E-Paper
Advertisement

Balakrishna: మహానాడులో బాలయ్య ఎక్కడ? అందుకే రాలేకపోయారా?

Balakrishna: మహానాడులో బాలయ్య ఎక్కడ? అందుకే రాలేకపోయారా?
Advertisement

తెలుగుదేశం పార్టీ మహానాడు కడపలో అట్టహాసంగా జరిగింది. ఎన్టీఆర్ జయంతి వేడుకలు, పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు ఎన్నికతో సందడి నెలకొంది. అయితే హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మహానాడుకు హాజరు కాలేదు. దీంతో ఆయన ఎందుకు రాలేదనే చర్చ జరుగుతోంది. బాలయ్య రాకపోవడంపై ఎన్నో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బాలయ్య మహానాడుకు రాకపోవడానికి కారణం ఏంటి?.. బాలయ్య ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు?.. మహానాడులో ఆయన కనిపించకపోవడంపై వినిపిస్తున్న టాక్ ఏంటి?

బాలయ్య ఎక్కడ?

Advertisement

తెలుగు దేశం పార్టీ పసుపు పండగ మహానాడు కడప గడపలో ఘనంగా నిర్వహించారు. రాయలసీమ గడ్డపై నిర్వహిస్తున్న ఈ మహానాడులో పార్టీ నేతలు, కార్యకర్తల సందడి కనిపించింది. రాష్ట్రం నలుమూలల నుంచి టీడీపీ నేతలు, కార్యకర్తలు మహానాడుకు హాజరయ్యారు మహానాడు వేదికగా మంగళ, బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో పలు తీర్మానాలు ప్రవేశపెట్టి ఆమోదించారు.. ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించారు. చంద్రబాబును పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. చివరి రోజు భారీ బహిరంగసభ నిర్వహించారు. కడప వేదికగా జరుగుతున్న మహానాడులో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కనిపించలేదు.. దీంతో ఆయన ఎందుకు రాలేదనే చర్చ జరుగుతోంది.

అదే లోటు

Advertisement

కడప మహానాడులో నందమూరి వారసులు కనిపించని లోటు స్పష్టంగా కనిపించిందని తెలుగు తమ్ముళ్లు చర్చించుకుంటున్నారు. తొలిసారిగా కడప జిల్లాలో నిర్వహించిన మహానాడులో బాలకృష్ణ సందడి కనిపించకపోవడం పెద్ద లోటే అంటున్నారు. చంద్రబాబు నాలుగో సారి ముఖ్యమంత్రి అయ్యాక జరిగిన తొలి మహానాడు గ్రాండ్ సక్సెస్‌ అయింది. దిగ్విజయంగా మహానాడు జరిగితే బాలయ్య ఎక్కడ అని ప్రాంగణంలో టీడీపీ శ్రేణులు వెతుక్కోవడం కనిపించింది. ఎన్టీఆర్ రాజకీయ వారసుడిగా కొనసాగుతున్న బాలయ్య హిందూపురంలో వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. పార్టీలో పొలిట్‌బ్యూరో సభ్యుడిగా ఉన్నారు.

ఆ ఇద్దరూ దూరం..

ఎన్టీఆర్‌కి వారసులుగా హరికృష్ణ, బాలయ్య రాజకీయాల్లో ఉన్నారు. ఆ నందమూరి వారసులు ఇద్దరూ దాదాపు ప్రతి మహానాడులో పాల్గొన్నారు. హరికృష్ణ మరణించిన తర్వాత బాలకృష్ణ అటు సినిమాల్లో, ఇటు రాజకీయాల్లో యాక్టివ్‌ రోల్ పోషిస్తున్నారు. ఇక హరికృష్ణ తనయులు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్‌లు ఎప్పటి నుంచో పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఎన్టీఆర్‌ స్థాపించిన పార్టీ నిర్వహించే మహానాడు పార్టీ శ్రేణులకు పెద్ద పండుగలాంటిది. మూడురోజులపాటు పండగలా నిర్వహించే కార్యక్రమంలో బాలకృష్ణలో ఎప్పుడు స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా ఉండేవారు.

జార్జియాలో బాలయ్య

బాలయ్య టీడీపీ ప్రచార కర్తగా నాలుగు దశాబ్దాల నుంచి ఉన్నారు. ఎన్టీఆర్ కి కుమారుడిగా ముఖ్యమంత్రి చంద్రబాబుకి వియ్యంకుడిగా లోకేష్‌కి మామగా ఉన్న బాలయ్య అంతటి ప్రాధాన్యత కలిగిన మహానాడుకు హాజరు కాకపోవడం టీడీపీ వర్గాలను తీవ్రంగా నిరాశపరిచిందంట. అంతే కాదు బాలయ్య హైదరాబాద్‌లో ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళి కార్యక్రమంలో కూడా పాల్గొనలేదు. దాంతో బాలయ్య ఎక్కడ ఉన్నారు ఏమి చేస్తున్నారనే చర్చ నడుస్తోంది. ఆయన విదేశాలలో షూటింగ్ నిమిత్తం ఉండడంవల్లే మహానాడుకు హాజరుకాలేదంట. బాలయ్య అఖండ 2 మూవీ షూటింగ్‌ కోసం జార్జియా వెళ్లారని.. అక్కడ బిజీ షెడ్యూల్ కారణంగానే మహానాడుకు దూరంగా ఉన్నారని చెబుతున్నారు. ముందుగా ఫిక్స్‌ అయిన షెడ్యూల్‌ కారణంగానే బాలకృష్ణ సినిమా షూట్‌లో పాల్గొనాల్సి వచ్చిందనేది సినీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం. విదేశాల్లో షూటింగ్‌ పనుల వల్లనే మహానాడుకు దూరం ఉండాల్సి వచ్చింద తప్ప…ఎలాంటి వేరే కారణాలు లేవని అంటున్నారు నందమూరి ఫ్యాన్స్.

Also Read: 6 శాసనాలు ఎందుకు పెట్టారంటే.. లోకేష్ ఐడియా ఇదేనా..?

సెప్టెంబర్ 2న విడుదల

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబోలో అఖండ 2 : తాండవం మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాను ఈ ఏడాది సెప్టెంబర్ 25న పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ కారణంగా బాలయ్య బిజీగా ఉన్నారంట. సమయం దొరికినప్పుడు హిందూపురం నియోజకవర్గానికి వెళుతున్నారు. అంతేకాదు నందమూరి బాలకృష్ణకు ఇటీవల పద్మభూషణ్ అవార్డు వచ్చింది.. రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. అనంతరం హిందూపురంలో భారీ పౌర సన్మాన కార్యక్రమం కూడా నిర్వహించారు. ఆ తర్వాత బాలయ్య మూవీ షూటింగ్ కోసం జార్జియా వెళ్లానంట. అక్కడ షూటింగ్ బిజీ షెడ్యూల్ కారణంగా మహానాడుకు రాలేకపోయారంట. ఏదేమైనా నందమూరి కుటుంబం లేకుండా మహానాడు నిర్వహించడం పట్ల పార్టీ కార్యకర్తలు, నందమూరి అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారంట.

Story By: Apparao Tummala

Related News

యూట్యూబ్ లో అప్ లోడ్ అయిన మొదటి సినిమా ఏంటో తెలుసా ?

Construction Waste: హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో నివసిస్తున్నారా? అయితే బీ కేర్‌ఫుల్..?

స్మగ్లర్ల ధనదాహానికి 530 ప్రాణాలు బలి.. రోహింగ్యాలు జలసమాధి వెనుక ఉన్న బిగ్ స్కెచ్ ఇదేనా..?

Future City: ముచ్చర్ల పరిసర ప్రాంతాల్లో భూములు కొన్నారా?.. అయితే మీకో షాకింగ్ న్యూస్..!

యువ సంగ్రామ సదస్సు దేనికి సంకేతం?.. నిరుద్యోగుల కోసం కేసీఆర్ చేసిన టాప్ 5 స్టెప్స్ ఇవే!

బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుపై వివాదం.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలపై భారత్ క్లారిటీ!

అంగన్వాడీలకు గుడ్ న్యూస్.. ‘తల్లికి వందనం’ వర్తింపు.. ఆ మూడు రోజుల్లోనే అకౌంట్లలోకి రూ. 13 వేలు!

108 సంఖ్యకు అంత ప్రాముఖ్యత ఎందుకో ఎప్పుడైనా ఆలోచించారా ?

Big Stories

Advertisement
×