BigTV English

Deepa Das Munshi: రేవంత్‌ దెబ్బకు దీపాదాస్‌ మున్షీ ఔట్‌..?

Deepa Das Munshi: రేవంత్‌ దెబ్బకు దీపాదాస్‌ మున్షీ ఔట్‌..?

Deepa Das Munshi: తెలంగాణ రాజకీయాలు హాట్‌హాట్‌గా మారాయి. ఎప్పటికప్పుడు ప్రతిపక్షాల ఎదురుదాడి, సొంతపార్టీలో సమస్యలు, త్వరలో జరగబోయే ఎన్నికలు..ఇలాంటి సమయంలో కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మార్పు చర్చనీయాంశం అయ్యింది. కొత్త ఇన్‌ఛార్జ్‌గా మీనాక్షి నటరాజన్ నియమితులయ్యారు. మున్షీ స్థానంలో ఆమె ఫుల్ టైం కార్యకలాపాలు కొనసాగించనున్నారు. రాహుల్‌గాంధీ టీమ్‌లో.. కీ పర్సన్‌గా మీనాక్షికి పేరుంది. ప్రస్తుతం తెలంగాణలో ఆమె ముందున్న సవాళ్లు ఏంటి.. ఉన్నట్టుండి దీపాదాస్‌మున్షీని తప్పించేందుకు రీజన్ ఏంటి.. వాచ్ దిస్ స్టోరీ.


కొన్నిరోజులుగా తెలంగాణ కాంగ్రెస్‌ ఇంఛార్జ్‌ మార్పు ఉంటుందని వార్తలు గట్టిగా వినిపించాయి. అనుకున్నట్లు AICC.. తెలంగాణ రాష్ట్ర పార్టీ వ్యవహారాల బాధ్యతను మీనాక్షి నటరాజన్‌కు అప్పగించింది. ఒకట్రెండు రోజుల్లో మీనాక్షి నటరాజన్.. తెలంగాణ కొత్త ఇన్‌ఛార్జ్‌గా.. రాష్ట్ర అధినాయకత్వంతో భేటీ కాబోతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ఇన్‌ఛార్జ్‌గా మీనాక్షి నటరరాజన్‌ ముందు ఉన్న సవాళ్లు ఏంటనే చర్చ సాగుతోంది. బాధ్యతలు చేపట్టగానే ఆమె ముందు ఉన్న మెయిన్ టాస్క్‌.. లోకల్ బాడీ ఎన్నికలు. ఈ బాధ్యతలను అధిష్టానం ఆమెపై ఉంచింది. ముందుగా ఇందులో నటరాజన్.. తన మార్క్‌ చూపించి.. శ్రేణుల్లో ధైర్యాన్ని నింపాల్సి ఉంది. వీటితో పాటు ఇటీవల పార్టీ మారిన ఎమ్మెల్యేల ఎపిసోడ్ ఆమె ముందున్న మరో బిగ్ టాస్క్. నేతలను వ్యక్తిగతంగా కలిసి అందరి సమస్యలు తెలుసుకుని అందరిని కలుపుకుంటూ ముందుకు వెళ్లాల్సి ఉందనేది నేతల మాటగా తెలుస్తోంది.

మరోవైపు.. పార్టీలో పాత, కొత్త నేతల మధ్య కొన్ని వివాదాలు ఉన్నాయి. వాటిని సరిదిద్దూతూనే .. కొన్ని అంశాల్లో ఆచూతూచి అడుగులు వేయాల్సిన అవసరం ఉందనే చర్చ సాగుతోంది. ప్రభుత్వానికి.. TPCCకి మధ్య వారధిగానూ ఆమె సేవలు అత్యంత కీలకం కానున్నాయనేది పొలిటికల్ వర్గాల్లో సాగుతున్న చర్చ. ప్రభుత్వం చేస్తున్న సంక్షేమం,అభివృద్ధి కార్యక్రమాలను.. ప్రజల్లోకి తీసుకువెళ్తూనే ప్రభుత్వ పథకాలను పార్టీ పరంగా క్షేత్రస్థాయిలో ప్రచారం చేయడం లాంటివి కూడా కీలకంగా మారనున్నాయి. ఎప్పటికప్పుడు సమన్వయంతో కార్యచరణ రూపొందించడం కూడా కొత్త బాస్‌ ముందున్న టాస్క్‌గా తెలుస్తోంది.


మొదటి నుంచీ పార్టీ కోసం కష్టపడి జెండా మోసిన వారికి.. పార్టీలోనూ.. ప్రభుత్వంలోనూ సముచిత గౌరవం కల్పించేలా చొరవ తీసుకోవాల్సి ఉంది. పార్టీని నమ్ముకుంటే.. ఎప్పటికైనా మంచి జరుగుతుందనే నమ్మకాన్ని కలిగించేలా కొత్త సారథి చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. అయితే..గతంలో పనిచేసిన అనుభవంతో మీనాక్షి.. ఈ టాస్క్‌లు పెద్ద లెక్క కాదనే వాదనలు ఉన్నాయి. నిజాయితీగా పనిచేసే వారికి సముచిత స్థానం ఇవ్వాలనే ఆలోచనతోనే.. కేంద్ర అధినాయకత్వం మీనాక్షిని తెలంగాణ ఇన్‌ఛార్జ్‌గా పంపిందట. సో ఆశించిన విధంగా పార్టీ మరింత బలోపేతం అయ్యే అవకాశాలున్నాయని పొలిటికల్ వర్గాల్లో సాగుతోంది.

Also Read: అధ్యక్ష పదవి నుంచి ధర్మపురి అవుట్.? కారణం ఇదే..!

ఇప్పటివరకు దీపాదాస్ మున్షీ.. కేరళ రాష్ట్రంతో పాటు తెలంగాణకు అదనపు బాధ్యతలు అందించారు. ప్రస్తుతం ఆమెను.. కేరళకు ఫుల్ టైమ్‌ ఇన్‌ఛార్జ్ అవకాశం కల్పించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి రోజురోజుకీ వస్తున్న ఆదరణ నేపథ్యంలో ఇక్కడ ఫుల్‌ టైమ్‌ బాధ్యతల కోసం మీనాక్షిని.. AICC నియమించినట్లు సమాచారం. మరోవైపు.. మున్షిపై.. కొన్ని నెలలుగా భిన్నమైన అభిప్రాయాలు కూడా వ్యక్తమైనట్లు తెలుస్తోంది. సమయానికి నేతలకు అందుబాటులో లేకపోవటం ఆమెకు మైనస్‌గా మారిందనే టాక్ ఉంది. కీలక సమయాల్లో ఆమె పాత్ర లేకపోవడం .. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లోను ఆంటీముట్టనట్టుగా వ్యవహారించారనే గుసగుసలున్నాయి. ఆయా అంశాలను పరిగణలోకి తీసుకుని AICC.. మీనాక్షిని రంగంలోకి దించిందనే చర్చ సాగుతోంది.

TPCC చీఫ్‌గా పగ్గాలు చేపట్టిన తర్వాత.. మొదటిసారిగా లోకల్ బాడీ ఎన్నికలకు మహేష్ కుమార్ గౌడ్ సిద్ధమయ్యారు. తన మార్క్ కనబర్చాలని ఆయన ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో.. AICC ఇన్‌ఛార్జ్‌గా మీనాక్షి నటరాజన్ కూడా రావడంతో…పార్టీపరంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే అవకాశం లేకపోలేదు. లోకల్ బాడీ ఎన్నికల్లో పార్టీని గెలుపుతీరాలకు చేర్చి.. అధిష్టానానికి భరోసా కల్పించడం సహా క్యాడర్, లీడర్లలో ఉత్సాహం నింపాల్సి ఉంది. తెలంగాణలో పార్టీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. మీనాక్షీ ఎలాంటి యాక్షన్‌ ప్లాన్‌తో ముందుకు వెళ్తారనేది చూడాల్సి ఉంది.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×