BigTV English

Kurasala Kannababu: జగన్‌కి బిగ్ షాక్.. బీజేపీలోకి కన్నబాబు

Kurasala Kannababu: జగన్‌కి బిగ్ షాక్.. బీజేపీలోకి కన్నబాబు

2024 ఎన్నికల్లో ఘోరంగా ఓటమి పాలైన వైసీపీ కేవలం 11 సిట్లకే పరిమితం అవటంతో.. ఎన్నికల్లో పోటీ చేసిన ఆ పార్టీ అభ్యర్థుల్లో అత్యధికులు జనానికి ముఖం చాటేస్తున్నారు . జగన్ హయాంలో వ్యవసాయ శాఖ మంత్రిగా హల్‌చల్ చేసిన కాకినాడ రూరల్ శాసనసభ సభ్యుడు కురసాల కన్నబాబు కూడా ఓటమి తర్వాత కనిపించడం మానేశారు. అప్పట్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌‌లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైనా మాట్లాడితే.. వెంటనే ప్రెస్ మీట్ పెట్టి తన వాక్చాతుర్యం ప్రదర్శించేవారు ఒకప్పుడు జర్నలిస్టుగా పనిచేసిన కన్నబాబు.. అమరావతికి వ్యతిరేకంగా వాయిస్ వినిపించిన ఆయన తనకు సంబంధం లేని సినిమా టికెట్ల విషయంలో బాలకృష్ణపై కూడా విమర్శలు కురిపించిన సందర్భాలు కూడా ఉన్నాయి.

అలాంటాయన మొన్నఎన్నికల్లో ఓటమి తర్వాత ప్రజా జీవితానికి పూర్తిగా దూరమయ్యారు. ఎన్నికల ఫలితాలు తర్వాత క్యాడర్ కి కూడా అందుబాటులో లేకుండా పోయారని సొంత పార్టీ కార్యకర్తలే విమర్శిస్తున్నారు . ఓటమి తర్వాత కన్నబాబు పూర్తిగా సైలెంట్ అయినా.. జగన్ గత్యంతరం లేక ఆయనకే జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టారు. పార్టీ బాధ్యతలు అప్పగించినా ఆయన మాత్రం సైలెంట్ మోడ్ కంటిన్యూ చేస్తున్నారు. జిల్లాలో ఒక్క సీటు కూడా వైసీపీ గెలుచుకోలేకపోవడంతో అన్ని నియోజకవర్గాల పార్టీ శ్రేణుల్లో స్తబ్ధత ఏర్పడింది. పార్టీ వర్గాలను యాక్టివ్ చేయడానికని మాజీ మంత్రి కన్నబాబుని జిల్లా అధ్యక్షుడ్ని చేస్తే ఆయన తన సొంత లెక్కలతో సైలెంట్ అయ్యారన్న టాక్ వినిపిస్తుంది. ఢిల్లీ లెవెల్ లో లబీయింగ్ చేసుకుంటూ పార్టీ మారే ప్రయాత్నాలు చేసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతుంది.


కురసాల కన్నబాబు ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావం సమయంలో వైజాగ్‌లో ప్రముఖ దిన పత్రిక జర్నలిస్టు.. ఆ పరిచయాలతో కాకినాడ రూరల్ పీఆర్పీ టికెట్ దక్కించుకుని 2009లో శాసనసభ్యుడిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2014 నాటికి మారిన పరిస్థితుల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి ఓడిపోయిన ఆయన.. 2019 ఎన్నికల్లో వైసీపీలో చేరి రెండో సారి ఎమ్మెల్యేగా గెలిచి.. మంత్రి పదవి కూడా నిర్వహించారు . ప్రధానంగా కురసాల కన్నబాబు మంత్రిగా కొనసాగిన సమయంలో నియోజకవర్గంలో తండ్రి కురసాల సత్యనారాయణ, తమ్ముడు, సినీ దర్శకుడు కురసాల కళ్యాణ్‌కృష్ణ పెత్తనంతో అటు పార్టీ క్యాడర్ , ఇటు అధికార యంత్రాంగం ఇబ్బందులు ఎదుర్కొన్నారంటారు.

Also Read: టీడీపీ స్కెచ్.. గుడివాడలో కొడాలి నాని అడ్రస్ గల్లంతేనా?

ముఖ్యంగా వైసీపీ పాలనలో సచివాలయం నిర్మాణాలు, సీసీ రోడ్ల నిర్మాణాల కాంట్రాక్టులు చేసిన కొందరు నాయకులు సదరు బిల్లులు మంజూరవ్వక ఇబ్బందులు పడ్డారు. అయితే రూరల్ మండలం లో ఉన్న పరిశ్రమల వద్ద సీఎస్ఆర్ నిధులతో చేపట్టిన పనుల కాంట్రాక్టు లు అన్నీ కురసాల కన్నబాబు తండ్రి కురసాల సత్యనారాయణ చేయించారు. వాటి బిల్లులు వెంటవెంటనే మంజూరు అయ్యాయి. దాంతో డబ్బులు వచ్చే పనులు మీకు రాని వాటిని మాకు ఇస్తారా అన్న అసంతృప్తి నాయకుల్లో ఎన్నికల సమయానికే వచ్చేసిందంటారు.

ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆ అసంతృప్తి బయటపడి పార్టీ నాయకులు, కార్యకర్తలు కన్నబాబుకు పూర్తిగా దూరం అయ్యారు. చాలా మంది వైసీపీకి గుడ్ బై చెప్పి తమ దారి తాము చూసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జగన్ తిరిగి జిల్లా అధ్యక్ష పదవిని కన్నబాబుకు ఇవ్వడాన్ని పార్టీలో మిగిలి ఉన్న కొందరు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు కురసాల కన్నబాబు నివాసం ఎదురుగా పంచాయితీకి సంబంధించిన స్థలంలో తన క్యాంపు కార్యాలయం నడిపేవారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత శాసనసభ్యులు పంతం నానాజీ ఆదేశాలతో పంచాయితీ స్థలంలో నిర్మించిన దానికి నోటీసులు ఇచ్చి నిర్మాణాలను తొలగించారు.

కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత కేవలం మూడు సార్లు మాత్రమే కురసాల కన్నబాబు మీడియా ముఖం చూశారు. పిఠాపురంలో మైనర్ బాలిక హత్యాచారం ఘటన, ఇసుక , మద్యం పాలసీలు, సూపర్ సిక్స్ పథకాల అమలు పై మాట్లాడిన ఆయన ఎక్కడ పవన్ కళ్యాణ్ పై నోరు జారకుండా కేవలం చంద్రబాబు పై విమర్శలు చేసి వెళ్లారు. ఆ విమర్శల్లో కూడా మునుపటి వాడి, వేడి కనిపించలేదు. ఆ మార్పును చూస్తూ ఆయన కూటమి ప్రభుత్వంతో సత్సంబంధాలు కోరుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. టీడీపీ, జనసేనల్లో చేరే అవకాశం లేకపోవడంతో బీజేపీ గూటికి చేరాలని మంతనాలు జరిపినట్లు చెప్తున్నారు. మరి కాషాయ పార్టీ కన్నబాబుని ఏ మాత్రం కరుణిస్తుందో చూడాలి.

 

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×