E-Paper
Advertisement

మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ పైనా ఆరోపణలు..! ఆయనకు బ్యాంక్‌ చైర్మన్‌గా ఎందుకు అవకాశం ఇచ్చారు? కొత్త వివాదాన్ని తెరపైకి తెచ్చిన ప్రశాంత్‌ కిషోర్‌..

మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ పైనా ఆరోపణలు..! ఆయనకు బ్యాంక్‌ చైర్మన్‌గా ఎందుకు అవకాశం ఇచ్చారు? కొత్త వివాదాన్ని తెరపైకి తెచ్చిన ప్రశాంత్‌ కిషోర్‌..
Advertisement

మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు.. కేంద్రం నెత్తి మీదకు కొత్తగా మరో వివాదాన్ని ఎత్తాడు ప్రశాంత్‌ కిషోర్‌. కేంద్ర ఎన్నికల సంఘం వ్యవహార తీరు.. అది పూర్తిగా కేంద్రానికి చేస్తున్న సహకారం, బీజేపీ గుప్పిట్లో ఉంటూ వస్తున్న అంశం ఇప్పటిది కాదని, గద పదేళ్లుగా ఇది నిర్విరామంగా నడుస్తుందని ఆరోపించారాయన.

ప్రస్తుతం ప్రశాంత్‌ కిషోర్‌ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పుడంతా సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌పైనే చర్చించుకుంటున్నారు. ఆయన రాజీనామా కోరుతూ ఢిల్లీలో రచ్చ జరుగుతోంది. కానీ ప్రశాంత్‌ కిషోర్‌ మాత్రం.. మాజీ సీఈసీ రాజీవ్ కుమార్ ప్రస్తావనను లాక్కొచ్చారు. ఆయన రిటైరయ్యాక కేంద్రం నజరానా ప్రకటించిందని ఆరోపి‌ంచాడు.

Advertisement

దేశంలోనే అత్యంత పెద్ద బ్యాంకు.. హెచ్‌డీఎఫ్‌సీకి ఆయన్ను పార్ట్‌ టైం… చైర్మన్‌గా చేశారనే అంశాన్ని దేశానికి గుర్తు చేస్తున్నాడు. సీఈసీలు మారుతారు అంతే.. కేంద్ర ఎన్నికల సంఘం తీరు మారదు. అది బీజేపీ చేతిలో కీలుబొమ్మ అంటూ ప్రశాంత్‌ చేసిన కామెంట్లు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి.

‘ఓ వైపు ప్రజల్లో బీజేపీ అంటే తీవ్ర వ్యతిరేకత వస్తుంటే.. అది అధికారంలోకి ఎలా రాగలుగుతున్నది…? ఇప్పుడిప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం చర్చలోకి వస్తోంది. కానీ దీని ఆపరేషన్స్‌ దశాబ్దకాలంగా కేంద్రానికి అనుకూలంగానే సాగుతున్నాయ’ ని తీవ్ర ఆరోపణలు చేశాడు ప్రశాంత్‌ కిషోర్‌. ఇప్పుడున్న సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌కు కూడా కేంద్రం నజరానా ప్రకటిస్తుందని ఆరోపించాడు.

Advertisement

ఎన్నికల సంఘం కమిషనర్ల ఎంపిక బాధ్యతలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని కూడా డిమాండ్‌ చేశాడాయన. ఎన్నికల కమిషన్ విశ్వసనీయతపై దేశవ్యాప్త చర్చ జరగాలని కోరారు ప్రశాంత్ కిషోర్. ‘ఎన్నికల కమిషన్‌లో అంతర్గత విభేదాలు ఉన్నాయంటూ వెలువడిన వివాదం ఒక్క మీడియా కథనంతో ప్రారంభం కాలేదు.. గత దశాబ్ద కాలంగా ఎన్నికల కమిషన్ పనితీరుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎన్నికల కమిషన్ విశ్వసనీయత, ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతపై దేశవ్యాప్త చర్చ జరగాల’ని ఆయన కోరారు.

ఎన్నికల కమిషన్ విశ్వసనీయత, ప్రతిష్ఠ కేవలం ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం వల్ల దెబ్బతినలేదని, మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) రాజీవ్ కుమార్ ప్రస్తుతం దేశంలోని అతిపెద్ద ప్రైవేటు బ్యాంకుకు చైర్మన్‌గా ఎలా నియమితులయ్యారనే అంశంపై కూడా దేశవ్యాప్తంగా చర్చ జరగాల్సిందేనని డిమాండ్‌ చేశారు.

మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్‌ను హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ పార్ట్‌టైమ్ చైర్మన్‌గా జూన్‌లో నియమించిందని, అంతకుముందు ఆ బ్యాంకు చైర్మన్ మార్చిలో అకస్మాత్తుగా రాజీనామా ఎందుకు చేశారని ప్రశ్నించారు. 2024 లోక్‌సభ ఎన్నికలు జరిగిన సమయంలో రాజీవ్ కుమార్ ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహించారని గుర్తు చేశారు. గత కొన్నేళ్లుగా ఎన్నికల కమిషన్ పనితీరు, ముఖ్యంగా ఎన్నికల సమయంలోనూ, ఇతర సందర్భాల్లోనూ తన బాధ్యతలను నిర్వర్తించిన తీరుతో దాని విశ్వసనీయత దెబ్బతిన్నదని కిషోర్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ అంశంపై గత పదేళ్లుగా చర్చ జరుగుతోందన్నారు.

ఎన్నికల ప్రక్రియలోని అనేక అంశాలపై అధికార బీజేపీ ప్రభావం చూపుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఎన్నికల తేదీలను నిర్ణయించడం, ఎన్ని దశల్లో ఎన్నికలు నిర్వహించాలనే అంశం… అన్నీ అధికార పార్టీ బీజేపీ ఆదేశాల మేరకే నడుస్తాయని ఆరోపించారాయన. మొత్తం ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా మార్చేందుకు సమగ్ర చర్యలు తీసుకోవాలని కోరిన ప్రకాశ్‌..ఈ విషయంలో సుప్రీంకోర్టు పాత్ర పోషించాలన్నారు. ఎన్నికల కమిషనర్ల నియామకంలోనూ, విస్తృతమైన ఎన్నికల నిర్వహణ ప్రక్రియలోనూ ప్రతిపక్షాలకు ఎలాంటి పాత్ర లేదని గుర్తు చేశారు కిషోర్.

Tags

Related News

సంచి నిండదు.. జేబులు ఖాళీ.. సామాన్యుడిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ద్రవ్యోల్బణం!

కూటమిలో మొదైన సీట్ల పంచాయితీ.. జనసేన నెక్స్ట్ స్టెప్ ఏంటి?

‘కంచె చేను మేస్తున్న’ దారుణ హత్యలు! పని మనుషుల ముసుగులో నరరూప హంతకులు!

ఓట్‌ చోరీపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. మోదీ, షాపై ఫైర్‌

సీఎంతో సహా మంత్రుల అవినీతి చిట్టా విప్పుతా.. రాజగోపాల్ రెడ్డి సంచలన స్కెచ్?

పెట్రోల్ ధరల మానిటరింగ్ కోసం.. యూకే ప్రభుత్వం సరికొత్త పథకం!

వైఎస్ ఫ్యామిలీ కంచుకోటలో రసవత్తర పోరు.. కొత్త రిజర్వేషన్లతో కడపలో కలవరం!

Big Stories

Advertisement
×