Turkey Pakistan| ఇండియా, పాకిస్తాన్ దేశాల మధ్య ఇంకా ఉద్రిక్త పరిస్థితు కొనసాగుతున్నాయి. నాలుగు రోజుల పాటు జరిగిన యుద్ధానికి కాల్పుల విరమణ పేరుతో తాత్కాలికంగా నిలిపివేసినా.. పాకిస్తాన్ మంత్రులు, అధికార పార్టీ నాయకులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో భారతదేశంలో ప్రజలు పాకిస్తాన్, ఆ దేశానికి మద్దతునిచ్చే దేశాలపై కోపంగా ఉన్నారు. ప్రభుత్వం కూడా పాకిస్తాన్ కు యుద్దంలో మద్దతు చేసిన టర్కీ, చైనా దేశాల సోషల్ మీడియా అకౌంట్లు సస్పెండ్ చేసింది.
భారత్ పై దాడి చేసేందుకు పాకిస్తాన్ ప్రయోగించిన చైనా, టర్కీ మిసైల్స్ ను భారత సైన్యం ఆధారాలతో సహా బయటిపెట్టింది. చైనాతో ఇండియాకు దాగుడు మూతల సంబంధాలున్నాయి. ఒకవైపు వాణిజ్య పరంగా ఇరు దేశాల మధ్య ఇచ్చి పుచ్చుకునే ధోరణి కొనసాగుతున్నా.. సరిహద్దుల్లో లదాఖ్, అరుణాచల్ ప్రదేశ్ వివాదం కూడా ఉంది. కాబట్టి డ్రాగన్ దేశం పాకిస్తాన్ కు మద్దతు ఇవ్వడానికి కారణాలున్నాయి. కానీ టర్కీకి మాత్రం భారత దేశంలో ఎలాంటి శత్రత్వం లేదు. పైగా టర్కీలో ఒకప్పుడు ఉద్యమం జరిగినప్పుడు ఇండియా ముస్లింలు, భారత ప్రభుత్వం కూడా మద్దతు తెలిపింది. టర్కీ దేశానికి భారతీయులు పెద్ద సంఖ్యలోనే పర్యటించడానికి వెళుతుంటారు. భారతదేశం.. టర్కీతో స్నేహ సంబంధాలున్నా ఆ దేశ ప్రభుత్వం మాత్రం ఇండియాపై దాడి చేయడానికి పాకిస్తాన్ కు బాంబులు, డ్రోన్లు, మిసైల్స్ ఇచ్చింది.
ఈ నేపథ్యంలో టర్కీ దేశంలో అన్ని సంబంధాలు తెంచుకోవాలని భారతీయులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే టర్కీ దేశం నుంచి వచ్చే పండ్లు, ఇతర ఉత్పత్తులను భారత వ్యాపారులు బాయ్ కాట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా భారత ప్రభుత్వం టర్కీ, చైనా దేశాల కంపెనీలపై జాతీయ భద్రత దృష్ట్యా నిషేధం విధించాలనే యోజనలో ఉంది. దీంతో టర్కీకి చెందిన సెలిబి (Celebi) ఏవిషేయన్ కంపెనీ భారత విమానాశ్రయాల్లో హై సెక్యూరిటీ సేవలు అందించడంపై విమర్శలు వెలువెత్తున్నాయి.
ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే పాకిస్తాన్ కు మద్దతుగా ఉన్న టర్కీ దేశం, ఆ దేశ కంపెనీలతో ఎలాంటి ఆర్థిక లావాదేవీలు కొనసాగించకూడదని భారతప్రభుత్వం నిర్ణయింది. టర్కీ దేశంలో ఏ విధమైన సంబంధాలు కూడా కొనసాగించేది లేదని విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో పేర్కింది. ఈ క్రమంల టర్కీకి చెందిన సెలెబీ కంపెనీపై కూడా నిషేధం విధించే అవకాశాలున్నాయి. ఈ కంపెనీ దేశంలోని ముంబై, ఢిల్లీ సహా మొత్తం 9 బడా విమానాశ్రయాల్లో గ్రౌండ్ హ్యాండ్లింగ్, కార్గో సర్వేసులు అందిస్తోంది.
ముంబైలో శివసేన నాయకుడు ముర్జీ పటేల్ తమ పార్టీకి ఇతర నేతలతో కలిసి సోమవారం ముంబై అంతర్జతీయ విమానాశ్రయం యజమాన్యంతో చర్చలు జరిపారు. టర్కీకి చెందిన సెలిబి ఎయిర్ పోర్ట్ సర్వీసెస్ కంపెనీ కాంట్రాక్టులను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అలా చేయడానికి శివసేన తరుపున ఆయన 10 రోజుల అల్టిమేటం జారీ చేశారు. ముంబైలోని శివాజీ మహారాజ్ అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ లో 70 శాతం గ్రౌండ్ ఆపరేషన్స్ సెలెబి కంపెనీని నిర్వహించడం గమనార్హం.
Also Read: హనీట్రాప్‌లో పాక్ దౌత్యాధికారి.. బంగ్లాదేశీ యువతితో అశ్లీల వీడియోలు
డిఫెన్స్ అనలిస్ట్ అభిజిత్ మిత్రా ఈ విషయంలో ఒక జాతీయ మీడియా ఛానెల్ లో మాట్లాడుతూ.. “ఇది చాలా సీరియస్ అంశం. ఈ కంపెనీలో 10 శాతం వాటా టర్కీ అధ్యక్షుడి కూతురికి ఉంది. ఆమె భర్త బయరక్తార్ కు యుద్ద డ్రోన్లు తయారు చేసే కంపెనీ ఉంది. ఆ కంపెనీ డ్రోన్లే భారత్ పై దాడికి పాకిస్తాన్ ఉపయోగించింది. పైగా ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో వివిఐపి ఏరియాని హ్యాండిల్ చేస్తోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విఐపి ప్రైవేట్ విమానం కూడా ఈ ప్రదేశంలోనే వస్తూ ఉంటుంది. ఇది ఎంత ప్రమాదకరంగా ఉందో మీ ఊహకే వదిలేస్తున్నాను.” అని ఆయన అన్నారు.
ఇండియాలో 2008 నుంచి సెలెబి మొత్తం 9 విమానాశ్రయాల్లో సేవలు అందిస్తోంది. ముంబై, ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, కొచిన్, అహ్మదాబాద్, గోవా, కన్నూ ఈ విమానాశ్రయాల్లో కార్గో, గ్రౌండ్ హ్యాండ్లింగ్, ఏవియేషన్ సర్వీసులను సెలెబి అందిస్తోంది. ఇండియాలో ఏడాదికి మొత్తం 58,000 ఫ్లైట్లు, 5,40,000 టన్నుల కార్గోని 7,800 మంది సిబ్బందితో సెలెబి కంపెనీ హ్యాండిల్ చేస్తోంది. ఇప్పుడు టర్కీ స్పష్టంగా పాకిస్తాన్ వైపు నిలబడడంతో ఈ కంపెనీ కాంట్రాక్టులు రద్దు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.