Ysrcp Avinash Reddy: చేసిన తప్పులు ఎప్పటికైనా వెంటాడుతాయని పెద్దలు తరచూ చెబుతున్నారు. సరిగ్గా అదే మాట కడప ఎంపీ అవినాష్‌రెడ్డి విషయంలో నిజమైంది. అసలు ఏం జరిగిందో తెలీదు. ఓ ఫ్యామిలీ మేటర్‌లో అవినాష్‌రెడ్డి ఎంటరైనట్టు ఆరోపణలు వస్తున్నాయి. చివరకు ఆ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
కడప వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డి గురించి చెప్పనక్కర్లేదు. కడప నుంచి రెండుసార్లు వైసీపీ నుంచి ఎంపీగా గెలిచిన నేత. దీనికితోడు మాజీ సీఎం జగన్‌కు దగ్గర బంధువు. గడిచిన పదేళ్లు ఆయన చెప్పిందే అక్కడ మాట. ఎలాంటివారైనా సైలెంట్ కావాల్సిందే. ఎదురు తిరిగితే ఇబ్బందులు తప్పవు. ఇదే విషయం అనంతపురానికి చెందని శేషానందరెడ్డి వ్యవహారంలో అక్షరాలా నిజమైంది. ఇంతకీ అవినాష్‌రెడ్డి- శేషానందరెడ్డి మధ్య వ్యవహారమేంటి అనుకుంటున్నారా?
స్టోరీ ఏంటి?
స్టోరీలోకి వెళ్దాం.. అనంతపురానికి చెందిన శేషానందరెడ్డి నగర శివారులోని ఆకు తోటపల్లి ఇందిరమ్మ కాలనీలో ఉంటున్నాడు. ఆయనకు సరిగ్గా తొమ్మిదేళ్ల కిందట పెళ్లయ్యింది. 2016లో పులివెందులలోని సింహాద్రిపల్లికి చెందిన శ్వేతను శేషానందరెడ్డి మ్యారేజ్ చేసుకున్నారు. మరి ఏం జరిగిందో తెలీదు.
వివాహం జరిగిన కొద్దిరోజులకు దంపతుల మధ్య చిన్న చిన్న విభేదాలు తలెత్తాయి. ఈ క్రమంలో శ్వేత తన పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ విషయంలో భార్యభర్తల మధ్య తరచు సమస్యలు తలెత్తాయి. శేషానందరెడ్డి ఫ్యామలీ మేటర్‌లోకి అవినాష్‌రెడ్డి ఎంటరయ్యారు. ఆయన తన కుటుంబ విషయాల్లో జోక్యం చేసుకుంటున్నాడని శేషానందరెడ్డి ఆరోపించాడు.
ALSO READ: విజయసాయిరెడ్డికి షాకిచ్చిన సీఐడీ
బాధితుడి మాటలు
సోమవారం అనంతపురం జిల్లా పోలీస్ కార్యాలయంలో సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో శేషానంద రెడ్డి.. జిల్లా ఎస్పీ జగదీష్‌కు ఫిర్యాదు చేశాడు. కడప ఎంపీ అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డిపై బాధితుడు ఫిర్యాదు చేశాడు. తన కుటుంబ వ్యవహారాల్లో జోక్యం చేసుకొని అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి ఇబ్బంది పెడుతున్నారని ప్రధానంగా ప్రస్తావించాడు.
సీఐతో తప్పుడు కేసు పెట్టించి కొట్టించారని పేర్కొన్నారు. అప్పటినుంచి అవినాష్ రెడ్డి తనను మానసికంగా వేధిస్తున్నాడని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. భార్యకు నచ్చజెప్పి కాపురానికి తీసుకురావాలని సింహాద్రిపురానికి వెళ్లానని తెలిపాడు. తనపై అప్పటి పులివెందుల సీఐతో తప్పుడు కేసు పెట్టించి కొట్టించారని వాపోయారు.
తన భార్య, కుమార్తెను కలవకుండా పోలీసులతో బెదిరిస్తూ తనను మానసికంగా, శారీరకంగా ఇబ్బందులు పెడుతున్నారని తనగోడు వెల్లబోసుకున్నాడు. వారిద్దరిపై కేసు నమోదు చేసి తమకు న్యాయం చేయాలని ఎస్పీ ఎదుట మొర పెట్టుకున్నాడు బాధితుడు. వీరి నుంచి తనకు ప్రాణహాని ఉందన్నాడు. ఒకానొక సమయంలో అవినాష్ వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నానని చెప్పుకొచ్చాడు. శేషానందరెడ్డి ఫిర్యాదు స్వీకరించిన ఎస్పీ జగదీశ్ న్యాయం చేస్తానంటూ హమీ ఇచ్చారు.
శేషానందరెడ్డి వ్యవహారం గురించి కడప అంతా వ్యాపించింది. భార్యాభర్తల మధ్య వ్యవహారాల్లో జోక్యం చేసుకున్న అవినాష్‌రెడ్డిని నియోజకవర్గం ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు. దంపతులను కలవాల్సింది పోయి విడగొట్టడం ఎంతవరకు సబబు అని ప్రశ్నిస్తున్నారు. శేషానందరెడ్డి వ్యవహారంలో అవినాష్‌రెడ్డి జోక్యాన్ని తప్పుబడుతున్నారు. ఇది కేవలం బాధితుడి వైపు వెర్షన్ మాత్రమే. ఆ మహిళ వైపు వెర్షన్ ఎలా ఉంటుంది? ఈ వ్యవహారం ఇప్పుడు ఎలాంటి మలుపులు తిరుతుందో? వెయిట్ అండ్ సీ.