BigTV English

Pakistan Supporting Terrorism: ఉగ్రవాదులను పాక్ ఎందుకు పోషిస్తుందంటే..? అసలు కథ ఇది అన్నమాట!

Pakistan Supporting Terrorism: ఉగ్రవాదులను పాక్ ఎందుకు పోషిస్తుందంటే..? అసలు కథ ఇది అన్నమాట!

Pakistan Supporting Terrorism: పాకిస్థాన్.. టెర్రరిజమ్.. ఈ రెండు పదాల మధ్య పర్‌ఫెక్ట్‌ రైమింగ్ లేకపోయినా.. వాటి మధ్య ఉన్న బంధం ఫేవికాల్ కంటే స్ట్రాంగ్‌ది. ఆనాదిగా ఉగ్రవాదం అనే మొక్కను నాటి.. జాగ్రత్తగా పెంచి పోషించిన పాకిస్థాన్ చేసిన పాపాలు అన్నీ ఇన్నీ కావు. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఉగ్ర దాడి ఎక్కడ జరిగినా.. దాని మూలాలు పాకిస్థాన్‌లోనే కనిపిస్తాయి. లెటెస్ట్‌గా పహెల్‌గామ్‌లో జరిగిన ఉగ్రదాడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. పహెల్‌గామ్‌ కుట్రలో కూడా ఇప్పుడు పాక్ టెర్రర్ లింక్స్‌ బయటపడ్డాయి.


ఉగ్రదాడి ఏ దేశంలో అయినా మూలాలు పాక్‌లోనే..

కశ్మీర్ ఉగ్రదాడిలో పాక్ ఆర్మీ ఇన్‌వాల్వ్‌మెంట్‌


తెర వెనక మంత్రాంగం నడిపిన పాక్ ఆర్మీ

ఉగ్రవాదుల్లో ఒకరు పాక్ ఆర్మీ స్పెషల్ ఫోర్స్ కమాండో

మరోసారి బట్టబయలైన పాక్ ఆర్మీ, ఉగ్రవాదం మధ్య బంధం

పహెల్‌గామ్ ఉగ్రదాడి ఇంకా దేశప్రజల కళ్ల ముందే కదలాడుతోంది. ఈ మారణహోమం సృష్టించిన ఉగ్రవాదుల జాడ ఇప్పటికీ దొరకలేదు. వారి ఆచూకి గురించి వేట కొనసాగుతోంది. ఇంతలోనే ఈ ఉగ్రవాదులకు సంబంధించిన కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఉగ్రవాదుల్లో ఒకరైన హషీమ్ మూసా పాక్ ఆర్మీ స్పెషల్ ఫోర్స్ కమాండో అనే విషయం తెరపైకి వచ్చింది.

కోవర్ట్ ఆపరేషన్స్, హ్యాండ్ టూ హ్యాండ్ కాంబాట్

కోవర్ట్ ఆపరేషన్స్, హ్యాండ్ టూ హ్యాండ్ కాంబాట్, నావిగేషన్‌లో నైపుణ్యం, శత్రు భూభాగాల్లో భద్రతా దళాలకు చిక్కకుండ తప్పించుకోవడం.. ఇలాంటి విషయాల్లో ఫుల్ ట్రైనింగ్ తీసుకున్న ఈ కమాండో ఇప్పుడు ఉగ్రదాడులు చేస్తున్నాడు. దీనిని బట్టే అర్థమవుతోంది.. ఈ దాడుల వెనక ఎవరు ఉన్నారనేది. పాక్ ఆర్మీకి, ఉగ్రవాద సంస్థలకు మధ్య సంబంధాలు ఎలాంటివి అనేది. ఇన్ని జరుగుతున్నా కూడా పాక్ శుద్ధపూస మాటలు మాత్రం ఆగడం లేదు. మాకు నిష్పాక్షిక దర్యాప్తు కావాలి.. భారత్ ఆరోపణలు చేస్తోంది అంటూ పాత పాటే పాడుతోంది.

ఉగ్రవాద సంస్థల తొత్తుగా మారాడు

కశ్మీర్‌ ఉగ్రదాడికి స్కెచ్ వేసింది లష్కరే తొయిబా అయినా.. దాన్ని వేయించింది పాక్ నిఘా సంస్థ ISI. దానికి కావాల్సిన ఏర్పాట్లు చేసింది కూడా ఆ సంస్థే. దీనికి ప్రత్యక్ష సాక్ష్యం మూసానే. కేవలం దేశం కోసం పనిచేయాల్సిన ఓ సైనికుడు.. ఇప్పుడు ఉగ్రవాద సంస్థల తొత్తుగా మారాడంటే.. ఆ దేశ ఆర్మీ ఇన్‌వాల్వ్‌మెంట్‌ లేకుండా జరిగే పనికాదు.

పాక్ ఆర్మీలో డాక్టర్‌గా పనిచేసిన తహవూర్ రాణా

పహెల్‌గామ్ ఉగ్రదాడిలో పాక్ ఆర్మీ కమాండ్ హషీమ్ మూసా, 26/11 ఉగ్రదాడుల్లో పాక్ ఆర్మీలో డాక్టర్‌గా పనిచేసిన తహవూర్ రాణా, పాక్ ఆర్మీ ఆఫీసర్ సాజిద్ మిర్, పాక్ ISIలో పనిచేసిన మేజర్ ఇక్బాల్, మేజర్ అబ్దుల్ రహమాన్ పాషా.. ఇలా అనేక ఉగ్రదాడుల్లో పాల్గొన్న పాక్ ఆర్మీ అధికారుల లిస్ట్ చాంతాడంతా ఉంది.

కాబూల్ టు కశ్మీర్.. టెహరాన్ టు లండన్

పహెల్‌గామ్ మారణహోమం మాత్రమే కాదు.. కాబూల్ టు కశ్మీర్.. టెహరాన్‌ టు లండన్.. ఇలా ప్రపంచంలో ఎక్కడ ఉగ్రదాడి జరిగిన దాని లింక్‌లు, మూలాలు తేలేది పాకిస్థాన్‌లోనే అనేది చరిత్ర చెబుతున్న వాస్తవం. ఈ విషయాన్ని భారత్‌ మాత్రమే కాదు.. ఇతర దేశాలు కూడా చెబుతున్నాయి. కొన్నిసార్లు ఆదేశ నేతలు కూడా ఓపెన్‌గానే అంగీకరించారు.

కశ్మీర్ లో ఉగ్రవాదాన్ని పెంచి పోషించామన్న ముఫారఫ్

2008 ముంబై ఉగ్రదాడుల వెనక లష్కరే తొయిబాతో పాటు పాక్ ఉందని 2018లో చూచాయగా చెప్పారు పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్. కశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని పెంచి పోషించామని జనరల్ పర్వేజ్ ముషారఫ్ నేరుగానే అంగీకరించారు. కశ్మీర్ విషయంలో భారత్‌ను చర్చలకు ఒప్పించాలంటే ఉగ్రవాదాన్ని పెంచి పోషించడం ఒక్కటే మార్గమని ఓ ఇంటర్వ్యూలో సెలవిచ్చారు. ఇది వ్యూహాత్మక ఎత్తుగడ అని అప్పట్లో గొప్పగా చెప్పుకున్నారు ముషారఫ్. ఇక లెటెస్ట్‌గా పాక్ రక్షణమంత్రి ఖవాజా మహ్మద్ ఆసిఫ్‌ కూడా ఉగ్రవాదాన్ని పెంచి పోషించామని ప్రకటించారు. అమెరికా కోసం దశాబ్దాలుగా చెత్త పనులు చేశామంటూ ఓపెన్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. పాక్ మంత్రి బిలావల్ భుట్టో కూడా ఇదే విషయాన్ని చెప్పారు.

తాలిబాన్లు, హక్కాని నెట్ వర్క్‌కు సపోర్ట్ చేసిన పాకిస్థాన్

మొదట తాలిబాన్లు, హక్కాని నెట్‌వర్క్‌కు సపోర్ట్ చేసింది పాకిస్థాన్ అనేది బహిరంగ రహస్యం. 2008లో ఇండియన్ ఎంబసీ, 2011లో అమెరికా ఎంబసీలపై బాంబు దాడుల వెనక పాక్ ఉందని తేలింది. మాస్కో కన్సర్ట్ హాల్ దాడి వెనక పాకిస్థాన్ ఉగ్ర నెట్‌వర్క్‌లు ఉన్నాయని దర్యాప్తు సంస్థలు తేల్చాయి. ఈ దాడులకు కావాల్సిన ఐడియలాజికల్, లాజిస్టిక్ సపోర్ట్ అందించాయి పాక్ కేంద్రంగా నడిచే ఉగ్ర సంస్థలు. అంతేందుకు ఇరాన్‌లో సున్నీ ఉగ్రవాద గ్రూప్ జైష్‌ ఉల్ అడ్ల్ ఆశ్రయం కల్పించింది పాకిస్థాన్. ఎన్నో సార్లు ఈ విషయంపై హెచ్చరించినా వినకపోవడంతో.. ఆగ్రహం వ్యక్తం చేసిన ఇరాన్‌ 2024 జనవరిలో పాకిస్థాన్‌లో ఉన్న ఈ ఉగ్ర క్యాంప్‌లపై డ్రోన్ దాడులు కూడా చేసింది.

2005లో లండన్ పేలుళ్ల దర్యాప్తులో కూడా పాక్ పేరు

కాలంలో ఇంకాస్త ముందుకు వెళితే.. 2005లో లండన్ పేలుళ్ల దర్యాప్తులో కూడా ఉగ్రవాదులు ట్రైనింగ్ తీసుకున్నది పాకిస్థాన్‌లోనే అని తేలింది. వరల్డ్‌ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్‌ కూడా పాకిస్థాన్‌లో ఆశ్రయం పొందుతున్న సమయంలోనే దాడి చేసి హతమార్చింది అమెరికన్ ఆర్మీ.

పీఓకేలో యాక్టివ్‌గా అనేక ఉగ్రవాద క్యాంపులు

ఇది పాకిస్థాన్‌ పాపాల చరిత్ర. కానీ ఇంతటితో ఆగలేదు.. ఆపలేము కూడా. ఉగ్రవాదంపై చిలక పలుకులు పలుకుతున్న పాకిస్థాన్‌లోని పంజాబ్, ఖైబర్ ఫక్తూన్, వజీరిస్తాన్, POKలో అనేక ఉగ్రవాద క్యాంప్‌లు ఇప్పటికీ యాక్టివ్‌గానే ఉన్నాయి. ఇక నవతరం ఉగ్రవాదులకు ట్రైనింగ్ ఇచ్చేది పాక్ ఆర్మీకి చెందిన మాజీ అధికారులే అనేది బహిరంగ సత్యం.

అసలు ఉగ్రవాదం పాకిస్థాన్‌లో ఎప్పుడు ఊపిరిపోసుకుంది

అసలు ఉగ్రవాదం పాకిస్థాన్‌లో ఎప్పుడు ఊపిరిపోసుకుంది. దానికి పాక్ ప్రభుత్వాలు, ఆ దేశ ఆర్మీ, అక్కడి నిఘా సంస్థ ఎలా సపోర్ట్ చేసింది? ఎందుకు చేసింది? అసలు పాకిస్థాన్‌లో ఎన్ని ఉగ్రసంస్థలు ఉన్నాయి? అక్కడ ఉగ్రవాదులకు ఎలాంటి ట్రైనింగ్ ఇస్తున్నారు? ఇంత జరుగుతున్నా.. పాక్ ప్రభుత్వం అసలు అటు పక్కకు కూడా ఎందుకు చూడటం లేదు? ఈ ప్రశ్నలన్నింటికి సమాధానమే.. మా రిపోర్ట్.

ఉగ్రసంస్థలకు కేరాఫ్‌గా పాకిస్థాన్

ఇప్పటికే వందల సంఖ్యలో ట్రైనింగ్ క్యాంప్‌లు

ఉగ్రవాదుల ట్రైనింగ్ కోసం పాక్ ఆర్మీ లాజిస్టిక్ సపోర్ట్

ఒకప్పుడు ఓపెన్‌గా.. ఇప్పుడు కనపడకుండా సాయం

పాక్‌ గతిని మార్చేసిన 9/11 అటాక్స్

పాకిస్థాన్‌కు, ఉగ్రవాదానికి మధ్య అవినాభావ సంబంధం ఉంది. అఫ్ఘానిస్థాన్‌ నుంచి సోవియట్ దళాలను తరిమే ప్రాసెస్‌లో మొదలైన ఉగ్రవాదుల ట్రైనింగ్.. ఇప్పటి వరకు కొనసాగుతోంది. అప్పటికి ఇప్పటికి కారణాలు మారినా.. కాలం మారినా.. ఉగ్రసంస్థలకు ఆశ్రయం మారలేదు.. అక్కడ ట్రైనింగ్ ఆగలేదు.

అల్ ఖైదా, తాలిబన్, జమాత్ ఇ ఇస్లామీ,

అల్ ఖైదా, తాలిబన్, జమాత్ ఇ ఇస్లామీ, హిజ్బుల్ ముజాహిదీన్, లష్కరే తొయిబా, జైష్ ఇ మహమ్మద్, సిపా ఇ సహ్బా, లష్కర్ ఇ జాంగ్వీ, హర్కత్ ఉల్ ముజాహిదీన్, తెహ్రీక్ ఇ తాలిబాన్ పాకిస్థాన్, యునైటెడ్ జిహాద్ కౌన్సిల్.. ఇవన్నీ కూడా పాక్ కేంద్రంగా పుట్టి.. ఇప్పటికీ కొనసాగుతున్న ఉగ్ర సంస్థలు. ప్రపంచంలో ఏ మూలన ఉగ్ర దాడి జరిగినా.. ఇందులోని ఏదో ఒక సంస్థతో ముడిపడి ఉంటుంది. అది పాకిస్థాన్ చరిత్ర.

పాక్ ఐఎస్ఐ డైరక్షన్‌లో ఉగ్రవాద క్యాంప్‌లు

ఈ క్యాంప్‌లో ఉగ్రవాదులను తయారు చేసేందుకు పకడ్బంధీగా ఓ ప్రొఫార్మో ఉంటుంది. పాక్ ఐఎస్ఐ డైరెక్షన్‌లో.. ఈ ఉగ్రవాద క్యాంప్‌లను కూడా చాలా పకడ్బంధీగా నిర్వహిస్తున్నాయి ఉగ్రవాద సంస్థలు. దీనికి పాక్ ఆర్మీ ఇవ్వాల్సిన సహకారం అందిస్తోంది. ఇక్కడికి నార్మల్‌గా వచ్చే యువకులను పూర్తి ఉగ్రవాదిగా తయారు చేసి బయటికి పంపుతున్నారు.

ఆరు స్టేజ్‌ల్లో ఉగ్రక్యాంప్‌లో ట్రైనింగ్

ఈ క్యాంప్‌ల్లో మొత్తం ఆరు స్టేజ్‌ల్లో ట్రైనింగ్ ఇస్తున్నాయి ఉగ్ర సంస్థలు. ఫస్ట్ స్టేజ్ తాసిస్.. ఇది ఇంట్రడక్షన్ పిరియడ్. ఇందులో మతానికి సంబంధించిన విషయాలు చెబుతారు. ఇది నెల రోజుల పాటు ఉంటుంది. సెకండ్ స్టేజ్.. అల్ రాద్. ఇది మూడు నెలల పాటు ఉంటుంది. ఇందులో మిలటరీ ట్రైనింగ్‌కు సంబంధించిన ట్రైనింగ్ ప్రారంభమవుతుంది. ఇందులో ఉగ్రవాదికి కావాల్సిన మెంటల్, ఫిజికల్ హెల్త్‌కు సంబంధించిన ట్రైనింగ్ ఉంటుంది. థర్డ్‌ స్టేజ్‌లో ఆరు నెలలపాట గెరిల్లా ట్రైనింగ్ ఇస్తారు. ఇది పూర్తి చేసిన వారికి ముజాహిదిన్ హోదా దక్కుతుంది.

ఇక ఫోర్త్ స్టేజ్‌లో దోష్కా.. జండ్లా ట్రైనింగ్

ఇక ఫోర్త్ స్టేజ్‌లో దోష్కా, జండ్లా ట్రైనింగ్‌కు వెళతారు ఉగ్రవాదులు. ఇక్కడే వీరికి ఆయుధాలను ఉపయోగించడంపై శిక్షణ ఇస్తారు. దోష్కాలో లైట్‌ వెపన్స్‌ ఉపయోగించడంపై ట్రైనింగ్ ఉంటుంది. ఇక జండ్లా అనేది 9 నెలల ట్రైనింగ్. ఇక్కడే ఉగ్రవాదుకు ఆటోమెటిక్ రైఫిల్స్, ఎక్స్‌ప్లోజివ్స్‌పై ట్రైనింగ్ ఇస్తారు. లష్కరే తొయిబా, హిజ్బుల్ ముజాహిదీన్, హర్కత్ ఉల్ జిహాద్ ఇస్లామీ ఉగ్ర సంస్థలకు మాత్రమే ఈ ట్రైనింగ్ ఇచ్చే సామర్థ్యం ఉంది. ఇతర గ్రూప్‌లు వీటి సాయంతో వారి సొంత ఉగ్రవాదులకు ట్రైనింగ్ ఇప్పిస్తాయి.

ఉగ్రగ్రూపుల పెద్దల పర్మిషన్ ఉంటేనే చివరి రెండు స్టేజ్ లు

ఇక చివరి రెండు స్టేజ్‌లు మాత్రం ఉగ్రగ్రూప్‌ల పెద్దల పర్మిషన్‌ ఉంటేనే ట్రైనింగ్ ఇస్తారు. దోమేలా, జక్‌రజక్.. ఇవీ రాకెట్ లాంచర్లు, యుద్ధ ట్యాంక్‌లకు సంబంధించిన ట్రైనింగ్ ఇస్తారు. 18 నెలల పాటు సాధారణంగా ఒక ఉగ్రవాదికి ట్రైనింగ్ ఇస్తాయి ఉగ్ర సంస్థలు. ఇలా అనేక విధాలుగా ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వారిని ఎక్కడికి పంపాలి? ఎక్కడ దాడులు చేయాలి? ఎక్కడ తమ ఐడెంటిటి బయటపడకుండా ఉండాలి? అనేది చెప్పి ఇక ప్రపంచంపైకి వదులుతారు.

పాకిస్థాన్ లోనే ఇందులో ప్రధానమైన 50 గ్రూపులు

సౌత్ ఏషియా రిజియన్‌లో మొత్తం 200 మిలిటెంట్ గ్రూప్‌లు ఉంటే. ఇందులో ప్రధానమైన 50 గ్రూప్‌లు ఒక్క పాకిస్థాన్‌లోనే ఉన్నాయి. భారత్‌కు వ్యతిరేకంగా పనిచేసేవి కొన్ని.. తాలిబాన్‌లోని ఓ వర్గానికి వ్యతిరేకంగా పనిచేసేవి కొన్ని.. షియా గ్రూప్‌లకు వ్యతిరేకంగా పని చేసేవి కొన్ని.. పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసేవి కొన్ని.. ఇక మరికొన్ని అయితే ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ పాకిస్థాన్‌ ఏర్పాటు చేయాలనేవి కొన్ని. ఇలా రకరకాల లక్ష్యాలతో పనిచేస్తున్నాయి పాక్‌ బేస్‌డ్‌గా పనిచేసే ఉగ్ర సంస్థలు.

కావాల్సిన ఆయుధాలు, నిధులు అందించేది ఎవరు?

ఈ క్యాంప్‌లు మారుమూల ప్రాంతాల్లోనే ఉన్నా.. పాకిస్థాన్ ఆర్మీకి కనిపెట్టడం పెద్ద కష్టం కాదు. ఇక పాక్ నిఘా సంస్థలు వీటిని గుర్తించడం అసలు పెద్ద పనే కాదు. కానీ వీటిని ఆపేవారు ఉండరు. ఆపకపోగా.. వారికి కావాల్సిన ఆయుధాలు, నిధులు తెర వెనక నుంచి సమకూర్చేది ఎవరు? వీటిని ఎందుకు అడ్డుకోలేకపోతున్నారు? అనేది అందరికి తెలిసిన విషయమే.

పోరాటం ఏదైనా అది ప్రజాస్వామికంగా ఉండాలన్నది భారత్ అభిమతం

మన దేశంలో కారణం ఏదైనా ఆయుధాలు పట్టుకోవడమనే నేరమని భావించి మావోయిస్టులు అనే వారిని లేకుండా ఏరివేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. పోరాటం ఏదైనా అది ప్రజాస్వామికంగా ఉండాలన్నది భారత్ అభిమతం. కానీ పొరుగు దేశం పాకిస్థాన్‌లో మాత్రం ఆ పరిస్థితి లేదు. అంతా ఓపెన్‌గా జరుగుతున్నా పట్టించుకునే నాథుడే లేడు.

సొంత దేశంపై దాడులు జరిగినా.. ప్రజల ప్రాణాలు తీస్తున్నా పట్టించుకోదు.

ఓ వైపు పాక్ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్నా.. ఇవి మాత్రం యథేచ్చగా నడుస్తున్నాయంటేనే అర్థం పాక్‌కు చెందిన ఓ బలమైన శక్తి వీటి వెనకుంది అని. అది పాక్ ISI అని. అందుకే ఈ ఉగ్ర గ్రూప్‌లు ఇతర దేశాల్లో జరుగుతున్న దాడులు మాత్రమే కాదు.. సొంత దేశంపై దాడులు జరిగినా.. ప్రజల ప్రాణాలు తీస్తున్నా పట్టించుకోదు.

 

 

Related News

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Nellore Politics: అనిల్ దెబ్బకు వేమిరెడ్డి వెనక్కి తగ్గాడా?

AP BJP: ఏపీలో బీజేపీకి అన్యాయం జరుగుతుందా?

AP Liquor Scam Case: జగన్‌ను ఇరికించిన చెవిరెడ్డి?

BIG Shock To Donald Trump: ట్రంప్‌కు మోదీ దెబ్బ.. అమెరికా పని ఖతమేనా

Big Stories

×