Kamal Haasan :కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఆల్ టైం బెస్ట్ యాక్టర్స్ లో ఒకరిగా పేరు సొంతం చేసుకున్నారు కమలహాసన్ (Kamal Haasan). ఇకపోతే తన నటనతో కోలీవుడ్ లోనే కాకుండా తెలుగు, హిందీ పరిశ్రమలో కూడా నటించి లోక నాయకుడిగా చెరగని ముద్ర వేసుకున్నారు. ఒకవైపు హీరోగానే కాకుండా మరొకవైపు రాజకీయ నాయకుడిగా కూడా చలామణి అవుతూ.. మరింత బిజీగా మారిపోయారు కమల్ హాసన్. ఇదిలా ఉండగా ఏడు పదుల వయసులో కూడా వరుస యాక్షన్ చిత్రాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈయన.. ఇప్పుడు 38 ఏళ్ల తర్వాత మళ్లీ మణిరత్నం (Manirathnam)తో కలిసి ‘థగ్ లైఫ్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. శింబు(Simbu), త్రిష కృష్ణన్(Trisha Krishnan), అభిరామి(Abhirami )కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమా జూన్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో వరుసగా ప్రమోషన్స్ పట్టిన కమలహాసన్ అందులో భాగంగానే తన సినిమా రిటైర్మెంట్ గురించి ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు.
రిటైర్మెంట్ ప్రకటించిన కమలహాసన్.. ఎప్పుడంటే
వాస్తవానికి గతంలో “రిటైర్మెంట్ అంటే మరణంతో సమానం” అని చెప్పిన కమలహాసన్.. తాజాగా మరోసారి రిటైర్మెంట్ విషయంపై మాట్లాడి అందరిని ఆశ్చర్యపరిచారు.థగ్ లైఫ్ సినిమా ప్రమోషన్ ఇంటర్వ్యూలో భాగంగా కమలహాసన్ తన రిటైర్మెంట్ గురించి మాట్లాడుతూ..” ప్రస్తుతం ఉన్న జనరేషన్ లేదా వచ్చే జనరేషన్ లో ఎవరైనా నన్ను మించిన నటులు కనిపిస్తే ఖచ్చితంగా నేను సినిమాలు వదిలేస్తాను” అంటూ కమలహాసన్ తెలిపారు.ప్రస్తుతం కమలహాసన్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. కమలహాసన్ చెప్పిన మాటలను బట్టి చూస్తే ఆయనను మించిన నటుడు మరొకరు రారు.. రాలేరు , ఇక ఆయన సినీ జీవితానికి.. నిజంగా ఆయన మరణమే రిటైర్మెంట్ అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
కమలహాసన్ కెరియర్..
లోక నాయకుడిగా పేరు సొంతం చేసుకున్న కమలహాసన్ బహుముఖ ప్రజ్ఞాశాలి. దక్షిణ భారత చిత్రాలలో అందులోనూ ఎక్కువగా తమిళ చిత్రాల్లో నటించినప్పటికీ దేశమంతటా సుపరిచితుడే. బాలనటుడు గా ఆయన నటించిన మొదటి చిత్రానికే నేషనల్ అవార్డు అందుకున్న ఈయన.. ఆ తర్వాత మూడు సార్లు ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు అందుకున్నారు. కమల్ హాసన్ నటుడు మాత్రమే కాదు దర్శకుడు, నిర్మాత, గాయకుడు, నృత్య దర్శకుడు, కథా రచయిత, మాటల రచయిత. ఇంత టాలెంటును తనలో దాచుకున్న ఈయన ‘మక్కల్ నీది మయ్యం’ అనే పార్టీని స్థాపించి, గత లోక్సభ ఎన్నికలలో డిఎంకె పార్టీతో పొత్తు పెట్టుకుని ఇప్పుడు రాజ్యసభ సీటుకి వెళ్తున్నట్లు వార్తలు కూడా వినిపిస్తున్నాయి.. ఇక కమల్ హాసన్ వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే.. 1978లో వాణి గణపతిని వివాహం చేసుకున్న ఈయన 1988లో ఆమెకు విడాకులు ఇచ్చారు. ఇక అదే ఏడాది సారికను వివాహం చేసుకున్న కమల్ హాసన్ కు శృతిహాసన్, అక్షరాహాసన్ అనే ఇద్దరు అమ్మాయిలు జన్మించారు. ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో 2004లో విడిపోయారు. ఇంక త్వరలో థగ్ లైఫ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న కమలహాసన్ ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.
ALSO READ:Sreeleela Engagement : ఓరేయ్ అబ్బాయిలు ఊపిరి పీల్చుకోండి.. శ్రీలీలకు ఎంగేజ్‌మెంట్ అవ్వలేదట…