BigTV English

Intinti Ramayanam Today Episode : పార్వతికి షాకిచ్చిన అవని.. పెళ్లి చెడగొట్టందుకు పల్లవి బిగ్ స్కెచ్..

Intinti Ramayanam Today Episode : పార్వతికి షాకిచ్చిన అవని.. పెళ్లి చెడగొట్టందుకు పల్లవి బిగ్ స్కెచ్..

Intinti Ramayanam Today Episode March 11 th: నిన్నటి ఎపిసోడ్ లో.. పెళ్లి వాళ్ళు వచ్చి అవనేని ఎలాగైనా తీసుకురావాలని మా ఇంట్లో వాళ్ళు మా బంధువులు కూడా రాజేంద్రప్రసాద్ గారి పెద్ద కోడలు గురించి మాట్లాడతారు అలాంటి మాటలు రాకుండా ఉండాలంటే కచ్చితంగా మీ పెద్ద కోడలు ఉండేలా చూసుకోండి అనేసి అంటారు. దానికి పార్వతి అలాగే అండి మా పెద్ద కోడలు పెళ్లికొస్తుంది అనేసి అంటుంది. వాళ్లని రాజన్న ప్రసాద్ వాళ్ళు బయటకు వెళ్లి పంపించేస్తారు ఆ తర్వాత పార్వతి దగ్గరికి వచ్చి రాజేంద్రప్రసాద్ అవని పిలిస్తే గాని రాదు మనం వెళ్లి పిలుద్దామా అనేసి అంటాడు కానీ పార్వతి మాత్రం అవనీని పిలుస్తానని ఎలా అనుకున్నారు అని షాక్ ఇస్తుంది. అవని ప్లేస్ లో వేరే అమ్మాయి ఉంటుంది అవనీని మొన్న వచ్చినందుకే ఏదోలా అనిపించింది అలాంటిది ఇప్పుడు మళ్ళీ ఎలా పిలుస్తానని మీరు అనుకున్నారు అని రాజేంద్రప్రసాద్ తో అంటుంది. పెద్ద కోడలు అనగానే సరే అన్నావ్ మరి ఎలా తీసుకొస్తావనేసి వాళ్ళు అడిగితే ఏం బాగుంటుంది అని రాజేంద్రప్రసాద్ అంటాడు. దానికి పార్వతి అవని ప్లేస్ లో నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది పెళ్లి అయ్యేంతవరకు కాసేపు అక్షయ్ భార్యగా ఉంటుంది ఆ తర్వాత వీళ్ళు ఎలాగో అమెరికాకు వెళ్ళిపోతారు కదా ఎవరు పట్టించుకోరు పెళ్లయిపోతుంది అనేసి పార్వతి సింపుల్ గా అనేస్తుంది. ఒక నాటకాలు ఆడే అమ్మాయిని తీసుకొచ్చి నీ కొడుకు పక్కన కూర్చో పెట్టాలనుకుంటున్నావా అని రాజేంద్రప్రసాద్ అడుగుతాడు. అటు అక్షయ్ కూడా ఎవరో అమ్మాయికి నేను భర్తగా యాక్ట్ చెయ్యాలి అని అంటాడు. దానికి పార్వతి మొత్తానికి ఒప్పుకుంటుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.


ఇక ఇక ఎపిసోడ్ విషయానికి వస్తే.. అవిని కోసం అక్షయ్ దయాకర్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు.. అవని నేను మీతో పాటు వస్తే బాగోదండి నన్ను ఏమని పరిచయం చేస్తారు అదే అత్తయ్య గారు వచ్చి నన్ను పిలిస్తే వాళ్లందరికీ నేనే కోడలునని పరిచయం చేస్తే నేను వస్తాను అని అప్పుడే అవని పెళ్లికి ఆ ఇంటి పెద్ద కోడలుగా నేను ఇంట్లోకి అడుగు పెడతానని అంటుంది. మీరు చెప్తే ఏం బాగుంటుంది అదే అత్తయ్య మామయ్య చెప్తే వాళ్లు వినడానికి కూడా బాగుంటుందని అవని అంటుంది. ఇక దయాకర్ స్వరాజ్యం కూడా పెళ్లికి తప్పకుండా వస్తామని చెబుతారు.. అవని కోసం నేను ఏమైనా చేస్తాను తప్పకుండా అమ్మ నాన్న ని పంపిస్తాను నువ్వు పెళ్లికి తప్పకుండా రావాలి అవని అని అక్షయ్ చెప్పేసి ఇంటికి వెళ్ళిపోతాడు. అక్కడ అక్షయ్ కోసం అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. అక్షయ్ రాగని నీకోసమే అందరూ వెయిట్ చేస్తున్నారు ఏంటి అవని రాననిందా రాలేనని చెప్పిందా అనేసి అడుగుతుంది పార్వతి. దానికి అక్షయ్ ఇంటికి పెద్దవాళ్లయిన అత్తయ్య మామయ్య పిలవకుండా నేను ఎలా రావాలి అని చెప్పింది లేదంటే నేను రాను అనేసి అన్నది అని అక్షయ్ అంటాడు.

నా కూతురు పెళ్లి కోసం నేను ఇంత తగ్గి ఆమెను ఇంటికి రమ్మనడానికి ఒప్పుకున్నాను. కానీ ఆమె మాత్రం ఇంత బెట్టు చేస్తుందని నేను అనుకోలేదు. ఆ మాట వినగానే కమల్ ఈ పెళ్లి జరగదు వాళ్ళ పట్టింపులు వాళ్లకు ఉంటాయి.. పెళ్లి వాళ్ళ నెంబర్ నాకు ఇవ్వండి నాన్న నేను ఈ పెళ్లి జరగదని చెప్తాను. ఆగిపోయే పెళ్లికి ఎందుకింత హడావిడి అని కమలంటాడు. నా కూతురు పెళ్లి ఆమె కోసం నేను ఆపుకోవాలా ఒప్పుకున్న పెళ్లికి మధ్యల చప్పుడు తప్పదు కదా.. కమల మాట అనగానే నా కూతురు పెళ్లి ఆప్కోవాల్సిన అవసరం నాకు లేదు నేను వెళ్లి ఆమెను పిలుస్తాను రాకపోతే నాకు సంబంధం లేదు అనేసి అంటుంది పార్వతి..


పార్వతి మొత్తానికి ఒప్పుకోవడంతో అందరూ సంతోషపడతారు. కమ్మలు చేసిన పనికి అటు శ్రీకర్ ఇటు రాజేంద్రప్రసాద్ అలాగే అక్షయ్ సంతోషపడతారు నువ్వు తెలివి తక్కువ వాడివి అనుకున్నాను కానీ ఇంత తెలివిగా ఇలా ప్లాన్ చేస్తావని అస్సలు అనుకోలేదనేసి రాజేంద్రప్రసాద్ కమల్ ని మెచ్చుకుంటాడు.. ఇక భానుమతికి కమల్ రోజుకు విధంగా టార్చర్ చూపిస్తాడు.

ప్రణతి పెళ్లికి ఎలాంటి చీరలు కట్టుకోవాలని భానుమతి ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అప్పుడే కమల్ కమలాకర్ వేషంలో వచ్చి వాళ్ళని అనుకుంటాడు. ఇక వెంటనే గెటప్ చేంజ్ చేసుకొని భానుమతి దగ్గరికి వస్తాడు చచ్చిన తర్వాత కాల్చే అన్నీ చీరలు నీకు ఉన్నాయి కానీ ఏ చీర కట్టుకోవాలి అని ఆలోచిస్తున్నావా? నా మనవరాలు పెళ్ళికి నాయనమ్మ అంటే ఆ మాత్రం ఉండాలి కదా నేను ఏ చీర కట్టుకుంటే బాగుంటానో చెప్పండి అని సిగ్గుపడుతుంది నువ్వు మొన్నటి లాగా జీన్స్ వేసుకుంటే ఇంకా బాగుంటావ్ అనేసి కమలాకర్ అంటాడు..

ఇక పల్లవి శ్రీయ ఇద్దరూ అవని ఇంటికి వస్తే మళ్లీ తన పెత్తనం కొనసాగిస్తుంది మన భర్తల్ని మనకి దూరం చేస్తుందని ఆలోచిస్తుంటారు కానీ పల్లవి మాత్రం ఇంటికి రావాల్సిందే ఇంటికి వచ్చిన తర్వాత అవని ఇంకా జన్మలో ఇంటికి రాకుండా నేను చేస్తాను కదా నువ్వేం టెన్షన్ పడకు సిస్ అనేసి అంటుంది. అటు ప్రణతి ఈ పెళ్లి నుంచి ఎలాగైనా తప్పించుకొని వెళ్ళిపోవాలని ఇంటి నుంచి పారిపోవాలని అనుకుంటుంది. రేపే పెళ్లి కావడంతో ఈరోజు నేను ఇంటికి ఎస్కేప్ అయిపోతే ఎవరికి అనుమానం రాదని బ్యాగ్ సర్దుకుంటుంది..

అవని కోసం చీరలను నగలను ఇస్తుంది. నీకు ఈ చీరలో ఈ నగల్లో ఏది నచ్చితే అది కట్టుకోమ్మా మీ ఆడబిడ్డ పెళ్లికి నువ్వు వెళ్తున్నావ్ ఆమాత్రం లేకుండా ఉంటే అస్సలు బాగదు చూసే వాళ్ళకే కాదు మాకు కూడా బాగోదు నీకు నచ్చింది కట్టుకో అనేసి అనగానే ప్రణతి పెళ్లికి వెళ్లడానికి కాదు పిన్ని.. ప్రణతి ఈ పెళ్లి ఇష్టం లేకుండా చేసుకుంటుందని నా అనుమానం నాకు ఫోన్ చేసి ఆరోజు రమ్మనింది. అయితే ఇప్పుడు తనకి పెళ్లి లే ఇష్టం లేదని నాకు అర్థమవుతుంది ఏది ఏమైనా కూడా ప్రణతి మనసులో ఏముందో నేను తెలుసుకోవడానికి అయినా ఆ ఇంటికి వెళ్ళాలి అనేసి అంటుంది. నీకు దయాకర్ స్వరాజ్యం కూడా మనం ఆ ఇంటికి వెళ్తున్నాం కదా అప్పుడు ప్రణతి మనసులో ఏముందో తెలుసుకొని దాని పరిష్కరించేలా చేద్దాం అనేసి అంటారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

Big Tv Kissik Talks: వాడి కోసం ప్రాణాలైనా ఇస్తా… థాంక్స్ చెప్పి రుణం తీర్చుకోలేను!

Big Tv Kissik Talks: అందుకే పిల్లల్ని వద్దనుకున్నాం..  బాంబు పేల్చిన అమర్!

Big Tv Kissik Talks:  అమర్ దీప్ , తేజు మధ్య గొడవలు.. ఇన్నాళ్లకు బయటపెట్టిన అమర్!

Anasuya: రాఖీ స్పెషల్.. అనసూయలో ఎంత మార్పు… ఇలానే ఉండొచ్చు కదా

Illu Illalu Pillalu Today Episode: రామరాజు, వేదవతిని కలిపిన నర్మద.. రచ్చ చేసిన భద్ర.. పోలీసుల ఎంట్రీ.. శ్రీవల్లికి షాక్..

Intinti Ramayanam Today Episode: పల్లవి ప్లాన్ సక్సెస్.. భరత్ కోసం అవని కన్నీళ్లు.. పార్వతికి దిమ్మతిరిగే షాక్..

Big Stories

×