E-Paper
Advertisement

30 ఏళ్ల స్థిరత్వం ఒక్క యుద్ధంతో.. గల్ఫ్ దేశాల కళ్లముందే కరుగుతున్న కల!

30 ఏళ్ల స్థిరత్వం ఒక్క యుద్ధంతో.. గల్ఫ్ దేశాల కళ్లముందే కరుగుతున్న కల!
Advertisement

US-Iran War: అమెరికా-ఇరాన్ యుద్ధం మధ్య.. మధ్యప్రాచ్యం నలిగిపోతోంది. ఇరాన్-ఇజ్రాయెల్,అమెరికా మధ్య యుద్ధంలో గల్ఫ్ దేశాలు బలిపశువులయ్యాయ్. యుద్ధం మొదలైనప్పటి నుంచి.. ఆ సెగ మిడిల్ ఈస్ట్ దేశాలకే ఎక్కువగా తగులుతోంది. యుద్ధం ఆ మూడు దేశాల మధ్యే అయినా, పరిణామాలు మాత్రం గల్ఫ్ దేశాల ఆర్థిక వ్యవస్థను, భద్రతను అతలాకుతలం చేశాయ్. ఈ యుద్ధంతో అరబ్ దేశాల ఆర్థిక మూలాలు దెబ్బతినడం ఇప్పుడు చర్చకు దారితీసింది. అమెరికాపై ప్రతీకారంతో ఎప్పుడైతే ఇరాన్ మిసైళ్లు.. దుబాయ్, కువైట్, బహ్రెయిన్, ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈ లాంటి దేశాలను తాకాయో.. అప్పుడే గల్ఫ్ దేశాల ప్రతిష్ఠ మొత్తం పడిపోయింది.

ఇరాన్ స్ట్రాటజీ షాక్

గల్ఫ్ దేశాలు సేఫ్ హెవెన్ అనే లేబుల్ మసకబారిపోయింది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా.. ఇరాన్ దాడులు చేసినా.. దెబ్బ మాత్రం మిడిల్ ఈస్ట్ దేశాలకే గట్టిగా తగిలింది. నేరుగా వాషింగ్టన్‌పై దాడి చేయలేని ఇరాన్.. అమెరికా ప్రయోజనాలను దెబ్బతీసేందుకు పక్కనే ఉన్న ఈ లాజిస్టిక్ హబ్‌లను టార్గెట్‌గా చేసుకుంది. చమురు మీదే ఆధారపడిన గల్ఫ్ దేశాల ఆర్థిక వ్యవస్థని దెబ్బతీస్తే.. ఆ దేశాలన్నీ ట్రంప్‌పై ఒత్తిడి తెచ్చి.. యుద్ధం ముగుస్తుందనే ఎత్తుగడతో ఇలా చేశాయ్. అంటే, మాపై దాడులు కొనసాగితే.. అమెరికా మిత్ర దేశాలను కూడా దెబ్బతీస్తామనే హెచ్చరికలో భాగంగానే.. ఇరాన్ ఇలా చేసింది. దీనివల్ల.. అమెరికాకు ఎంత నష్టం జరిగింది? ఎంత ప్రెజర్ పెరిగింది? అనేది పక్కనపెడితే.. ఆయిల్ ఎగుమతులు ఆగిపోయి గల్ఫ్ దేశాలు భారీగా నష్టపోయాయ్.

గల్ఫ్ దేశాలపై ఉద్రిక్తతల ప్రభావం

Advertisement

ప్రపంచ ఇంధన అవసరాలకు మధ్యప్రాచ్యం గుండెకాయ లాంటిది. ఈ ఉద్రిక్తతలతో.. గల్ఫ్ దేశాలు రెండు వైపు నుంచి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయ్. అరబ్ దేశాలు ఇప్పుడిప్పుడే.. ఇతర రంగాలపై ఫోకస్ పెట్టాయ్. చమురు నిల్వలని మాత్రమే నమ్ముకోకుండా.. అనేక రంగాల్లో ఆర్థికంగా ఎదగాలని అడుగులు వేస్తున్నాయ్. బిజినెస్, షాపింగ్, రియల్ ఎస్టేట్, హౌజింగ్, గోల్డ్ బిజినెస్, ఎయిర్‌పోర్టులు.. ఇలా అనేక రంగాల్లో అభివృద్ధి సాధించాలనే పట్టుదలతో ఉన్నాయ్. ప్రపంచం మొత్తానికి ఓ బిజినెస్ సెంటర్‌గా, సేఫ్ హెవెన్‌గా ఎదిగే దిశగా కృషి చేస్తున్నాయ్.

టూరిజం, ఇన్వెస్ట్మెంట్స్‌కు గట్టి దెబ్బ

అటు పశ్చిమ దేశాలకు, ఇటు ఆసియాకు మధ్యలో.. సెంటర్ పాయింట్‌గా ఉండాలని చూస్తున్నాయ్. దాంతో.. గల్ఫ్ కంట్రీస్ అంటే కేవలం ఆయిల్ మాత్రమే కాదనే ముద్ర తొలగిపోతోంది. అరబ్ దేశాలంటే.. సేఫ్ హెవెన్‌గా, బిజినెస్ సెంటర్లుగా మారిపోయాయ్. అయితే.. ఈ యుద్ధంతో సంబంధం లేకపోయినా.. ఇరాన్ చేసిన దాడులతో అరబ్ దేశాలు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనే పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా.. టూరిజం, వ్యాపారంపై గట్టి దెబ్బ పడింది. పోర్టులు, ఎయిర్‌పోర్టులపై దాడులు జరగడంతో.. విదేశీ ఇన్వెస్టర్లు, టూరిస్టులు.. గల్ఫ్ దేశాల వైపు చూసేందుకు కూడా ఒకటికి పదిసార్లు ఆలోచిస్తున్నారు.

గల్ఫ్ షిప్పింగ్‌పై యుద్ధ ప్రభావం

Advertisement

సౌదీ అరేబియాలోని ఆయిల్ రిఫైనరీలు, ఖతార్‌లోని గ్యాస్ ప్లాంట్లు కూడా ఇరాన్ డ్రోన్లు, మిసైళ్ల దాడికి గురయ్యాయ్. దుబాయ్ ఎయిర్‌పోర్టుతో పాటు నివాస ప్రాంతాలపైనా దాడులు జరిగాయ్. వీటిని మళ్లీ నిర్మించాలంటే.. బిలియన్లకొద్దీ డాలర్లు ఖర్చవుతుంది. యుద్ధం వల్ల గల్ఫ్ మీదుగా ప్రయాణించే షిప్పులకు ఇన్సూరెన్స్ ప్రీమియంలు సైతం విపరీతంగా పెరిగాయ్. కొన్ని దశాబ్దాలుగా గల్ఫ్ దేశాలు చమురుపై మాత్రమే ఆధారపడకుండా.. తమ ఆర్థిక వ్యవస్థని మిగతా రంగాలతోనూ సెటిల్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయ్.

దుబాయ్ సేఫ్ హెవెన్ ఇమేజ్‌కు దెబ్బ

అయితే.. ఇరాన్ చేసిన ప్రతీకార దాడులు ఈ ప్రయత్నాలను దారుణంగా దెబ్బకొట్టాయ్. ముఖ్యంగా.. దుబాయ్ అంటే సేఫ్ హెవెన్ అనే ముద్ర ఉండేది. కానీ.. ఇప్పుడదే లేదు. గల్ఫ్ దేశాల్లో ఉన్న ఇతర దేశాల వాళ్లు కూడా తిరిగి వెనక్కి వచ్చేస్తున్నారు. ఇలా వెళ్లిపోయిన వాళ్లంతా.. తిరిగి గల్ఫ్ దేశాలకు వస్తారా? లేదా? అనే అనుమానాలు కూడా ఇప్పుడు వెంటాడుతున్నాయ్. ఈ ఉద్రిక్తతలు త్వరగా తగ్గకపోతే.. గల్ఫ్ దేశాలు ఊహించనంత నష్టం చవిచూడాల్సి వస్తుందంటున్నారు. మళ్లీ పూర్వవైభవం అందుకునేందుకు.. కొన్నేళ్లు పట్టొచ్చు.

మూడు దశాబ్దాల స్థిరత్వానికి షాక్

30 ఏళ్ల కిందట మిడిల్ ఈస్ట్ అంటే అస్థిరమైన ప్రాంతం. ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి. కానీ.. 30 ఏళ్లుగా బహ్రెయిన్, ఖతార్, కువైట్, ఒమన్, యూఏఈ, సౌదీ అరేబియా లాంటి గల్ఫ్ దేశాలు.. స్థిరత్వాన్ని తీసుకొచ్చాయ్. కానీ, యుద్ధం మొదలయ్యాక, దాడులు జరిగాక.. గల్ఫ్ దేశాల్లోని నిర్మాణాలే కాదు, వాటికున్న ఇమేజ్ కూడా డ్యామేజ్ అయింది. యుద్ధం వల్ల తలెత్తిన పరిణామాలతో.. అరబ్ దేశాలు కఠిన పరిస్థితులను ఎదుర్కొంటున్నాయ్. ప్రస్తుతం గల్ఫ్ ప్రాంతంలో నెలకొన్న అస్థిరత, యుద్ధ మేఘాలు, ఆ దేశాల ఆర్థిక వ్యవస్థలను, భవిష్యత్ ప్రణాళికలను కకావికలం చేశాయి. గల్ఫ్‌కు తగిలిన ఈ లోతైన గాయం మానడానికి ఎంత టైమ్ పడుతుందో ఎవ్వరూ అంచనా వేయలేని పరిస్థితులు నెలకొన్నాయ్.

విజన్ 2030కు యుద్ధ షాక్

గల్ఫ్ దేశాలు.. విజన్ 2030 దిశగా పనిచేస్తున్నాయ్. ఆయిల్‌పైనే ఆధారపడటం తగ్గించి, టూరిజం, టెక్నాలజీ, వినోద రంగాల్లో ప్రపంచ కేంద్రాలుగా ఎదగాలని కోట్లాది డాలర్లు పెట్టుబడులు పెట్టాయ్. యుద్ధం వల్ల ఫారిన్ ఇన్వెస్టర్లు వెనకడుగు వేస్తున్నారు. దుబాయ్, ఖతార్ లాంటి దేశాలు టూరిజంపై టన్నులకొద్దీ ఆశలు పెట్టుకున్నాయ్. యుద్ధ వాతావరణం వల్ల ఫ్లైట్ ఛార్జీలు పెరగడం, భద్రతా కారణాల దృష్ట్యా టూరిస్టుల సంఖ్య పడిపోవడం.. ఆందోళన పెంచుతోంది.

డాక్టర్లు, ఇంజనీర్లు వెనక్కి

యుద్ధం కారణంగా ధ్వంసమైన రోడ్లు, ఎనర్జీ ప్లాంట్లు, ఆయిల్ రిఫైనరీలు, ఆస్పత్రులు, అపార్ట్‌మెంట్లు నిర్మించడానికి వందల బిలియన్ డాలర్లు అవసరమవుతాయ్. యుద్ధం వల్ల పెరిగే రక్షణ బడ్జెట్ వల్ల, సంక్షేమ పథకాలకు కేటాయించిన నిధులని కూడా ఆయుధాల కొనుగోలుకు మళ్లించాల్సి వస్తుంది. అంతేకాదు, గల్ఫ్ దేశాల అభివృద్ధిలో విదేశీ నిపుణుల పాత్ర చాలా కీలకం. యుద్ధం వల్ల అక్కడ పనిచేస్తున్న డాక్టర్లు, ఇంజనీర్లు, టెక్ నిపుణులు తమ సొంత దేశాలకు, సురక్షిత దేశాలకు వెళ్లిపోతున్నారు. దీనివల్ల భవిష్యత్తులో గల్ఫ్ దేశాలకు నైపుణ్యం కలిగిన మానవ వనరుల కొరత ఏర్పడే ప్రమాదముంది.

గల్ఫ్ కోలుకోవడానికి దశాబ్దం పట్టొచ్చా..

యుద్ధం ఇప్పటికిప్పుడు ముగిసినా గల్ఫ్ దేశాలు కోలుకునే పరిస్థితి లేదంటున్నారు. పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చేందుకు కొన్నేళ్ల సమయం పడుతుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. కేవలం కూలిన భవనాలు తిరిగి నిర్మిస్తే సరిపోదు. ప్రపంచ దేశాలకు మళ్లీ మిడిల్ ఈస్ట్‌పై నమ్మకం కలగాలి. ఇది జరగాలంటే.. కనీసం పదేళ్లైనా పడుతుంది. యుద్ధం వల్ల దెబ్బతిన్న సప్లై చైన్ అంతరాయంతో.. నిత్యవసరాల ధరలు పెరిగి, సామాన్యుల కొనుగోలు శక్తి తగ్గడం వల్ల కోలుకోవడం మరింత ఆలస్యమవుతుంది. గల్ఫ్ దేశాలు తమ ప్రాంతాన్ని న్యూ యూరప్‌లా మార్చాలని కలలు కన్నాయ్. కానీ.. ఇప్పుడు ఆ విజన్ మసకబారడం ఖాయం. నిధుల కొరత, భద్రతా కారణాలతో.. భారీ ప్రాజెక్టులు మందగించే అవకాశం ఉంది. యువతకు ఉపాధి కల్పించాల్సిన పరిశ్రమలు యుద్ధం వల్ల మూతపడటం, ప్రారంభం కాకపోవడం వల్ల భవిష్యత్ తరం తీవ్ర నిరాశలో మునిగిపోయే అవకాశం ఉంది.

ఆర్థిక మూలాలకు గట్టి దెబ్బ

ఇరాన్-అమెరికా ఘర్షణల్లో.. మధ్యప్రాచ్యం దేశాలు బాధితులుగా మిగలనున్నాయ్. యుద్ధం ఆ దేశాల మధ్య జరిగినా, దాని ప్రభావం గల్ఫ్ ఆర్థిక మూలాలను దెబ్బతీస్తోంది. ఈ దేశాలు మళ్లీ పూర్వ వైభవం సాధించాలంటే.. కేవలం శాంతి స్థాపన మాత్రమే కాదు, ఇంధన రంగంపై కాకుండా ఇతర రంగాలపై తమ ఆర్థిక వ్యవస్థను బలంగా నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది. అరబ్ దేశాలు కోలుకోవాలంటే.. కేవలం శాంతి ఒప్పందాలు సరిపోవు. వ్యవస్థాగతమైన మార్పులు, ప్రపంచ దేశాల సహకారం, భారీ స్థాయిలో ఆర్థిక ఉద్దీపన అవసరం. యుద్ధం వల్ల కలిగిన నష్టం.. ఆ ప్రాంతం ఆత్మవిశ్వాసంపై పడిన దెబ్బగా కనిపిస్తోంది. ఆ నమ్మకాన్ని మళ్లీ నిర్మించడమనేది.. ఇప్పుడొక పెను సవాల్‌గానే కనిపిస్తోంది.

Also Read: గులాబీ గూటిలో కుంపట్లు.. కవిత ‘పంచ్’లు.. కేసీఆర్ ‘సైలెన్స్’.. పార్టీ పరిస్థితి ఏంటి?

Story by: Anup, Big Tv

Related News

యూట్యూబ్ లో అప్ లోడ్ అయిన మొదటి సినిమా ఏంటో తెలుసా ?

Construction Waste: హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో నివసిస్తున్నారా? అయితే బీ కేర్‌ఫుల్..?

స్మగ్లర్ల ధనదాహానికి 530 ప్రాణాలు బలి.. రోహింగ్యాలు జలసమాధి వెనుక ఉన్న బిగ్ స్కెచ్ ఇదేనా..?

Future City: ముచ్చర్ల పరిసర ప్రాంతాల్లో భూములు కొన్నారా?.. అయితే మీకో షాకింగ్ న్యూస్..!

యువ సంగ్రామ సదస్సు దేనికి సంకేతం?.. నిరుద్యోగుల కోసం కేసీఆర్ చేసిన టాప్ 5 స్టెప్స్ ఇవే!

బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుపై వివాదం.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలపై భారత్ క్లారిటీ!

అంగన్వాడీలకు గుడ్ న్యూస్.. ‘తల్లికి వందనం’ వర్తింపు.. ఆ మూడు రోజుల్లోనే అకౌంట్లలోకి రూ. 13 వేలు!

108 సంఖ్యకు అంత ప్రాముఖ్యత ఎందుకో ఎప్పుడైనా ఆలోచించారా ?

Big Stories

Advertisement
×