతి ఇచ్చారు. దీంతో, ఈ-కారు రేసు కేసులో కేటీఆర్‌పై ఛార్జ్‌షీట్‌ వేసేందుకు ఏసీబీకి గవర్నర్‌ అనుమతి లభించినట్టు అయ్యింది. అయితే, కేటీఆర్‌పై విచారణకు గవర్నర్‌ అనుమతి కోరుతూ ఇటీవల తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. ఈ నేపథ్యంలో తాజాగా గవర్నర్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు.

ఈ-కారు రేసులో క్విడ్‌ ప్రోకో జరిగినట్టు ఏసీబీ నివేదిక

Advertisement

కాగా, ఫార్ములా ఈ-కారు రేసులో క్విడ్‌ ప్రోకో జరిగినట్టు ఏసీబీ నివేదిక ఇచ్చిన విషయం తెలిసిందే. రూ.54.88 కోట్ల నిధులు దారి మళ్లింపుపై ఆరోపణలు చేసింది. ఈ కేసుకు సంబంధించి కేటీఆర్‌ ఇప్పటికే పలుమార్లు ఏసీబీ విచారణకు హాజరయ్యారు. రెండు సార్లు ఏసీబీ విచారణకు, ఒకసారి ఈడీ విచారణకు కేటీఆర్‌ హాజరయ్యారు. ఇక, ఫార్ములా-ఈ కార్‌ రేసింగ్‌ వ్యవహారంపై 2024 డిసెంబరు 18న ఏసీబీ కేసు నమోదు చేసింది. ఏ1గా కేటీఆర్‌, ఏ2గా ఐఏఎస్‌ అర్వింద్‌కుమార్‌, ఏ3గా హెచ్‌ఎండీఏ చీఫ్‌ ఇంజినీర్‌ బీఎల్‌ఎన్‌ రెడ్డిపై కేసు నమోదైంది.

విచారణకు సిద్దమవుతున్న ఏసీబీ అధికారులు

గవర్నర్ అనుమతి లభించడంతో కేటీఆర్‌పై అభియోగాలు నమోదు చేసి, విచారణ చేపట్టేందుకు ఏసీబీ అధికారులు సిద్ధమవుతున్నారు. త్వరలోనే ఆయనకు నోటీసులు జారీ చేసి, విచారణ ప్రక్రియను ప్రారంభించే అవకాశం ఉంది. తాజా పరిణామంతో త్వరలోనే కేటీఆర్‌పై అభియోగాలు నమోదు చేసేందుకు ఏసీబీ సిద్ధమవుతోందట. విచారణ తర్వాతే ఛార్జ్‌షీట్ దాఖలు చేసే అవకాశం ఉంది. విచారణ అనంతరం ఈ కేసులో ఛార్జ్‌షీట్ దాఖలు చేయాలని ఏసీబీ భావిస్తోంది. ఈ పరిణామంతో బీఆర్ఎస్ వర్గాల్లో తీవ్ర ఆందోళన మొదలైంది.

అరవింద్ కుమార్‌పై ఏసీబీ విచారణ

Advertisement

ఇదే కేసులో కీలక నిందితుడిగా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‌పై విచారణకు కూడా ఏసీబీ చర్యలు వేగవంతం చేసింది. ఆయనపై అభియోగాలు నమోదు చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ ..డీవోపీటీకు లేఖ రాసింది. కేంద్రం నుంచి అనుమతి రాగానే అరవింద్ కుమార్‌పైనా ఏసీబీ అభియోగాలు నమోదు చేయనుంది.

Story By Apparao, Big Tv

Related News

రేవంత్ రెడ్డి సీక్రెట్ స్కెచ్.. దారికి రాకుంటే టికెట్ కట్! హస్తం పార్టీలో మొదలైన బిగ్ యాక్షన్ ప్లాన్

ఫిఫా ఫైనల్ కురుక్షేత్రం.. 16 ఏళ్ల కల నెరవేరిన వేళ.. కన్నీళ్లతో మెస్సీ వీడ్కోలు!

మీ అవినీతిని బంద్ పెడితే చాలు.. ఉచిత కార్పొరేట్ విద్యా, వైద్యం అందించొచ్చు..!

యూట్యూబ్ లో అప్ లోడ్ అయిన మొదటి సినిమా ఏంటో తెలుసా ?

Construction Waste: హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో నివసిస్తున్నారా? అయితే బీ కేర్‌ఫుల్..?

స్మగ్లర్ల ధనదాహానికి 530 ప్రాణాలు బలి.. రోహింగ్యాలు జలసమాధి వెనుక ఉన్న బిగ్ స్కెచ్ ఇదేనా..?

Future City: ముచ్చర్ల పరిసర ప్రాంతాల్లో భూములు కొన్నారా?.. అయితే మీకో షాకింగ్ న్యూస్..!

యువ సంగ్రామ సదస్సు దేనికి సంకేతం?.. నిరుద్యోగుల కోసం కేసీఆర్ చేసిన టాప్ 5 స్టెప్స్ ఇవే!

Big Stories

Advertisement
×