BigTV English

National Awards 2023: మెగాయాన్.. అవార్డులన్నీ మెగా హీరోల సినిమాలకే..

National Awards 2023: మెగాయాన్.. అవార్డులన్నీ మెగా హీరోల సినిమాలకే..
National Awards from Mega Family

National Awards from Mega Family(Cinema news in telugu):

టాలీవుడ్‌లో మెగా ఫ్యామిలీ హవా అందరికీ తెలిసిందే. ఇప్పుడు అవార్డుల్లోనూ మెగా కుటుంబం దుమ్ము రేపింది. మెగా హీరోలు నటించిన సినిమాలకు జాతీయ సినీ అవార్డుల పంట పండింది.


RRR. రాజమౌళి, తారక్, చరణ్‌ల పవర్‌ఫుల్ కాంబో. పాన్ ఇండియాను షేక్ చేసిన సినిమా. కలెక్షన్ల రికార్డులు బద్దలు కొట్టింది. ఇప్పుడు అవార్డులనూ గంప గుత్తగా కొట్టేసింది. ఏకంగా ఆరు జాతీయ అవార్డులు RRRకే.

బెస్ట్ పాపులర్ మూవీ, బెస్ట్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్- కీరవాణి, బెస్ట్ కొరియోగ్రాఫర్- ప్రేమ్ రక్షిత్, బెస్ట్ స్టంట్స్- కింగ్ సోలోమన్, బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్- శ్రీనివాస్ మోహన్, బెస్ట్ మేల్ ప్లేబ్యాక్ సింగర్-కాలభైరవ.. ఇవన్నీ త్రిబుల్ ఆర్ ఖాతాలోకే. ఈ మూవీలో రాంచరణ్ మెయిన్ లీడ్ హీరో కావడంతో.. ఈ అవార్డులను మెగా ఖాతాలోనే వేస్తున్నారు అభిమానులు.


పుష్ష. పుష్పరాజ్. తగ్గేదేలే. బన్నీ గురించి చెప్పేదేలే. టాలీవుడ్‌ నుంచి తొలిసారి.. జాతీయ ఉత్తమ నటుడు అవార్డును గెలుచుకున్నారు అల్లు అర్జున్. బన్నీ అవార్డు సైతం మెగా కాంపౌండ్‌లోకే.

ఇక, వరుణ్ తేజ్ హీరోగా నటించిన కొండపొలం సినిమాలోని పాటలకు గాను.. బెస్ట్ లిరిక్స్ అవార్డు ప్రముఖ పాటల రచయిత చంద్రబోస్‌ను వరించింది. RRRకు ఆస్కార్ అవార్డుతో పాటు.. ఇప్పుడు జాతీయ సినీ అవార్డు సైతం సాధించి చంద్రబోస్ శెభాష్ అనిపించుకుంటున్నారు. క్రిష్ డైరెక్షన్లో వచ్చిన కొండపొలం మూవీలో హీరో వరుణ్ తేజ్ కావడంతో.. ఈ అవార్డు కూడా మెగా హీరో సినిమాకు ఇవ్వాల్సిందే.

2021 ఏడాదికి గాను.. ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ సినీ అవార్డుకు ఎంపికైంది ‘ఉప్పెన’. మెగా హీరో వైష్ణవ్ తేజ్ ఫస్ట్ మూవీ ఇది. బుచ్చిబాబు డైరెక్షన్. వైష్ణవ్ తేజ్ తొలిసినిమాకే జాతీయ అవార్డు రావడంతో.. మెగా కుటుంబం ఫుల్ హ్యాపీగా ఉంది.

ఇలా.. టాలీవుడ్ నుంచి జాతీయ అవార్డులు గెలుచుకున్న సినిమాలన్నీ.. మెగా హీరోలవే కావడం ఆసక్తికరంగా మారింది. అందుకే, మెగా ఫ్యాన్స్ జోష్ తగ్గేదేలే.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×