BigTV English

TDP VS YSRCP: సెంటిమెంట్ రివర్స్ అయ్యిందా? అడ్డంగా బుక్కైన విడదల రజిని

TDP VS YSRCP: సెంటిమెంట్ రివర్స్ అయ్యిందా? అడ్డంగా బుక్కైన విడదల రజిని

TDP VS YSRCP: చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే విడదల రజనీ, ఆమె అనుచరులపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. మంత్రిగా ఉన్నప్పుడు చేసిన దందాలకు సంబంధించి ఇప్పటికే రజని మరిది గోపి, ఇతర ముఖ్య అనుచరులు ఊచలు లెక్కపెడుతున్నారు. ఏ-1 నిందితురాలిగా ఆమెపై కూడా కేసులు నమోదవుతుండటంతో రజని కూడా అరెస్ట్ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఆ ఆందోళనతోనే ఆమె రూడ్లపై పోలీసులతో గొడవలకు దిగుతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అసలు శ్రీకాంత్‌రెడ్డి అరెస్ట్ సమయంలో ఆమె వ్యవహరించిన తీరు, ఆమెకు మద్దతుగా వైసీపీ ముఖ్యనేతలు పోలీసులపై ధ్వజమెత్తడంపై జరుగుతున్న చర్చేంటి?


చిలకలూరిపేటలో వైసీపీ శ్రేణుల వరుస అరెస్టులు

పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గ రాజకీయాలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. దీనికి కారణం వైసీపీనేతలు, వారి అనుచరుల వరుస అరెస్టులు. కేసుల తీవ్రతను బట్టి నేతల సమక్షంలోనే అనుచరులను అరెస్టులు చేయటం, నేతలు ఇళ్లల్లో ఉన్న అనుచరులను పోలీసులు వచ్చి అదుపులోకి తీసుకోవడం కామన్‌గా జరిగేదే. గతంలో కూడా అనేక సార్లు నేతలు ఇళ్లలో నిందితులు ఉన్నప్పుడు పోలీసులు వచ్చి సదరు నేతలకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి వారిని అదుపులోకి తీసుకున్న సందర్భాలు అనేకంగా ఉన్నాయి. ఆ క్రమంలో ఇటీవల కాలంలో చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి విడదల రజనీకి బిగుసుకుంటున్న కేసుల ఉచ్చు, ఆమె సన్నిహిత టీమ్ సభ్యుల అరెస్ట్‌లు , ఆ సందర్భంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు హాట్‌టాపిక్‌గా మారుతున్నాయి.


వీడియో వైరల్ అవుతూ ట్రోల్ అవుతున్న మాజీ మంత్రి

విడుదల రజని ప్రధాన అనుచరుడు శ్రీకాంత్ రెడ్డి అరెస్టు సమయంలో ఆమె ప్రవర్తించిన తీరు, ప్రదర్శించిన దూకుడుపై ప్రస్తుతం అందరూ ఆశ్చర్యపోతూ విమర్శలు గుప్పిస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ వీడియోని పోస్టు చేస్తూ ఆమెను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. నిందితుడిని తన వాహనంలో ఎక్కించుకుని తిరుగుతున్న మాజీ మంత్రి, విషయం తెలిసి పోలీసులు వచ్చి అతన్ని అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తే అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు ఏదో తప్పుచేస్తున్నారన్నట్లు సీఐపై పెద్ద గొంతు వేసుకుని అరుస్తూ.. అక్కడ తనకేదో అన్యాయం జరిగిపోతున్నట్లు బిల్డప్ ఇచ్చే ప్రయత్నం చేయడంపై పెద్ద చర్చే జరుగుతోంది.

విడదల రజనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పోలీసులు

శ్రీకాంత్ రెడ్డి అరెస్ట్ చేస్తున్న సమయంలో విధినిర్వహణలో ఉన్న పోలీసులతో రజని దురుసుగా ప్రవర్తించడం వివాదాస్పదమైంది వారి విధులకు ఆటంకం కలిగిస్తూ.. తన అనుచరుడు అరెస్ట్‌కు కారణం చెప్పాలని సీఐ సుబ్బారాయుడును నెట్టేశారు. విడదల రజని ప్రవర్తనపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రిపై కేసు నమోదు చేయాలని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని పోలీసులు తెలిపారు. మొన్నామధ్య వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ తరహాలో మంత్రిగా పనిచేసిన విడదల రజనీ కూడా పోలీసులతో గొడవ దిగడం విమర్శలపాలవుతోంది. అయితే రజని మాత్రం పేర్ని నాని, తదితర వైసీపీ నేతలను వెంటేసుకుని మీడియా ముందు కొచ్చేసి పోలీసులది దౌర్జన్యమంటూ తెగ వాపోయారు.

రజని కారులో ఉన్న శ్రీకాంత్ రెడ్డి అరెస్ట్

రజని కారులోనే మానుకొండ శ్రీకాంత్‌రెడ్డి తిరుగుతున్నాడన్న పక్కా సమాచారంతోనే పోలీసులు అటకాయించి అతన్ని అదుపులోకి తీసుకున్నారంట. అతన్ని అరెస్ట్ చేయొద్దని పోలీసులని రజని అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సందర్భంగా పోలీసులతో విడదల రజని పోలీసులతో వాగ్వాదానికి దిగి చేసిన హడావుడి చర్చనీయాంశంగా మారింది. అయితే మీడియా ముందు మాత్రం ఆమె బేలగా మాట్లాడుతున్నారు. తనను ప్రజల్లో తిరిగనీయకుండా చేయడానికే కుట్రలు చేస్తున్నారని వాపోతున్నారు.

తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు

విడుదల రజని తన పైన దాడి చేసి, పోలీసులు ఇబ్బంది పెట్టారని చెప్పడంతో చాలామంది సానుభూతి చూపించినప్పటికీ ఆ తర్వాత ఆమె యాక్షన్ వీడియో క్లిప్పింగ్ చూసిన వాళ్లంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, విమర్శలు గుప్పిస్తున్నారు. విడుదల రజని తీరుపై ప్రస్తుతం రాజకీయంగా కూడా చర్చ నడుస్తుంది. అసలు ఆరోజు ఆమె ఎందుకు ఆ విధంగా ప్రవర్తించారు అన్న దానిపై ఆమె అనుచరులు కూడా జట్లు పీక్కుంటున్నారంట. ఆ రోజు శ్రీకాంత్ రెడ్డిని పోలీసులు అప్పగించి, తర్వాత పోలీస్ స్టేషన్‌కు వెళ్లి మాట్లాడి ఉంటే మాజీ మంత్రిగా ఆమె గౌరవం ఆమెకు దక్కేదని వైసీపీ నేతలే అంటున్నారంట.

అరెస్ట్ అయి రిమాండ్‌లో ఉన్న రజని మరిది గోపి

మొత్తానికి శ్రీకాంత్ రెడ్డి అరెస్టు సమయంలో విడుదల రజిని ఎందుకు ఆ విధంగా ప్రవర్తించింది అనేది ఎవరికీ అంతుపట్టడం లేదంట. అయితే ప్రస్తుతం విడుదల రజనికి అంతా ప్రతికూల వాతావరణమే ఉంది. మొన్నీమధ్యే స్టోన్‌క్రషర్ యాజమానిని బెదిరించి సొమ్ము వసూలు చేసిన కేసులో ఆమె మరిది గోపీ అరెస్ట్ అయి రిమాండ్‌లో ఉన్నాడు. ఆ కేసులో రజని ఏ-1 నిందితురాలిగా ఉన్నారు. ఇక ఆమెపై అట్రాసిటీ కేసుతో పాటు వివిధ కేసులు నమోదైఉన్నాయి. ఖచ్చితంగా మళ్లీ అధికారంలోకి వస్తామనే ధీమాతో అప్పట్లో అన్నీ అలా కానిచ్చేసిన ఆమె.. వరుసగా నమోదవుతున్న కేసులతో బెంబేలెల్తిపోతున్నారంట. తనపై ఏదో కుట్ర జరుగుతుంది అని చెప్పుకుంటూ సెంటిమెంట్ అస్త్రం ప్రయోగించాలని చూస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Also Read: ఇలా అయితే కష్టమే.. మాచర్ల ఎమ్మెల్యేకు వింత పరిస్థితి

రజని ఇంటికొచ్చి పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసిన పేర్ని నాని

రజని మరిది విడదల గోపీనాథ్‌ను అరెస్టు చేసి రిమాండ్లో ఉంచటంతో అరెస్ట్ భయంతో ఆమె ఉక్కిరి బిక్కరవుతున్నారంట. తాను ఉన్న పరిస్థితుల నుంచి బయటపడాలంటే నియోజవర్గ ప్రజల్లో తనపైన సానుభూతి పెంచుకోవాలనే ఆలోచనతో విడుదల రజని అలా ప్రవర్తిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. శ్రీకాంత్ రెడ్డి అరెస్ట్ సమయంలో ఆమె తన పైన దాడి జరిగిందని చెప్పడం, దానిని ఖండిస్తూ మాజీ మంత్రి పేర్ని నాని వంటి వైసీపీ ముఖ్య నేతలు ముఖ్య రజనికి ఇంటికి వచ్చి పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో పోలీసు వర్గాలు సైతం ఆశ్చర్యపోతున్నాయి.

వైసీపీ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పోలీసులు

నిందితుడిని అరెస్టు చేసే సందర్భాల్లో తమకు సహకరించాల్సిన నేతలు ఈ విధంగా తమపై విమర్శలు చేయటమంటని పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే రజనీ యాక్షన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో ఆమె మద్దతుగా వచ్చిన వైసీపీ నేతలు కూడా నెటిజన్లకు టార్గెట్ అవుతున్నారు. నిందితుడిగా ఉన్న వ్యక్తిని న్యాయపరంగా పోరాటం చేసి కాపాడుకోవాలి కాని, రోడ్లపై పోలీసులను అడ్డుకోవడమే కాకుండా పోలీసులు పైన విమర్శలు చేయడమేంటని నిలదీస్తున్నారు.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×