E-Paper
Advertisement

Pawan Kalyan Warns MLAs: క్యాబినెట్‌ మీటింగులో పవన్ చిచ్చు

Pawan Kalyan Warns MLAs: క్యాబినెట్‌ మీటింగులో పవన్ చిచ్చు

Pawan Kalyan Warns MLAs:  క్యాబినెట్ సమావేశంలో ఎమ్మెల్యేల తీరుపైన డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ ఆగ్రహంతో చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెద్ద చర్చకు దారితీస్తున్నాయట. ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడుతున్నారని, సెటిల్మెంట్లు చేస్తున్నారంటూ నేరుగా క్యాబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేయడం హాట్‌టాపిక్‌గా మారిందట. అంతేకాదు తప్పు చేసిన ఎమ్మెల్యేలను వదలొద్దని ఎస్పీలకు, కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వాలని సీఎం కోరడం రాజకీయంగా దుమారం రేపుతోందంట. ఇంతకీ పవన్ కళ్యాణ్ నేరుగా క్యాబినెట్ సమావేశంలోనే ఎమ్మెల్యేల అంశాన్ని ఎందుకు ప్రస్తావించారు? పవన్ వ్యాఖ్యల వెనుక రాజకీయ కోణం ఉందా?

క్యాబినేట్ మీటింగులో పవన్‌కళ్యాణ్ కీలక వ్యాఖ్యాలు

కూటమిలోని ఎమ్మెల్యేల పనితీరుపైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్యాబినెట్ వేదికగా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయంశమవుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేల తీరు పైన చాలా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయనే చర్చ నడుస్తుందట. అవినీతి, సెటిల్మెంట్లు పంచాయతీలు చేస్తున్నరనే ఆరోపణలతో విపక్షం దుమ్మెత్తిపోస్తున్న పరిస్ధితి.

ఇదే అంశానికి సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కూడా పార్టీ నేతల సమావేశంలో.. అనేక సందర్భాల్లో ప్రస్తావించారు.. కొంతమంది ఎమ్మెల్యేల వ్యవహార తీరు కారణంగా పార్టీకి, కూటమికి ఇబ్బంది కలిగేలా ఉందని పదేపదే చంద్రబాబు మందలిస్తున్నారు. మొన్న జరిగిన క్యాబినెట్ సమావేశంలో జిల్లా ఇన్చార్జి మంత్రులు ఎమ్మెల్యేలపై ఫోకస్ పెట్టాలని, ఎమ్మెల్యేలను సమన్వయం చేసుకొని వారిని దారిలో పెట్టాల్సిన బాధ్యత జిల్లా ఇన్చార్జి మంత్రులుదేనని స్పష్టం చేశారు చంద్రబాబు.

ఎమ్మెల్యేలపై ఆరోపణలను సీఎం దృష్టికి తీసుకెళ్లిన పవన్

ఇక్కడ వరకు బాగానే ఉన్నా… అదే సమావేశంలో ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందిస్తూ ఎమ్మెల్యేల పై వస్తున్న ఆరోపణలను చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చారు.. చాలామంది ఎమ్మెల్యేలు రెవిన్యూ వ్యవహారాల్లో తల దురుస్తున్నారని, పంచాయతీలు చేస్తున్నారని చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. అయితే పవన్ కళ్యాణ్… అంత మంది మంత్రుల మధ్యలో క్యాబినెట్ సమావేశంలో ఎమ్మెల్యేల గురించి ఆ విధంగా మాట్లాడడంపైన భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయట.

కూటమిలో ఏదైనా సమస్యలు ఉన్నా, ఎమ్మెల్యేలతో ఇబ్బందులు ఉన్నా.. పార్టీ అధినేతలు ఇద్దరూ కూర్చున్న సమయంలో చెప్పాల్సిన విషయాలను క్యాబినెట్ వేదికగా చెప్పడం సరైన విధానం కాదు అనే వాదన టిడిపి నుంచి వినిపిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ముందే ఎమ్మెల్యేలు అవినీతి చేస్తున్నారని ఆరోపించడం… అందులోనూ క్యాబినెట్ సమావేశంలో ప్రస్తావించడం వల్ల ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లాయన్న అభిప్రాయం కొంతమంది టీడీపీ ఎమ్మెల్యేలు వ్యక్తం చేస్తున్నారట.

టీడీపీలో చిచ్చు రేపుతున్న డిప్యూటీ సీఎం వ్యాఖ్యలు

అయితే క్యాబినెట్ సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టిడిపి ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారా…అనే అనుమానాన్ని కూడా కొంతమంది టీడీపీ ఎమ్మెల్యేలు వ్యక్తం చేస్తున్నారట. ఎమ్మెల్యేల పేర్లు ప్రస్తావించకుండా, పార్టీ పేరు ప్రస్తావించకుండా ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడుతున్నారంటూ మాట్లాడటంపై టిడిపి ఎమ్మెల్యేల్లో చర్చ జరగడంతోపాటు కొంత మంది ఎమ్మెల్యేలు గుర్రుగా ఉన్నారట.

తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఎప్పుడు బహిరంగ వేదికల పైన, అంతర్గత సమావేశాల్లో పార్టీ నేతలు కూర్చున్న సందర్భంలో జనసేన పార్టీ గురించో, బిజెపి గురించో మాట్లాడలేదని… కానీ పవన్ కళ్యాణ్ తెలుగుదేశం ఎమ్మెల్యేలను టార్గెట్ చేసే విధంగా మాట్లాడడం సరైన విధానం కాదనే అంశాన్ని టీడీపీ ఎమ్మెల్యేలు చర్చించుకుంటున్నారట. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు జనసేన ఎమ్మెల్యేలు కూడా వర్తిస్తాయా…లేక మిగతా పార్టీల ఎమ్మెల్యేలకు వర్తిస్తాయా అనే దానిపై కూడా పవన్ క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారట.

ఎవరికి వారు విడిగా సమావేశాలు

పార్టీలు కూటమిగా అధికారంలో ఉన్నప్పటికీ … పార్టీల వారీగా ఎవరికి వారు ఎమ్మెల్యేలతో ఎప్పటికప్పుడు విడిగా సమావేశాలు పెట్టుకుంటున్నారు. పార్టీ భవిష్యత్తు, పార్టీ నిర్మాణం వంటి వాటి మీద ఎవరికి వారు ఫోకస్ పెడుతున్నారు. కానీ ప్రభుత్వ పరంగా మూడు పార్టీలు కలిసినప్పుడు మెజార్టీ ఎమ్మెల్యేలు ఉన్న తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేస్తూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేయడం పార్టీకి ఇబ్బంది కలిగించే అంశం అన్న అభిప్రాయాన్ని కొంతమంది నేతలు వ్యక్తం చేస్తున్నారట. క్యాబినెట్లో పవన్ కళ్యాణ్ మాట్లాడిన.. తర్వాత జరుగుతున్న చర్చ టిడిపిని ఇబ్బంది పెట్టే విధంగానే ఉందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారట.

ప్రభుత్వ నిర్ణయాలను ప్రశ్నిస్తున్నారని టాక్

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత.. మొదటి ఆరు నెలలు పెద్దగా స్పందించన పవన్ కళ్యాణ్.. తర్వాత నుండి జరుగుతున్న క్యాబినెట్ సమావేశంలో ఏదో ఒక అంశాన్ని…ప్రభుత్వ నిర్ణయాలను గట్టిగానే ప్రశ్నిస్తున్నారని టాక్ ఉందట. రెండు నెలల ముందు లూలు మాల్ వ్యవహారంపై క్యాబినెట్ సమావేశంలో పవన్ కల్యాణ్ గట్టిగానే మాట్లాడారు… ప్రతి క్యాబినెట్లో ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలలో ఏదైనా అనుమానాలు ఉన్నా అభ్యంతరాలు ఉన్నా పవన్ కళ్యాణ్ ఇన్వాల్ అవుతున్నారని…ఇష్యూల వారీగా స్పందిస్తున్నారని మంత్రులు సైతం చెప్పుకుంటున్నారు. క్యాబినెట్ సమావేశాల్లో ఏ ఒక్క మంత్రి కూడా మాట్లాడరని…పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ ఇద్దరు మాత్రమే ప్రభుత్వ నిర్ణయాలను ప్రశ్నిస్తూ ఉంటారనే టాక్ నడుస్తుందట.

మరోవైపు ఎమ్మెల్యేల తీరుపైన, ఎమ్మెల్యేలు అవినీతి గురించి నేరుగా క్యాబినెట్లో ప్రస్తావించడం వెనుక పవన్‌కు రాజకీయ కోణం ఏమైనా ఉందా అని కొంతమంది నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారట. కూటమిగా ప్రభుత్వాన్ని నడుపుతున్నప్పటికీ…. టిడిపి ఎమ్మెల్యేలు మీద వస్తున్న అవినీతి ఆరోపణల మరకలు జనసేన పార్టీకి అంట కూడదనే భావనలోనే పవన్ ఈ విధంగా రియాక్ట్ అవుతున్నారనే సందేహాలు కూడా వ్యక్తం చేస్తున్నారట.

ముందుగానే జాగ్రత్త పడుతున్నాడా పవన్ కళ్యాణ్

భవిష్యత్తులో ఏదైనా ఇబ్బందికర పరిస్థితి ఎదురైనప్పుడు మాట్లాడడానికి అవకాశం లేకుండా…తమ మీద నిందలు వేయకుండా ఉండడానికి పవన్ ఇప్పటి నుండే జాగ్రత్త పడుతున్నారా అనే భావన కూడా కొంతమంది నేతలు వ్యక్తం చేస్తున్నారట. ఎమ్మెల్యేల అంశాన్ని ప్రస్తావించడం…క్యాబినెట్ నిర్ణయాలను ప్రశ్నించడం ద్వారా పవన్ కళ్యాణ్ తన విషయంలో జరుగుతున్న ప్రచారానికి చెక్ చేపట్టడానికి చూస్తున్నారేమో? అన్న అభిప్రాయాన్ని కొంతమంది టీడీపీ నేతలు వ్యక్తం చేస్తున్నారట.
పవన్ కళ్యాణ్ సైలెంట్ గా ఉంటూనే… భవిష్యత్తులో అనుకోని పరిస్థితులు ఎదురైనప్పుడు తనకు ఎలాంటి మరకలు అంటకుండా ప్రయత్నాలు చేస్తున్నారనేది పొలిటికల్ సర్కిల్స్‌లో నడుస్తున్న చర్చ. ఏది ఏమైనప్పటికీ … కూటమిలో పవన్ వైఖరి కొంత భిన్నంగా ఉందని…. క్యాబినెట్ సమావేశాల్లో ఆయన ప్రస్తావిస్తున్న అంశాలు, విషయాలను గమనిస్తే…. రాజకీయంగా చాలా లోతుగా పవన్ కళ్యాణ్ ఆలోచించి ముందుకు వెళుతున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారట.

Story by Apparao, Big Tv

Related News

Amaravati: చంద్రబాబు కేబినెట్ భేటీ.. మధ్యలో వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్, ఏం జరిగింది?

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

Big Stories

×