E-Paper
Advertisement

S.Janaki: సింగర్ జానకమ్మ ఇంట్లో విషాదం. పోస్ట్ పెట్టిన చిత్ర!

S.Janaki: సింగర్ జానకమ్మ ఇంట్లో విషాదం. పోస్ట్ పెట్టిన చిత్ర!
Advertisement

S.Janaki:సౌత్ సినీ పరిశ్రమలో లెజెండ్రీ గాయనిగా.. దక్షిణాది సంగీత సరస్వతిగా మంచి పేరు ప్రఖ్యాతలు ఘడించారు ఎస్ జానకి (S.Janaki). 60 సంవత్సరాలకు పైగా సినీ జీవితం గడిపిన ఈమె తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషలలో సుమారుగా 50వేలకు పైగా పాటలు పాడి.. తన అద్భుతమైన గాత్రంతో శ్రోతలను అలరించారు. తన సినీ ప్రయాణంలో ఉత్తమ గాయనిగా.. 4 నేషనల్ అవార్డులు, వివిధ రాష్ట్రాల నుంచి 31 అవార్డులు సొంతం చేసుకున్నారు.

ముఖ్యంగా ఇళయరాజా సంగీత దర్శకత్వంలో పాడిన పాటలతో పాటు ఎస్పీ బాలసుబ్రమణ్యంతో కలిసి పాడిన పాటలు ఆమెకు మంచి పేరు తీసుకొచ్చాయి. ఈ నేపథ్యంలోనే మైసూర్ విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ ను పొందిన ఈమె.. తమిళనాడు ప్రభుత్వం చేత కళైమామణి పురస్కారం కూడా అందుకున్నారు. అంతేకాదు పద్మభూషణ్ పురస్కారాన్ని సొంతం చేసుకున్నారు.

జానకమ్మ ఇంట్లో విషాదం..

Advertisement

అలాంటి జానకమ్మ ఇంట్లో ఇప్పుడు విషాదఛాయలు అలుముకున్నాయి. విషయంలోకి వెళ్తే జానకి కుమారుడు మురళీకృష్ణ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ప్రస్తుత పరిస్థితి విషమించడంతో ఈరోజు తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని ప్రముఖ గాయని కే.ఎస్.చిత్ర తన ఫేస్బుక్ అకౌంట్ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం మురళీకృష్ణ వయసు 65 సంవత్సరాలు.

సుప్రసిద్ధ భరతనాట్యం కళాకారుడు..

మురళీకృష్ణ జానకి కుమారుడు మాత్రమే కాదు తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును కూడా సంపాదించుకున్నారు. సుప్రసిద్ధ భరతనాట్య కళాకారుడైన ఈయన.. శాస్త్రీయ నృత్యంలో మంచి ప్రావీణ్యం పొందారు. పైగా పలువురు విద్యార్థులకు శిక్షణ కూడా ఇచ్చేవారు. నటనపై ఉన్న ఆసక్తితోనే కొన్ని సినిమాలలో కీలక పాత్రలు పోషించిన మురళీ.. ఆ తర్వాత సంగీతం, కళల పట్ల మక్కువ పెంచుకొని జానకి గారి వారసత్వాన్ని కొనసాగించారు.

Advertisement

ALSO READ:Tarun Bhaskar: ENE 2 నుండి సుశాంత్ తప్పుకోవడం పై దిమ్మతిరిగే క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్!

మురళీకృష్ణ మరణానికి చిత్ర సంతాపం.

మురళీకృష్ణ మృతిపై గాయని చిత్రా స్పందిస్తూ.. “మురళీ అన్న మరణ వార్త నన్ను కలవరపాటుకు గురిచేసింది. జానకి అమ్మకు, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఈ కష్ట సమయంలో వారి కుటుంబానికి దేవుడు మరింత ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను” అంటూ ఆమె ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. జానకి కుటుంబంతో చిత్ర కి ఉన్న సన్నిహిత సంబంధం కారణంగానే ఆమె ఈ విషాదాన్ని తట్టుకోలేకపోవడం గమనార్హం. ప్రస్తుతం ఈ విషయం తెలిసి అటు సెలబ్రిటీలు ఇటు నెటిజన్లు అటు సంగీత ప్రియులు మురళీకృష్ణ మృతి పట్ల సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు. ఏది ఏమైనా మురళీకృష్ణ మరణం ఇండస్ట్రీకి తీరని లోటు అని చెప్పవచ్చు.

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×