E-Paper
Advertisement

కూటమిలో మొదైన సీట్ల పంచాయితీ.. జనసేన నెక్స్ట్ స్టెప్ ఏంటి?

కూటమిలో మొదైన సీట్ల పంచాయితీ.. జనసేన నెక్స్ట్ స్టెప్ ఏంటి?
Advertisement

Jana Sena: గత సార్వత్రిక ఎన్నికల్లో పొత్తు ధర్మం కోసం జనసేన కేవలం 21 అసెంబ్లీ, 2 ఎంపీ స్థానాలకే పరిమితమై 100% స్ట్రైక్ రేట్ సాధించింది. అయితే, ప్రభుత్వం ఏర్పడ్డాక ఎమ్మెల్యేలు, ఎంపీలకు పదవులు వచ్చాయి కానీ… రాత్రింబవళ్లు కష్టపడిన ద్వితీయ శ్రేణి నాయకులు, జనసైనికులు, వీరమహిళలకు నామినేటెడ్ పోస్టులు పరిమితంగానే దక్కాయి.

పవన్ ప్లాన్..

Advertisement

ఇప్పుడు సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, వార్డు మెంబర్ పదవుల ద్వారా మాత్రమే క్షేత్రస్థాయి కార్యకర్తలకు పొలిటికల్ రికగ్నిషన్ దక్కుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు పడినా.. పల్లెల్లో గ్రామ స్థాయి కమిటీలు, స్ట్రాంగ్ కేడర్ బేస్ లేకపోవడం జనసేనకు పెద్ద వీక్‌నెస్. ఈ లోకల్ ఎలక్షన్స్‌లో ఎక్కువ సీట్లు గెలిస్తేనే, పల్లెల్లో జనసేనకు శాశ్వత కేడర్ పునాది పడుతుందనేది పవన్ ప్లాన్.

ఉపాధి హామీ పనులపై ప్రత్యేక శ్రద్ధ..

Advertisement

మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే… పవన్ కళ్యాణ్ ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా.. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలను చూస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రక్షిత మంచి నీరు, రోడ్ల నిర్మాణం, ఉపాధి హామీ పనులపై ఆయన ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఈ శాఖల ద్వారా పల్లెల్లో వచ్చిన గుర్తింపును, గుడ్ విల్‌ను… ఎన్నికల్లో ఓట్ల రూపంలోకి మార్చుకోవచ్చనే నమ్మకంతో జనసేన లీడర్‌షిప్ ఉంది.

ఈసారి సీట్ల విషయంలో తగ్గేదేలే..

ఇక పొత్తు విషయానికి వస్తే… ‘అసెంబ్లీ ఎన్నికల్లో త్యాగాలు చేశాం, ఇప్పుడు కార్యకర్తల భవిష్యత్ ముఖ్యం’ అని పవన్ ఓపెన్‌గా చెప్పడం వెనుక క్లియర్ సిగ్నల్ ఉంది. ఈసారి సీట్ల విషయంలో తగ్గేదే లేదనేది ఆయన ఆలోచన. ముఖ్యంగా గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్ర, కృష్ణా వంటి స్ట్రాంగ్ బెల్ట్స్‌లో కనీసం 40 నుండి 50 శాతం స్థానాలు కోరేందుకు జనసేన సిద్ధమవుతోంది.

జనసేనకు అసలు సిసలు పరీక్షేది?

అయితే, ఇక్కడే అసలు ఛాలెంజ్ ఉంది. పంచాయతీ ఎన్నికలకు పార్టీ గుర్తులు ఉండవు కాబట్టి ఊళ్లలో సహజంగానే స్థానిక పోటీ ఉంటుంది. కానీ ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీతో గ్యాప్ రాకుండా సీట్లు సర్దుబాటు చేసుకోవడం పెద్ద టాస్క్. ఒకవేళ టీడీపీ నుంచి ఆశించిన స్థాయిలో సీట్లు రాకపోతే… కొన్ని ప్రాంతాల్లో Friendly Contest కి వెళ్లినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

సీట్ల పంపకాలపై చర్చ..

కాగా, నిన్న చంద్రబాబుతో జనసేన, బీజేపీ నేతల మీటింగ్‌లో ఇప్పటికే సీట్ల పంపకాలపై ప్రాథమికంగా అవగాహనకు వచ్చినట్లు తెలుస్తోంది. మరి చివరికి జనసేన కాంప్రమైజ్ అవుతుందా..? తగ్గేదేలే అంటుందా? వేచి చూడాలి మరి.

Also Read: యాసంగిలో వరి సాగు వద్దు.. ఆరుతడి పంటలే ముద్దు: మంత్రి తుమ్మల

Tags

Related News

సంచి నిండదు.. జేబులు ఖాళీ.. సామాన్యుడిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ద్రవ్యోల్బణం!

మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ పైనా ఆరోపణలు..! ఆయనకు బ్యాంక్‌ చైర్మన్‌గా ఎందుకు అవకాశం ఇచ్చారు? కొత్త వివాదాన్ని తెరపైకి తెచ్చిన ప్రశాంత్‌ కిషోర్‌..

‘కంచె చేను మేస్తున్న’ దారుణ హత్యలు! పని మనుషుల ముసుగులో నరరూప హంతకులు!

ఓట్‌ చోరీపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. మోదీ, షాపై ఫైర్‌

సీఎంతో సహా మంత్రుల అవినీతి చిట్టా విప్పుతా.. రాజగోపాల్ రెడ్డి సంచలన స్కెచ్?

పెట్రోల్ ధరల మానిటరింగ్ కోసం.. యూకే ప్రభుత్వం సరికొత్త పథకం!

వైఎస్ ఫ్యామిలీ కంచుకోటలో రసవత్తర పోరు.. కొత్త రిజర్వేషన్లతో కడపలో కలవరం!

Big Stories

Advertisement
×