Big Stories

KCR,Chandrababu : కృష్ణ పార్థివదేహానికి కేసీఆర్‌, చంద్రబాబు నివాళులు..

KCR : సూపర్ స్టార్ కృష్ణ మరణంపై తెలంగాణ సీఎం కేసీఆర్‌ సంతాపం తెలిపారు. హైదరాబాద్ లోని నానక్‌రామ్‌గూడలోని కృష్ణ ఇంటికి వెళ్లి కృష్ణ పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. మహేష్‌ బాబును ఓదార్చారు. కృష్ణ కుటుంబసభ్యులను కేసీఆర్ పరామర్శించారు.

- Advertisement -

నటుడు కృష్ణ మన మధ్య లేకపోవడం బాధాకరమని కేసీఆర్ అన్నారు. కృష్ణను ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తిగా పేర్కొన్నారు. పార్లమెంట్‌ సభ్యుడిగా పనిచేసిన విషయాన్ని ప్రస్తావించారు. మంచి మిత్రుడిని కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. సూపర్ స్టార్ తో తనకున్న అనుబంధం మర్చిపోలేనిదన్నారు. అల్లూరి సీతారామరాజు సినిమా చాలా సార్లు చూశానని గుర్తు చేసుకున్నారు. కృష్ణ అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహిస్తామని కేసీఆర్ ప్రకటించారు.

- Advertisement -

కృష్ణ ఆతిథ్యమిస్తే చాలా సార్లు ఆయన ఇంటికి వెళ్లిన విషయాన్ని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు దుఃఖాన్ని భరించే ధైర్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని కేసీఆర్ కోరుకున్నారు. సీఎంతో పాటు మంత్రులు హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డి, ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి కృష్ణ భౌతికకాయానికి నివాళులర్పించారు.

Chandrababu: కృష్ణ భౌతికకాయానికి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నివాళులర్పించారు. మహేశ్‌బాబును పరామర్శించి, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కృష్ణ భావితరాలకు ఆదర్శమన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ అభిమాన సంఘాలు కలిగిన ఏకైక నటుడు కృష్ణే అన్నారు. మహేశ్‌బాబు కుటుంబంలో ఈ ఏడాది ముగ్గురు చనిపోవడం బాధాకరమన్నారు. వారి కుటుంబానికి దేవుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని చంద్రబాబు అన్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News