BigTV English

Nara Lokesh Mark Politics: లోకేష్ మార్క్ పాలిటిక్స్.. ఇక తిరుగులేదు

Nara Lokesh Mark Politics: లోకేష్ మార్క్ పాలిటిక్స్.. ఇక తిరుగులేదు

Nara Lokesh Mark Politics: ఎన్నిక ఏదైనా కావచ్చు.. కానీ ముద్ర మాత్రం ఆయనదేనా? అన్నింటా తన మార్క్ చూపిస్తున్నారా? ఇకపై అంతా ఆయనే చూసుకోబోతున్నారా? ఎవరికైనా సీటు కావల్సి వస్తే.. అటు వైపు తిరిగి చూడాల్సిందేనా?ఇంతకీ ఎవరా లీడర్? ప్రెజంట్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అభ్యర్ధుల ఎంపికలో ఆయన పాత్ర ఎలాంటిది?


టీడీపీ ఫ్యూచర్ లీడర్ లోకేష్

ఏకగ్రీవం కావల్సిన చోట కూడా లోకేష్ మార్క్టీడీపీ ఫ్యూచర్ లీడర్ లోకేష్.. ఇది ఆ పార్టీలో కింది స్థాయి కేడర్ నుంచి పై స్థాయి కీ లీడర్స్ వరకూ అందరికీ తెలిసిన సింగిల్ ట్యాగ్ లైన్. యువగళం పాదయాత్ర నుంచి.. తన మార్క్ పాలిటిక్స్ చేసి చూపిస్తూ.. ఇటు కార్యకర్తలకు అటు నేతలకూ భరోసా ఇస్తున్నారు నారా లోకేష్. తనను నమ్ముకున్న వారికి తగిన ధైర్యాన్నిస్తూ.. ముందుకు సాగుతున్నారు లోకేష్.


జిల్లాల నేతలతో లోకేష్ నిరంతర పర్యవేక్షణ

మొన్నటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో డీఎస్సీ ఎఫెక్ట్ ఉంటుందని కొందరు కన్ ఫ్యూజ్ చేశారు. టీడీపీ ఓటమి ఖాయమని తెగేసి చెప్పారు. దీన్ని సీరియస్ గా తీస్కున్నారు లోకేష్‌. దీంతో జిల్లా నేతలతో నిరంతర పర్యవేక్షణ చేశారు. గెలుపు అవకాశాలపై తగిన సలహా సూచన చేశారు. ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసి చక్కటి ఫలితాలు సాధించారని అంటోంది కేడర్.

లోకేష్ తీస్కున్న కేరింగ్ వల్లే తమకింతటి గెలుపుగా చెప్పిన విన్నర్స్

లోకేష్ కృషి వల్లే.. పట్టభద్రుల ఎన్నికల్లో ఆలపాటిరాజా, పేరాబత్తుల రాజశేఖర్ అద్భుత విజయాన్ని మూట గట్టకున్నారనీ అంటారు.. ఈ సమయంలో లోకేష్ తీస్కున్న కేరింగ్ వల్లే తమకింతటి గెలుపు సాధ్యమైందని వారూ అన్నారు. ఈ కాన్ఫిడెన్స్ లెవల్స్ తోనే.. లోకేష్ ఈవీఎం మాత్రమే కాదు- బ్యాలెట్ లోనూ.. మనదే విజయం అంటూ ఒకింత గర్వంగా అన్నారనీ అంటారు.

టీడీపీ అభ్యర్ధులకు డబుల్ మెజార్టీ రావడం వెనక లోకేష్

ప్రత్యర్ధి వైసీపీ చేబుతున్నట్టుగా.. ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత లేదని ప్రూవ్ చేయాలంటే.. అందుకు ఎమ్మెల్సీ ఎన్నికల విజయం అత్యంత కీలకంగా గుర్తించారు లోకేష్. అందుకే ఈ ఎన్నికలను ఒక ఛాలెంజింగా తీస్కుని పోరాడారనీ చెబుతారు. మొన్నటి పీడీఎఫ్ అభ్యర్ధులకు వచ్చిన ఓట్లకంటే టీడీపీ అభ్యర్ధులకు ఎక్కువ ఓట్లు వచ్చాయంటే అందుకు లోకేష్ చక్రం తిప్పడమే కారణమని చెబుతారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన ఈ ఎన్నికల్లో యువత టీడీపీ వైపు ఉన్నట్టు నిరూపించింది కూడా లోకేషనని అంటారు.

ముగ్గురు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలో ఎంపికలోనూ లోకేష్ ముద్ర

తాజాగా ముగ్గురు ఎమ్మెల్సీ అభ్యర్ధుల ఎంపిక లోనూ లోకేష్ మార్క్ ఉందని అంటున్నారు. పార్టీ కోసం పని చేసిన వారికి ప్రయారిటీ ఇవ్వడంలో లోకేష్ ముద్ర కనిపిస్తోందని చెబుతున్నారు. గత ఐదేళ్ల కాలంలో వారు పార్టీకి చేసిన సేవ.. ఆనాటి ప్రభుత్వం ద్వారా ఎదుర్కున్న ఇబ్బందులను బేరీజు వేసుకుని లోకేష్ వీరికి తగిన న్యాయం చేశారని అంటున్నారు.

కావలి గ్రీష్మ, బీదా రవిచంద్ర, బీటీ నాయుడు..

వారూ వీరన్న తేడా లేదు.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఆశావహులందరూ లోకేష్ చుట్టూ ప్రదిక్షిణలు చేసిన వాళ్లే. అయినా సరే, లోకేష్ వారిని పట్టించుకోలేదనీ.. పార్టీలో క్రియాశీలంగా వ్యవహరించిన వారిని లోకేష్ తనదైన దృష్టికోణంలో గుర్తించారనీ గెస్ చేస్తున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్సీలుగా ఎంపికైన కావలి గ్రీష్మ, బీదా రవిచంద్ర, బీటీ నాయుడు.. వీరంతా లోకేష్ బ్రాండెడ్ క్యాండేట్సనీ అంటున్నారు.

గత వైసీపీ హయాంలో ఫైర్ బ్రాండ్ గా ముద్ర పడ్డ గ్రీష్మ

కావలి గ్రీష్మ.. గత వైసీపీ దాష్టీకాలను ధీటుగా ఎదుర్కున్నారు. పదునైన పదజాలంతో.. ప్రత్యర్ధులపై విరుచుకుపడ్డారు. ఫైర్ బ్రాండ్ గా ముద్ర పడ్డారు. నాటి మహానాడు వేదికపై నుంచి వైసీపీ నాయకులను తొడగొట్టి మరీ సవాల్ విసిరారు. అలాంటి గ్రీష్మలోని ఫైర్ గుర్తించిన లోకేష్ ఆమెకు తగిన ప్రాధాన్యత కల్పించారనీ చెబుతున్నారు.

ములాఖత్ లలో అన్నీ తానై వ్యవహరించిన బీటీ నాయుడు

గ్రీష్మతో పాటు ఎమ్మెల్సీగా ఎంపికైన బీటీనాయుడు, బీదా రవిచంద్ర విషయంలోనూ లోకేష్ ముద్ర స్పష్టంగా కనిపిస్తోందని భావిస్తున్నారు. మరీ ముఖ్యంగా బీటీనాయుడు.. చంద్రబాబు అరెస్టయిన సమయంలో.. చేసిన సాయం ఎన్నటికీ మరువలేనిదని అంటారు. రాజమండ్రిలో తిష్టవేసి.. ములాఖత్ ల విషయంలో.. బీటీ అన్నీ తానై వ్యవహరించారు. ఇందువల్లే.. ఆయనకీ ఎమ్మెల్సీ చాన్స్ దక్కిందని అంటారు. ఇదంతా బ్రాండ్ లోకేష్ లో భాగమని అంచనా వేస్తున్నారు.

లోకేష్ మాట జవదాటని నేతగా బీదాకు పేరు

ఇక బీదా రవిచంద్ర సైతం.. లోకేష్‌ మాట జవదాటరనీ అంటారు. దానికి తోడు బీదా నెల్లూరు- బీసీ సామాజిక వర్గంలో మంచి పలుకుబడి గల నేతగా పేరు సాధించారు. దీంతో ఆయనకీ సీటు దక్కినట్టు చెబుతారు. ఇటు సామాజిక వర్గ పరంగా అటు ప్రాంతాలకు సమన్యాయం వ్యవహారంలో భాగంగా.. లోకేష్ ఆచీ తూచి వ్యవహరించారనీ.. అందులో భాగంగా బీదాకు ఈ ఎమ్మెల్సీ అవకాశం లభించిందనీ చెబుతున్నారు.

Also Read: కథ అడ్డం తిరిగింది.. దేవినేనికి బాబు దెబ్బ!

ఇప్పుడు అందరి చూపూ లోకేష్ వైపు

ఇకపై పార్టీలో లోకేష్ అత్యంత కీలకంగా వ్యవహరిస్తారనీ మాట్లాడుకుంటున్నారు. తాజా ఎమ్మెల్సీ అభ్యర్ధుల ఎంపిక అందులో భాగమేనని లెక్కిస్తున్నారు. పార్టీలో ఇప్పుడు అందరి చూపూ లోకేష్ వైపే ఉందని అంటున్నారు. దానికి తోడు లోకేష్ యువతకు పెద్ద పీట వేస్తున్నారనీ.. అందుకే ఎందరో సీనియర్లకు అవకాశాలు మిస్ అవుతున్నట్టు భావిస్తున్నారు.

ఏకగ్రీవం కావల్సిన చోట కూడా లోకేష్ మార్క్

ప్రత్యక్ష ఎన్నికల్లో మాత్రమే కాదు.. ఏక గ్రీవం కావల్సిన అభ్యర్ధుల ఎంపికలోనూ.. లోకేష్ మార్క్ ఎంతో స్పష్టంగా కనిపిస్తోందని అంటున్నారు. వచ్చే రోజుల్లో.. ప్రతి ఎన్నికలోనూ.. లోకేష్‌ కీలక పాత్ర పోషించబోతున్నట్టు పార్టీ అంతర్గత వర్గాల సమాచారం.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×