BigTV English

Online Music: యూత్ లో మ్యూజిక్ క్రేజ్.. సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడి..

Online Music: యూత్ లో మ్యూజిక్ క్రేజ్.. సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడి..

Online Music: సంగీతం అంటే ఇష్టపడనివారు ఈ భూమ్మీద ఎవరైనా ఉంటారా చెప్పండి? మ్యూజిక్‌ను వినడం వరకే కాదు స్ట్రీమింగ్‌ సర్వీస్‌ల ద్వారా సంగీతంపై అవగాహన ఏర్పరచుకుని ఆ అవగాహనతో యువ సంగీత ప్రేమికులు, శ్రోతలు స్పాటిఫై, యాపిల్‌ మ్యూజిక్, ఆడియో మ్యాక్‌ మొదలైన స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా మ్యూజిషియన్‌లుగా మారుతున్నారు. దీన్నే కెరీర్ గా ఎంచుకుంటే లైఫ్‌లో సెటిల్ అయిపోవచ్చు.


శ్రోతలు సంగీతం వినే విధానంలో గత కొన్ని సంవత్సరాలుగా మార్పు వచ్చింది. ఇంటర్నెట్‌ యూజర్‌లను దృష్టిలో పెట్టుకొని ఇంటర్నేషనల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ది ఫోనోగ్రాఫిక్‌ ఇండస్ట్రీ(ఐఎఫ్‌పీఐ) చేసిన సర్వేలో 78 శాతం మంది స్ట్రీమింగ్‌ సర్వీసుల ద్వారా మ్యూజిక్‌ను వింటున్నట్లు తెలిసింది. అందులో యువతరం ఎక్కువ. అయితే యువతరంలో కొంతమంది సంగీతాన్ని విని ఎంజాయ్‌ చేయడానికి మాత్రమే పరిమితం కావడం లేదు. తమను ప్రపంచానికి పరిచయం చేసుకునే వేదికలుగా స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగించుకుంటున్నారు.

యంగర్‌ జనరేషన్‌ ఏం వింటుంది? దేనికి కనెక్ట్‌ అవుతుంది? అనేదానిపై మ్యూజిక్‌ స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్స్‌ ప్రధానంగా దృష్టి పెడుతున్నాయి. ఫిల్మ్‌ మ్యూజిక్‌ మాత్రమే కాదు ఇండిపెండెంట్‌ మ్యూజిక్‌ వినడానికి కూడా శ్రోతలు ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇండిపెండెంట్‌ మ్యూజిక్‌తో వివిధ మాధ్యమాల ద్వారా తమను తాము నిరూపించుకునే అవకాశం యువ కళాకారులకు ఉంది.


Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×