Bigg Boss 8 Telugu Latest Promo: బిగ్ బాస్ సీజన్ 8లో ఈవారం మెగా చీఫ్ అవ్వడం కోసం కాదు.. మెగా చీఫ్ కంటెండర్ అవ్వడం కోసం పోటీ మొదలయ్యింది. బిగ్ బాస్ హౌస్‌లో రిస్క్ తీసుకోవడం వల్ల ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. అలా నబీల్, పృథ్వి, రోహిణి రిస్క్ తీసుకొని గార్డెన్ ఏరియాలో పెట్టిన సూట్‌కేసులు తీసుకోవడం వల్ల వారు మెగా చీఫ్ కంటెండర్లు అయ్యారు. కానీ ఆ స్థానాలను కాపాడుకోవాలంటే ఇతర కంటెస్టెంట్స్‌తో పోటీపడాలి. ఇప్పటికే నబీల్, రోహిణి ఆ పోటీలో గెలిచి వారి స్థానాలను కాపాడుకోగా.. ఇప్పుడు పృథ్వి.. విష్ణుప్రియాతో పోటీకి దిగాడు. అలా వీరిద్దరి మధ్య సరైన చిచ్చుపెట్టాడు బిగ్ బాస్.
వేగం పెంచిన విష్ణు
‘‘బిగ్ బాస్ మీ కంటెండర్‌షిప్‌ను కాపాడుకోవడానికి మీకు ఇస్తున్న తదుపరి ఛాలెంజ్.. కీ ను పట్టు కంటెండర్‌షిప్ గెలిచేటట్టు. మీకు కావాల్సిన కంటెండర్‌షిప్ మీ ముందున్న బాక్సుల్లో ఉంది. బాక్సులను తెరవడానికి మీకు మూడు తాళంచెవులు అవసరమవుతాయి’’ అంటూ బిగ్ బాస్ వివరించడంతో టాస్క్ మొదలవుతుంది. ఈ టాస్క్‌లో తనతో పోటీపడడం కోసం విష్ణుప్రియాను ఎంచుకున్నాడు పృథ్వి. మొదట్లో ఇద్దరి మధ్య పోటీ గట్టిగానే జరిగింది. మొదటి తాళంచెవిని విష్ణుప్రియా ముందుగా సంపాదించింది. కానీ రెండో తాళంచెవి దగ్గరే అసలే రచ్చ మొదలయ్యింది.
Also Read: అప్పుడే మొదలెట్టేశారా?.. ఈ వారం ఆమె అవుట్..?
అక్కడే లేటు
మొదటి తాళంచెవిని గెలుచుకున్న తర్వాత రెండో తాళంచెవి కోసం వేగంగా పరిగెత్తింది విష్ణు. అక్కడ తనకు రెండో కీ కూడా దొరికింది. కానీ అది కరెక్ట్ కీ కాదని లేటుగా తెలుసుకుంది. అదే సమయంలో పృథ్వికి సరైన తాళంచెవి దొరకడంతో తను వెళ్లి బాక్స్ తెరిచేశాడు. వెంటనే మూడో తాళంచెవిని దక్కించుకొని బాక్స్ ఓపెన్ చేసి కంటెండర్ బోర్డ్‌ను దక్కించుకున్నాడు. మొదటి నుండి ఈ టాస్కులో విష్ణుప్రియా చాలానే కష్టపడింది. సగం వరకు స్పీ్డ్‌గానే వచ్చింది. కానీ రెండో తాళంచెవి దొరకక తను వెనకబడి పృథ్వి గెలిచాడు. విష్ణు ఓడిపోవడంతో కొత్త కంటెస్టెంట్స్ అంతా తన చుట్టూ చేరి తనలో విషం నింపడానికి ట్రై చేశారు.
రెచ్చగొట్టిన రోహిణి
అసలు టాస్క్ అంతా ఎలా జరిగిందో రోహిణి, టేస్టీ తేజ, హరితేజతో షేర్ చేసుకుంది విష్ణుప్రియా. అప్పుడే పృథ్వి పడేసిన కీ తను తీసుకొచ్చి బాక్స్ ఓపెన్ చేయడానికి ట్రై చేసిందని రోహిణితో చెప్పగానే అందరూ షాకయ్యారు. అది విన్న టేస్టీ తేజ.. ‘‘కావాలనే ప్లాన్ చేసి మిమ్మల్ని ఓడించారు’’ అంటూ విష్ణును రెచ్చగొట్టడానికి ట్రై చేశాడు. ‘‘ఒకవేళ వేరేవాళ్లు ఆ ప్లేస్‌లో ఉండుంటే తాళంచెవి లోపలికి ఎలా తీసుకొస్తారు అని ఫైట్ చేసేదానివా’’ అని విష్ణు ఆలోచించేలా ప్రశ్నించింది రోహిణి. ‘‘నోట్‌లో ఎక్కడ కీ అక్కడే పెట్టండి అని క్లారిటీగా రాసుంది’’ అని స్పష్టం చేశాడు తేజ. మొత్తానికి రోహిణి, టేస్టీ తేజ చేసిన పనివల్ల విష్ణుప్రియా వెళ్లి పృథ్వితో గొడవపడేలాగానే ఉంది.