BigTV English

Maheshbabu : 2022లో మహేష్ బాబు ఇంట విషాదాలు… ముగ్గురు ఆత్మీయుల కన్నుమూత

Maheshbabu : 2022లో మహేష్ బాబు ఇంట విషాదాలు… ముగ్గురు ఆత్మీయుల కన్నుమూత

Maheshbabu : రక్తసంబంధీకులు దూరమైతే ఆ బాధ వర్ణనాతీతం.కన్నవారు, తోబుట్టువులను కోల్పోవడం సమాజంలో ఎలాంటి స్థాయి వ్యక్తులకైనా ఎంతో ఆవేదన కలిగిస్తుంది. ఏడాది వ్యవధిలోనే ముగ్గురు కుటుంబ సభ్యులను కోల్పోతే..ఇక ఆ విషాదాన్ని మాటల్లో చెప్పలేం. ప్రస్తుతం హీరో మహేష్ బాబు ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నారు.


ఈ ఏడాది జనవరి 8న మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు అనారోగ్యంతో కన్నుమూశారు. ఆ సమయంలో కరోనా బారిన పడిన మహేష్ బాబు తన సోదరుడి చివరిచూపుకు నోచుకోలేకపోయారు. అన్నయ్యతో మహేష్ బాబుకు ప్రత్యేక అనుబంధం ఉంది. బాలనటుడిగా రమేష్ బాబుతో కలిసి నటించారు. తండ్రి, అన్నయ్య స్ఫూర్తితోనే ఆ తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చారు. రమేష్ బాబు అనుకున్నంతగా హీరోగా సక్సెస్ కాకపోయినా…మహేష్ బాబు మాత్రం తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు. ఆ తర్వాత మహేష్ బాబు చిత్రాల నిర్మాణంలో రమేష్ భాగస్వామి అయ్యారు. ఇలాంటి సమయంలో రమేష్ బాబును కోల్పోవడం మహేష్ బాబు కు తీరని లోటును కలిగించింది.

సోదరుడి మరణం నుంచి తేరుకోకముందే మహేష్ బాబు తల్లి ఇందిరాదేవి కన్నుమూశారు. ఈ ఏడాది సెప్టెంబర్ 28న ఆమె తుదిశ్వాస విడిచారు. ఇలా 9 నెలల వ్యవధిలోనే అన్నయ్యను, తల్లిని మహేష్ బాబు కోల్పోయారు. ఆ బాధ నుంచి కోలుకోకముందే ఇప్పుడు మరో విషాదం. ఇప్పుడు తండ్రి కృష్ణ మరణం మహేష్ బాబును మళ్లీ విషాదంలోకి నెట్టేసింది. ఈ కష్టకాలంలో మహేశ్‌కు శక్తినివ్వాలంటూ అభిమానులు దైవాన్ని ప్రార్థిస్తున్నారు. సోషల్‌ మీడియా వేదికగా ఆయనకు ధైర్యాన్నిస్తున్నారు.


Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×