E-Paper
Advertisement

Crime News: మియాపూర్‌లో దారుణం.. తనను కాదని మరో వ్యక్తిని పెళ్లి చేసుకుందని మహిళపై కత్తితో దాడి!

Crime News: మియాపూర్‌లో దారుణం.. తనను కాదని మరో వ్యక్తిని పెళ్లి చేసుకుందని మహిళపై కత్తితో దాడి!
Advertisement

Crime News:  మియాపూర్‌లో ఓ దారుణ ఘటన చోటుచేసుకుంది. తనను కాదని మరో వ్యక్తిని పెళ్లి చేసుకుందన్న కోపంతో ఓ మహిళపై వ్యక్తి కత్తితో దాడి చేసిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనలో మహిళ తీవ్రంగా గాయపడగా, పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే, కాకినాడకు చెందిన నూకరత్నం అనే మహిళ మియాపూర్‌లో హౌస్‌కీపింగ్ ఉద్యోగిగా పనిచేస్తూ జీవనం సాగిస్తోంది. గతంలోనే భర్తను కోల్పోయిన ఆమెకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇటీవల ఆమె ప్రసాద్ అనే వ్యక్తిని గత నెల 20న వివాహం చేసుకుంది.

Also ReadTelangana BJP: బీజేపీలో ఆరడుగుల బుల్లెట్ సీఎం అభ్యర్ధిగా రెడీ అవుతోందా? ఇంతకు ఆ బుల్లెట్ ఎవరు?

నూకరత్నంకు తీవ్ర గాయాలు

Advertisement

అదే ప్రాంతంలో వంటమనిషిగా పనిచేస్తున్న ఆలీషా అలియాస్ పాండు, నూకరత్నం తనకు చెప్పకుండా ప్రసాద్‌ను పెళ్లి చేసుకోవడంతో ఆమెపై కక్ష పెంచుకున్నాడు. ఈ నెల 19న తన తండ్రి లాలూ, స్నేహితుడు జాన్‌తో కలిసి నూకరత్నం ఇంటికి వెళ్లి తన వెంట రావాలని ఒత్తిడి చేశాడు. అయితే ఆమె నిరాకరించడంతో ఆగ్రహానికి గురైన ఆలీషా వెంట తెచ్చుకున్న కత్తితో నూకరత్నంపై దాడి చేశాడు. ఈ దాడిలో నూకరత్నంకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే స్పందించి నిందితుడు ఆలీషా, అతని తండ్రి లాలూను అరెస్ట్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Also Read:Induction Safety: ఇండక్షన్ స్టవ్‌పై వండిన ఆహారం పిల్లలకు పెట్టొచ్చా? ఏవైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? 

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×