BigTV English

Road Accident Mussoorie: ఘోర ప్రమాదం.. లోయలో పడిన కారు.. ఐదుగురు దుర్మరణం

Road Accident Mussoorie: ఘోర ప్రమాదం.. లోయలో పడిన కారు.. ఐదుగురు దుర్మరణం

5 Killed in Road Accident in Mussoorie: ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ముస్సోరిలో శనివారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. ఝరిపానీ రోడ్డులో ఫోర్డ్ కారు ప్రమాదానికి గురవ్వగా.. ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. గాయపడిన మరో ముగ్గురిని ఆస్పత్రికి తరలించగా.. చికిత్సపొందుతూ మరో ఇద్దరు మరణించారు. ప్రమాద సమయంలో కారులో మొత్తం ఆరుగురు ప్రయాణికులున్నట్లు ఎస్ఎస్పీ తెలిపారు.


శనివారం తెల్లవారుజామున 5 గంటలకు చునాఖల్ ఝరిపానీ రోడ్డులోని కమల్ కాటేజ్ సమీపంలో కారు అదుపుతప్పి పల్టీలు కొట్టి లోయలో పడిపోయింది. ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయింది. ప్రయాణికులు కాలువలో పడిపోగా.. వెలికి తీసి ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో మరణించినవారంతా డెహ్రాడూన్ లోని ఒక విద్యాసంస్థలో చదువుతున్నవారిగా గుర్తించారు. మృతుల్లో నలుగురు అబ్బాయిలు, ఒక అమ్మాయి ఉండగా.. మరో యువతి చికిత్స పొందుతుంది.

Also Read : బలూచిస్థాన్ లో బాంబ్ బ్లాస్ట్.. జర్నలిస్ట్ సహా ముగ్గురు మృతి


కాగా.. గతరాత్రి ఫ్రాంటియర్ తహసీల్ కు చెందిన నిమ్మగా గ్రామానికి సమీపంలో రహదారి నిర్మాణ పనులు చేస్తున్న ఇద్దరు కూలీలు అదుపుతప్పి కాలువలో పడి మరణించారు. లింక్ రోడ్డు అభివృద్ధి పనులను తాత్కాలికంగా ఆపివేశారు. కాంట్రాక్టర్ తో కలిసి పనిచేస్తోన్న కొందరు కూలీలు రాత్రివేళ భోజనం చేసి శిబిరంలో నిద్రపోయారు.

మలవిసర్జనకై బయటికి వచ్చిన ఇద్దరు కూలీలు సంజు (21), సత్పాల్ (27) లు బ్యాలెన్స్ తప్పి కొండపై నుంచి కింద ఉన్న లోయలో పడిపోయారు. ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు చికిత్స పొందుతూ మృతి చెందారు.

Also Read: Terrorist Attack : భద్రతా బలగాలపై ఉగ్ర దాడి.. గాయపడిన జవాన్లు, ఒకరు మృతి

రూర్కీలో శనివారం ఉదయం హరిద్వార్ నుండి రాజస్థాన్ వెళ్తున్న బస్సు అదుపు తప్పి నర్సన్ సరిహద్దు వద్ద హైవే మధ్యలో ఉన్న పోలీస్ చెక్ పోస్ట్ మీదుగా దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కొందరు ప్రయాణికులకు గాయాలయ్యాయి.

Tags

Related News

New House To MPs: ఎంపీలకు 184 కొత్త ఇళ్లను ప్రారంభించిన పీఎం.. ఈ 5 బెడ్ రూమ్ ఫ్లాట్స్ ప్రత్యేకతలు ఇవే

Retail Real Estate: మళ్లీ ఊపందుకున్న రీటైల్ రియల్ ఏస్టేట్.. ఏకంగా 69 శాతానికి..?

Supreme Court: లక్షల వీధి కుక్కలను షెల్టర్లకు తరలించండి.. సుప్రీం సంచలన ఆదేశాలు

Delhi Politics: ఢిల్లీలో రాహుల్, ప్రియాంక అరెస్ట్, భగ్గుమన్న విపక్షాలు, ప్రజాస్వామ్యం కోసమే పోరాటం-సీఎం రేవంత్

Air India: మరో ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. ఫ్లైట్‌లో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు

Army rescue: మంచు పర్వతాల మధ్య.. పురిటి నొప్పులతో మహిళ! రంగంలోకి 56 మంది జవాన్స్.. ఆ తర్వాత?

Big Stories

×