E-Paper
Advertisement

నేపాల్ రాజకీయాల్లో పెను తుఫాను.. నెల తిరక్కుండానే కుప్పకూలుతున్న సర్కార్!

నేపాల్ రాజకీయాల్లో పెను తుఫాను.. నెల తిరక్కుండానే కుప్పకూలుతున్న సర్కార్!
Advertisement

Nepal Crisis: నిర్ణయాలు.. వాటి వల్ల నిరసన హోరు కొనసాగుతుండగానే.. నేపాల్ మంత్రి వర్గంలో ఇద్దరు కీలక మంత్రులు రాజీనామా చేయడం ఇప్పుడు కీలకంగా మారింది. ప్రభుత్వం ఏర్పడిన 26 రోజుల్లో ఇద్దరు మంత్రులు రాజీనామా చేయడం అనేది మాములు విషయం కాదు. ఎందుకంటే కొత్త ప్రభుత్వంపై అంచనాలు.. వారి వారి విద్యార్హతల గురించి ప్రపంచం మొత్తం చర్చించింది. అలాంటి సమయంలో ఇద్దరు మంత్రులు పదవులకు రాజీనామా చేశారు. హోంమంత్రిగా ఉన్న సుదాన్ గురుంగ్, కార్మిక మంత్రిగా ఉన్న దీపక్‌ కుమార్ షా రాజీనామాలు చేసిన వారిలో ఉన్నారు. ఆర్థిక లావాదేవీలకు సంబంధించి వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఏప్రిల్ 22న సుదాన్‌ గురుంగ్‌ రాజీనామా చేశారు. దర్యాప్తు నిష్పక్షపాతంగా జరగాలనే ఉద్దేశంతోనే తాను తప్పుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. ఇక దీపక్ కుమార్ తన భార్యను హెల్త్ ఇన్సూరెన్స్ బోర్డు సభ్యురాలిగా నియమించి, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనే ఆరోపణలతో మంత్రివర్గం నుంచి తొలగించారు.

మనీ లాండరింగ్ కేసుల్లో..

అయితే ఈ రాజీనామాలను ఇంత సింపుల్‌గా చూడటం లేదు నేపాల్ ప్రజలు. అవినీతి రహిత పాలన అందిస్తామని మాట ఇచ్చిన రాష్ట్రీయ స్వతంత్ర పార్టీకి ఇది అగ్ని పరీక్షలాంటిదే అని చెప్పాలి. ఎందుకంటే మనీ లాండరింగ్ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యాపారవేత్తలతో సంబంధాలు ఉన్నాయనేది సుదాన్‌ గురుంగ్‌పై ఆరోపణలు. దీనికి తగ్గట్టుగానే తన ఆస్తుల ప్రకటనలో పొంతన లేకపోవడం కూడా ఆయనపై ఒత్తిడి పెంచింది. దీంతో పదవి కంటే నైతికత ముఖ్యమంటూ ఆయన రాజీనామా చేశారు. సుదన్ గురుంగ్ వైదొలగడంతో హోం శాఖ బాధ్యతల్ని ప్రధాని బాలెన్ షానే చూసుకుంటున్నారు. పదవి చేపట్టిన 13 రోజులకే ఆయన పదవి కోల్పోయాడు కార్మిక శాఖ మంత్రి దీపక్ కుమార్ షా.

పదవి కాలం..

Advertisement

నేపాల్ చరిత్రలో గత 30 ఏళ్లలో ఏ ప్రభుత్వం కూడా ఐదేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేయలేదు. తాజాగా ఏర్పడిన ప్రభుత్వం పూర్తిగా యువత మద్దతుతో, కొత్త ముఖాలతో కొలువుదీరింది. అయితే పరిపాలనా అనుభవం లేకపోవడం, ప్రతిపక్షాల నుంచి ఎదరువతున్న ఒత్తిడిని తట్టుకోవడం బాలెన్ షాకు సవాలుగా మారింది. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం తదితర సమస్యలను పరిష్కరించడంలో ఆలస్యమైతే.. ఈ ప్రభుత్వంపై ఉన్న ప్రజల నమ్మకం త్వరగానే సన్నగిల్లే ప్రమాదం ఉంది.

Also Read: RTC కార్మికుల సమ్మె.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

17 ఏళ్లల్లో 14 ప్రభుత్వాలు

Advertisement

అగ్నికి ఆజ్యం పోసినట్టుగా ఇప్పటికే ఇప్పుడు పరిస్థితులు మారాయి. నేపాల్ హిస్టరీని చూస్తే ఇప్పుడు భవిష్యత్తుపై ఆందోళన నెలకొంది. ఎందుకంటే 2008 నుంచి 2025 దాకా.. అంటే 17 ఏళ్లల్లో 14 ప్రభుత్వాలు మారాయి. అక్కడ అన్ స్టెబులిటీ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడూ కీచులాటలు, అవినీతి ఆరోపణలు, అధికార దుర్వినియోగం, ఆర్థిక అక్రమాలు, విదేశీ నిధుల మళ్లింపు అనేవి కామన్‌గా మారాయి. వీటికి తోడు విపరీతమైన రేట్లు, నిరుద్యోగం, విద్య, ఆరోగ్య రంగాల్లో ప్రభుత్వ వైఫల్యం.. ఇవన్నీ నేపాలీల్లో అసంతృప్తి ఉంటుంది. ఆర్థిక అసమానతలు, పేదరికం తీవ్రం కావడంతో ప్రజాస్వామ్యంపై చాలా మంది నమ్మకం కోల్పోయారు. ఫైనల్ గా ఇవన్నీ నేపాల్ కొంప ముంచాయ్. పక్కనున్న భూటాన్ ప్రశాంతంగా ఉంటే.. నేపాల్ మాత్రం అల్లకల్లోలంగా ఉంటోంది. హిమాలయాలు ఉన్నా.. టూరిజం అడ్వాంటేజ్ గా ఉన్నా.. చిన్న దేశమైనా… తలరాత మార్చుకోలేకపోయారు.

హోం మంత్రి పదవిని..

వీటిపై చిరాకు పెరిగే యువత రోడ్డుపైకి వచ్చి ఆందోళన బాట పట్టింది. ఈ ఆందోళనల్లో ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్న నేతలు కీలకపాత్ర పోషించారు. ఫర్ ఎగ్జాంపుల్‌ సుదాన్ గురుంగ్.. ఆయన జెన్ జీ ఆందోళనల సమయంలో నిరసనకారులకు తాగునీరు అందిస్తూ, గ్రౌండ్ లెవల్‌లో చురుగ్గా పనిచేసి మంచి పేరు సంపాదించారు. అందుకే ఎన్నికల్లో గోర్ఖా-1 నియోజకవర్గం నుండి గెలిచారు. ఆయనపై ఉన్న మంచిపేరు కారణంగానే బాలెన్ షా క్యాబినెట్‌లో అత్యంత కీలకమైన హోం మంత్రి పదవిని దక్కించుకున్నారు. కానీ చివరికి పదవి పోయింది. దీపక్ కుమార్ కూడా రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ ప్రతినిధిగా మంచి పేరు ఉంది. కానీ సొంత వారి కోసం అధికారాన్ని దుర్వినియోగం చేశారనే ఆరోపణలు వచ్చాయి.

Also Read: మ్యూల్ ఖాతాలపై సజ్జనార్ సర్జికల్ స్ట్రైక్.. బ్యాంక్ అధికారులకు తప్పని అరెస్టులు!

నేపాల్‌లో రాచరికానికి చెక్..

ఇప్పుడీ అసంతృప్తిని ఎంత త్వరగా కంట్రోల్ చేస్తే.. బాలేన్ షా ప్రభుత్వం అంత ఎక్కువ అధికారంలో ఉంటుంది. లేదంటే నేపాల్‌లో ప్రభుత్వాలను గద్దె దింపడం.. మళ్లీ కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం కొత్త కాదు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. నేపాల్ రాజకీయ ప్రయాణం అంతా డ్రమటిక్‌గానే సాగుతూ వస్తోంది. 1769 నుంచి 2008 వరకు దాదాపు 240 ఏళ్ల పాటు షా సహా ఇతర రాజవంశీయులు నేపాల్‌ను పాలించారు. అయితే రాజు ఉన్నా పర్వా లేదు పార్లమెంటరీ ప్రజాస్వామ్యం కూడా కావాలని 1990ల్లోనే అక్కడ ఉద్యమం నడిచింది. దీంతో మన అధికారాలు ఏమీ పోవట్లేదు కదా అని నాటి రాజు బీరేంద్ర ఒప్పుకున్నారు. అయితే 2001లో జరిగిన అనూహ్య సంఘటన నేపాల్‌లో రాచరికానికి చెక్ పెట్టింది. బీరేంద్ర కుమారుడు దీపేంద్ర తన తండ్రి, తల్లితో పాటు సోదరులు, సోదరిమణులను హతమార్చారు. ఆ తర్వాత తానూ సూసైడ్ చేసుకున్నాడు. ఆ తర్వాత బీరేంద్ర సోదరుడు జ్ఞానేంద్ర షా పీఠంపై కూర్చున్నాడు. 2005లో జ్ఞానేంద్ర పార్లమెంటును రద్దు చేసి అధికారం చేజిక్కించుకోవడాన్ని నేపాలీలు జీర్ణించుకోలేకపోయారు. దీంతో 2006లో ప్రజాస్వామ్యాన్ని మళ్లీ తీసుకొచ్చారు. దీంతో 2008లో రాచరికం రద్దై లౌకిక, గణతంత్ర రాజ్యంగా నేపాల్‌ అవతరించింది. అక్కడితో పరిస్థితి బాగుంటే నేపాల్ తలరాత మారిపోయి ఉండేది. కానీ దురదృష్టం నేపాల్ ను వెంటాడింది.

జెన్‌ జీ ఉద్యమం..

నేపాల్‌లో ప్రజాస్వామ్యం వచ్చినా అధికార మార్పిడి రెగ్యులర్‌గా కనిపించిందనే చెప్పాలి. దీంతో ప్రజల్లో ప్రస్తుతం ఉన్న పార్టీలపై అసహనం మెుదలైంది. హంగ్ పార్లమెంట్ రావడం, సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడడం, నేపాలీలు కూడా ఒక పార్టీకి ఫుల్ గా సపోర్ట్ ఇవ్వకపోవడం ఇవన్నీ రాజకీయ అస్థిరతకు కారణమయ్యాయి. అవినీతి పెరిగింది. ఆర్థిక కష్టాలు వెంటాడాయి. దీంతో ఈ మధ్యే రాచరికాన్ని పునరుద్ధరించాలంటూ ఆందోళనలు కూడా చేశారు. అలాంటి సమయంలో జెన్‌ జీ ఉద్యమం జరగడం.. ఫుల్‌ మెజారిటీతో ప్రభుత్వం ఏర్పడటం నేపాల్‌ ప్రజల్లో కొత్త ఆశలను చిగురించేలా చేసింది. కానీ ఇప్పుడు నెల రోజులు కూడా గడవకముందే మళ్లీ ఈ ఆశలకు బీటలు కనిపిస్తున్నాయి. మరీ బాలేన్ షా ప్రభుత్వం వీటిని కంట్రోల్ చేయడానికి కావాల్సిన నిర్ణయాలు తీసుకుంటుందా? లేదా? అనే దానిపైనే ఇప్పుడు నేపాల్ భవితవ్యం ఆధారపడి ఉంది.

Also Read: హుజూరాబాద్‌ భవిష్యత్తును బొందపెడతారా.. ఎమ్మెల్సీ అంజిరెడ్డి ఫైర్..?

Related News

ఆరునూరైనా కేసీఆర్ సీఎం.. పోలీసుల తోలుతీసే ప‌నిపైనే మొద‌టి సంత‌కం..!

రైతుబీమా ప‌థ‌కం ఉందా? లేదా? హ‌రీశ్‌, కేటీఆర్ త‌లోమాట‌..!

వెల‌మ‌- రెడ్ల పంచాది.. నీదే జాతన్న సీఎంకు కౌంట‌ర్ ఇచ్చిన కేటీఆర్‌!

సూర్యుడు ఉదయాన్నే పెద్దగా ఎందుకు కనిపిస్తాడో ఎప్పుడైనా ఆలోచించారా ?

56 ఇంచుల ఛాతి.. 56 ఏళ్ల యువ‌కుడు… మ‌ధ్య‌లో జెన్‌-జీ కాక్రోచ్‌!

భేష్‌.. ఫండ్ పైస‌లు పంపిణీ.. బీఆరెస్ పార్టీ ఫండ్ నుంచి బాధిత రైతుల‌కు భ‌రోసా..

రూటు మార్చిన బీఆర్ఎస్.. జెన్-జి లక్ష్యంగా పాలిటిక్స్.. కేటీఆర్ వ్యూహం ఇదేనా?

తెగేదాక లాగ‌క‌పోవ‌డ‌మే మేలు..70వేల ఉద్యోగాల‌పై కేటీఆర్ వ్యూహంలో చిక్కుకున్న‌ కాంగ్రెస్!

Big Stories

Advertisement
×