E-Paper
Advertisement

Karimnagar Congress: రాహుల్ గాంధీ వార్నింగ్ వెనుక అసలు రహస్యం: ఆ నలుగురు నేతలపై వేటు ఖాయమేనా?

Karimnagar Congress: రాహుల్ గాంధీ వార్నింగ్ వెనుక అసలు రహస్యం: ఆ నలుగురు నేతలపై వేటు ఖాయమేనా?
Advertisement

Karimnagar Congress: కరీంనగర్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవలేదు.. ఇక అధికారంలో ఉన్నా కూడా పార్లమెంటు స్థానం కూడా వరుసగా మూడో సారి చేజార్చుకుంది. ఇక ఎమ్మెల్సీ స్థానంలో పాటు అర్బన్ బ్యాంక్ చైర్మన్ పదవి కూడా దక్కలేదు. తాజాగా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఘోరంగా చతికిల పడింది. అధికార పక్షం కాబట్టి మిగిలిన పార్టీల మద్దతుతో కార్పొరేషన్ గెలుచుకునే అవకాశం ఉన్నా కూడా చేతులెత్తేసింది. ఆ క్రమంలో కాంగ్రెస్ హైకమాండ్ కరీంనగర్ కాంగ్రెస్ నేతలపై సీరియస్ అయిందంట.. మున్సిపల్ కార్పొరేషన్‌ని చేజేతులా పోగొట్టుకోవడంతో స్వయంగా రాహుల్‌గాంధీ పద్దతి మార్చుకోవాలని వార్నింగ్ ఇచ్చారంట. అదే ఇప్పుడు కాంగ్రెస్ శ్రేణుల్లో చర్చనీయాంశంగా తయారైంది.

కాంగ్రెస్ లీడర్లపై అసహనం వ్యక్తం

అన్ని ఉన్నా అల్లుడి నొట్లో శని ఉన్నట్లు తయ్యారైంది కరీంనగర్ కాంగ్రెస్ ‌పరిస్థితి. ఒకప్పుడు.. అంటే గులాబీ పార్టీ అధికారంలోకి రావడానికి ముందు కరీంనగర్‌లో ప్రభావం చూపించిన కాంగ్రెస్, తర్వాత విజయాలకు ముఖం వాచిపోయింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక జరిగిన కరీంనగర్ అసెంబ్లీ, లోక్‌సభ్, మున్సిపల్ కార్పొరేషన్లలో కారు జోరే కొనసాగుతూ వచ్చింది. గత రెండు ఎన్నికల నుంచి కరీంనగర్ ఎంపీగా బీజేపీ నేత బండి సంజయ్ సత్తా చాటుకుంటున్నారు. కరీంనగర్ ఎంపీగా 2009లో ఆఖరి సారి, ప్రస్తుత మంత్రి పొన్నం ప్రభాకర్ గెలిచారు. ఆ క్రమంలో వరుస ఓటములతో కాంగ్రెస్ ప్రతిష్టని దిగజార్చారంటూ సాక్షాత్తు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఢిల్లీకి పిలిపించుకొని మంత్రులు, కాంగ్రెస్ లీడర్లపై అసహనం వ్యక్తం చేశారంట మీ పద్దతి బాగాలేదు… పార్టీ‌ప్రతిష్టని రోజురోజుకు దిగజార్చుతున్నారు.. పరిస్థితి ఇలాగే కొనసాగితే మీపై చర్యలు తిసుకుంటా…అవసరమైతే వేటు వేస్తానంటూ రాహుల్ గాంధీ అగ్రహం వ్యక్తం చెయ్యడంతో కాంగ్రెస్ నేతలందరూ మౌనంగా ఉండిపోయారంట…ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే కూడా కరీంనగర్ లీడర్లపై అసహనం..అగ్రహం వ్యక్తం చేశారని విశ్వసనీయంగా తెలిసింది.. మున్సిపల్ ఎన్నికల సమయంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ చర్చనీయాంశంగా ‌మారింది.

Advertisement

Also Read: OPPO Reno 15 Pro Mini Offers: రూపాయి కట్టకుండానే కొత్త ఫోన్ ఇంటికి.. రెనో, ఫైండ్‌పై కళ్లుచెదిరే ఆఫర్లు!

అక్కడ ఖచ్చితంగా గెలవాలి 

కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉండటంతో కరీంనగర్ కార్పొరేషన్లో పాగా వేయగలుగుతుందని అందరూ భావించారు. అయితే ఎన్నికల సమయంలో పార్టీలోని అంతర్గత కుమ్ములాటలు, క్షేత్రస్థాయిలో సమన్వయ లోపం కరీంనగర్ మేయర్ పీఠం దక్కకుండా చేశాయని కాంగ్రెస్ అధిష్టానం దృష్టికి వెళ్లిందంట. ఇదే అంశంపై నివేదికలు తెప్పించుకున్న ఢిల్లీ పెద్దలు జిల్లా నేతలని పిలిపించి అక్షింతలు వేసి మరి పంపారంటున్నారు. తెలంగాణ లో హైదరాబాదు, వరంగల్ తరువాత అతిపెద్ద కార్పొరేషన్ ‌కరీంనగర్. అక్కడ ఖచ్చితంగా గెలవాలని మొదటినుంటి కాంగ్రెస్ భావించింది. స్వయంగా ముఖ్యమంత్రి కరీంనగర్ లో సభపెట్టి ప్రచారం నిర్వహించి హామీలు నెరవేర్చుతానని ప్రకటించారు. సీనియర్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇక్కడ ఇంచార్జ్‌గా జిల్లా నేతలు అందరూ కలిసి కట్టుగా పనిచేయడంలో.. అభ్యర్థుల ఎంపికలలో విఫలం అయ్యారన్న చర్చ జరుగుతోంది. ఒకవైపు మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, సుడా ఛైర్మన్ నరేందర్ రెడ్డి, ఇంచార్జ్ వెలిచాల రాజేందర్ రావు , అర్బన్ డీసీసీ అధ్యక్షుడు అంజన్ కుమార్ తమకి నచ్చిన వారికి పట్టుబట్టి టికెట్ ఇప్పించడంతో పదిహేను చోట్ల గెలిచే సీట్లని కాంగ్రెస్ కోల్పోయినట్లు తేలిందంట.

మునిసిపాలిటి మీదే ఎక్కువ ఫోకస్

Advertisement

కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న మేడిపల్లి సత్యం ఈ టికెట్ల లొల్లి తనకెందుకు అనుకున్నారంట… పార్టీ పాలసీ ప్రకారం తన‌ మాట నెగ్గకపోవడంతోనే టికెట్ విషయంలో జోక్యం చేసుకోలేదంట. చివరలో తన నియోజకవర్గ కేంద్రమైనచొప్పదండి మునిసిపాలిటి మీదే ఎక్కువ ఫోకస్ చేసి అక్కడ సత్యం దాన్ని కాంగ్రెస్ వశం చేశారు. కరీంనగర్ కార్పొరేషన్లో బీఆర్ఎస్ వీక్ అయినప్పటికి దానిని కాంగ్రెస్ తనకి అనుకూలంగా మలుచుకోవడంలో‌ ఫెయిల్ కావడంతో .. అది బండిసంజయ్‌కి పెద్ద‌ అసెర్ట్‌గా ‌ మారి మెజార్టీ కార్పొరేటర్లను గెలిపించుకున్నారు.  మ్యాజిక్ ఫిగర్ దక్కకపోయినా చక్రం తిప్పి మేయర్ పీఠం దక్కించుకోగలిగారు.

పార్టీ నేతలు కాంగ్రెస్ లోకి రావడానికి అవకాశం

14 సీట్లు గెలిచి సెకండ్ లార్జెస్టస్ పార్టీ గా నిలిచిన కాంగ్రెస్ , ఎంఐఎం ,ఇండిపెండెంట్ లు, బీఅర్ఎస్ లతో కలిసి మేయర్ పీఠం గెలుచుకునే అవకాశం ‌ఉన్నా కూడా‌ సమన్వయం లేక చేతులెత్తేసింది…ఇప్పుడు ఇదే అధిష్టానం కరీంనగ్ కాంగ్రెస్ లిడర్లను ఢిల్లీకి పిలిచి అక్షింతలు చెయ్యడానికి కారణం అయ్యిందంట. ఇతర పార్టీ నేతలు కాంగ్రెస్ లోకి రావడానికి అవకాశం ఉన్న కూడా, ఫెయిల్ అవ్వడమే కాకుండా వారిని కాంగ్రెస్ లోకి రావద్దని కొందరు బెదిరించారని.. సంబంధిత ఆడియో లు ముందు పెట్టి హైకమాండ్ వాతలు పెట్టిదంట. కరీంనగర్ మున్సిపల్ కార్పేరేషన్లో బాధ్యులుగా ఉన్న కాంగ్రెస్ నేతలు నాలుగు గ్రూపులుగా ఉండడాన్ని కాంగ్రెస్ అధిష్టానం సీరియన్ గా తిసుకుని పద్దతి మార్చుకోవాలని గట్టిగానే హెచ్చరించిందంట. కార్పొరేషన్ ఎలాగూ దక్కకపోవడంతో ఇకనుండి కలిసికట్టుగా ఉండాలని, గ్రూపు రాజకీయాలకి స్వస్తి ‌పలకాలని నాయకులని హెచ్చరించడమే కాకుండా పద్దతి మార్చుకోకపోతే సీరియన్ యాక్షన్‌ ఉంటుందని హైకమాండ్ వార్నింగ్ ఇచ్చిందట. మరి రానున్న పరిషత్ ఎన్నికల్లో అయినా సదరు నేతల వైఖరి మారుతుందో లేదో చూడాలి.

 Story By Apprao Big Tv

Also Read: Scooters For Women: హోండా To యమహా.. మహిళలకు సూటయ్యే బెస్ట్ స్కూటర్లు ఇవే!

Related News

ఎనిమిది రోజులుగా పోలీసు బలగాల పహారాలో హస్తినా! కట్టుదిట్టమైన భద్రత పేరుతో తీవ్ర నిర్బంధం..! జంతర్‌మంతర్‌ పాయే సెంట్రల్‌ పార్కూ పాయె..!

ఎల్‌నినో ఎఫెక్ట్.. ఉచిత చేపపిల్లల పంపిణీకి కొత్త కష్టాలు.. చనిపోలాల్సిందేనా..?

టీపీసీసీ చీఫ్‌ పదవికి ఇద్దరూ పోటీ..! మహేశ్‌కు వరించిన అధ్యక్ష పీఠం..! లేటుగానైనా జాతీయ స్థాయి కీలక పదవిలో యాష్కీ!

కాంగ్రెస్‌..కోదండరాం మంత్రం! ఆయనే ఎన్నికల ప్రధాన ప్రచార అస్త్రం..? రెండు ఎమ్మెల్సీ స్థానాల గెలుపే లక్ష్యంగా పావులు!

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

కృష్ణా-గోదావరి ప్రాజెక్టుల్లో డేంజర్ బెల్స్.. నిజాంసాగర్‌లో పడిపోయిన నీటి నిల్వలు!

ఇకపై నో సైలెంట్.. దూకుడు పెంచడమే.. గులాబీ పార్టీ నెక్స్ట్ వ్యూహం ఇదే?

ఎల్‌నినోతో జాడలేని ఎవుసం పనులు.. ! అనూహ్యంగా పెరిగిన కూలీల హాజరు! గత ఏడాది 25వేల మంది.. ఇప్పుడు 2.54లక్షల మందికి ‘ఉపాధి’!

Big Stories

Advertisement
×