BigTV English

Beeda Ravichandra Yadav: బీద రవిచంద్రకు ఎమ్మెల్సీ.. అసలు కారణం ఇదేనా..

Beeda Ravichandra Yadav: బీద రవిచంద్రకు ఎమ్మెల్సీ.. అసలు కారణం ఇదేనా..

బీద రవిచంద్ర విధేయతకు పట్టం కట్టిన టీడీపీ

తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎమ్మెల్యేల కోటా కింద ఎమ్మెల్సీ అభ్యర్థులని ప్రకటించారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే బలం వైసీపీకి లేకపోవడంతో కూటమి అభ్యర్ధులు ఏకగ్రీకంగా ఎన్నిక కానున్నారు. ఖాళీ అయిన అయిదు స్థానాల్లో టీడీపీ అధినాయకత్వం బీజేపీకి ఒకటి, జనసేనకు ఒక స్థానం కేటాయించింది. టీడీపీ నుంచి మండలిలో అడుగుపెట్టనున్న ముగ్గురు అభ్యర్ధుల్లో నెల్లూరు జిల్లాకు చెందిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్రకు స్థానం దక్కింది. దీంతో అక్కడి టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.


నెల్లూరు జిల్లా టీడీపీలో అద్యక్షుడిగా బాధ్యతలు

నెల్లూరు జిల్లా టీడీపీలో బీద రవిచంద్ర పాత్ర కీలకమైంది. జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తూ పార్టీని బలోపేతం చేయడంలో కీలకపాత్ర పోషించారు రవిచంద్ర. 2015లో స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన బీద రవిచంద్ర అటు పార్టీకి ఇటు కార్యకర్తలకు అండగా నిలిచారు. 2019లో అధికారం కోల్పోవడం, ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవకపోవడంతో నెల్లూరు జిల్లా టీడీపీలో స్తబ్ధత నెలకొంది. ఆ సమయంలో కీలక నేతలు కూడా పార్టీని విడిపోయారు.

టీడీపీని వీడి వైసీపీలో చేరిన రవిచంద్ర సోదరుడు మస్తాన్‌రావు

బీద రవిచంద్ర సోదరుడు ప్రస్తుత రాజ్యసభ ఎంపీ బీదా మస్తాన్‌రావు కూడా టీడీపీని వీడి వైసీపీలో చేరారు. ఆయన వైసీపీలో రాజ్యసభకు ఎంపికై, టీడీపీ అధికారంలోకి వచ్చాక ఆ పదవికి రాజీనామా చేసి సొంతగూటికి తిరిగొచ్చి మళ్లీ రాజ్యసభ సభ్యుడయ్యారు. కానీ కష్టకాలంలో టీడీపీలోనే ఉంటూ బీద రవిచంద్ర జిల్లాలో పార్టీని బలోపేతం చేశారు . మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎక్కడి నుంచైనా అధిష్టానం ఎమ్మెల్యే సీటు ఇస్తామని చెప్పినా.. జిల్లాలో పార్టీకి పనిచేసిన వారి కోసం సున్నితంగా త్యాగం చేశారంట. ఆ క్రమంలో తాజాగా రెండోసారి ఎమ్మెల్యే కోటా కింద రవిచంద్రకు ఎమ్మెల్సీ పదవి దక్కడం జిల్లా టీడీపీ శ్రేణుల్లో ఆనందం నెలకొంది.

చేరికలో కీలక పాత్ర పోషించిన బీద రవిచంద్ర

2019 ఎన్నికల్లో నెల్లూరు జిల్లాల్లో టీడీపీకి ప్రాతినిధ్యమే లేకుండా పోయింది. అయిత 2024 ఎన్నికల్లో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో టీడీపీ అన్ని స్థానాలను కైవసం చేసుకుని జగన్ పార్టీకి ఝలక్ ఇచ్చింది. ఆ విజయంలో బీద రవిచంద్ర పాత్ర ప్రత్యేకమైందని చెప్పవచ్చు. జిల్లాలో ప్రస్తుత నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆయన సతీమణి ప్రశాంతి రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తదితర సీనియర్ నేతలను టీడీపీలోకి తీసుకొచ్చేందుకు సాయ శక్తుల ప్రయత్నించి సక్సెస్ అయ్యారు రవిచంద్ర.

లోకేష్ యువగళం పాదయాత్రలో చురుకైన పాత్ర

మరోవైపు పార్టీ తనకు ఏ బాధ్యత అప్పగించినా బీద రవిచంద్ర సమర్ధంగా నిర్వర్తిస్తూ వచ్చారు. ఎన్నికల సమయంలో రవిచంద్ర కు రాయలసీమ బాధ్యతలను పార్టీ అప్పగించింది. రాయలసీమ జిల్లాలతో పాటు ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని టీడీపీ అభ్యర్థుల విజయం కోసం గట్టిగా కృషి చేశారు రవిచంద్ర. 2014, 2019తో పోలిస్తే 2024 ఎన్నికల్లో రాయలసీమతో పాటు నెల్లూరు జిల్లాలో టీడీపీ భారీ సంఖ్యలో సీట్లు గెలుచుకోవడంలో రవిచంద్ర పాత్ర కీలకమని ఆయన అనుచరులు చెప్తుంటారు.

Also Read: తాడిపత్రి ట్వీట్.. జగన్‌కు కొత్త తలనొప్పి

ఎన్నికల సమయంలో రవిచంద్రకు రాయలసీమ బాధ్యతలు

ఇక ప్రత్యేకించి మంత్రి నారా లోకేష్ నిర్వహించిన యువగళం పాదయాత్ర లో బీద రవిచంద్ర చురుకైన పాత్ర పోషించారు. రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో పాదయాత్రను విజయవంతం చేయడంలో రవిచంద్ర కృషి మరువలేనిదని లోకేష్ అప్పట్లోనే ప్రకటించారు. ఆ యాత్ర రూట్ మ్యాప్ దగ్గర నుంచి సభల వరకు అన్ని కార్యక్రమాలను దగ్గరుండి పర్యవేక్షించారు రవిచంద్ర.

విధేయతకు పట్టం కట్టారని హ్యాపీ అవుతున్న టీడీపీ శ్రేణులు

ప్రస్తుతం ఎమ్మెల్సీ అభ్యర్థిగా బీద రవిచంద్ర నామినేషన్ దాఖలు చేశారుజ జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు రవిచంద్ర కు అభినందనలు తెలిపారు. నెల్లూరు జిల్లాలో టీడీపీ సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలన్న రవిచంద్రతో కలిసి ముందుకెళ్లాలని అటు మంత్రులు, ఇటు ఎమ్మెల్యేలకు ఇప్పటికే సీఎం చంద్రబాబు సూచనలు ఇచ్చారంట. జిల్లా పార్టీలో చురుకైన పాత్ర పోషిస్తూ అటు రాష్ట్రంలోనూ తెలుగుదేశం పార్టీని ఎక్కడికక్కడ బలోపేతం చేస్తున్న రవిచంద్ర రెండోసారి ఎమ్మెల్సీ కావడంతో రవిచంద్ర శిబిరంలో సందడి వాతావరణం నెలకొంది. విధేయతకు పట్టం దక్కిందని టీడీపీ శ్రేణులు హ్యాపీ అవుతున్నాయి.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×