Jabardast Edukondalu: జబర్దస్త్ కామెడీ షో..ఈ పేరు వినగానే చాలామంది మోహంలో నవ్వు కనిపిస్తోంది. ఎందుకంటే ఈ షో చూసి నవ్వని వాళ్ళు ఉండరు. జబర్దస్త్(Jabardasth) కామెడీ షో ద్వారా చాలామంది ఇండస్ట్రీలో పాపులర్ అవ్వడమే కాకుండా ఎంతోమందికి బిగ్ రిలీఫ్ అని కూడా చెప్పవచ్చు.అయితే అలాంటి ఈ షో ద్వారా కమెడియన్ లు మాత్రమే ఫేమస్ కాలేదు. ఈ షో కి మేనేజర్ గా చేసిన ఏడుకొండలు (Yedukondalu) కూడా ఫేమస్ అయ్యారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అయినటువంటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి(Shyam Prasad Reddy) దగ్గర సన్నిహితంగా ఉంటూ నమ్మిన బంటుగా ఉన్నారు జబర్దస్త్ ఏడుకొండలు. అయితే అలాంటి ఏడుకొండలు జబర్దస్త్ లో చేస్తూ.. ఎన్నో కోట్లు వెనకేసారని, మణికొండలో లగ్జరీ ఇల్లు కట్టుకున్నారని అప్పట్లో కొన్ని వార్తలు వచ్చాయి.
శ్యాంప్రసాద్ రెడ్డి ఇల్లు కట్టుకోమని డబ్బులు ఇచ్చారు..
అయితే ఈ వార్తలపై యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఏడుకొండలు (Yedukondalu) క్లారిటీ ఇచ్చారు. మీరు నిజంగానే జబర్దస్త్ ద్వారా కోట్లు సంపాదించి మణికొండలో ఓ భారీ బిల్డింగ్ కట్టుకున్నారా అని యాంకర్ అడగగా.. జబర్దస్త్ ద్వారా అని కాదు కానీ శ్యాం ప్రసాద్ రెడ్డి గారు అరుంధతి (Arundhathi) మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాక నాకు కొంత డబ్బులు ఇచ్చి ఇల్లు కొనుక్కోమని చెప్పారు. కానీ నేను నా స్తోమతకు మించి ఇల్లు కొనుక్కున్నాను. దాంతో ఆ ఇంటి కోసం తెచ్చిన డబ్బుకు వడ్డీలు కట్టలేక, చివరికి అదే ఇంటిని అమ్మేసి అప్పులన్నీ తీర్చేసాను. నేను ఇంటి నుండి ఎలా అయితే వచ్చానో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాను.నేను నిజాయితీగా ఉన్నాను తప్ప ఎలాంటి డబ్బులు వెనకేయలేదు.
హీరోల దగ్గర కూడా పనిచేసిన ఏడుకొండలు..
ఇక మణికొండలో బిల్డింగులు కట్టాను అంటూ వచ్చిన వార్తల్లో ఎలాంటి నిజం లేదు. ఇక స్టేజ్ పై నా మీద వేసే ఈ సెటైర్లు కూడా కేవలం కామెడీ కోసం మాత్రమే అంటూ జబర్దస్త్ ఏడుకొండలు క్లారిటీ ఇచ్చారు. అలాగే జబర్దస్త్ షో యూనిట్ మొత్తాన్ని మేనేజర్ గా చేసిన ఏడుకొండలే చూసుకునేవారు. కేవలం జబర్దస్త్ మాత్రమే కాకుండా సినిమాల్లో చాలామంది హీరోల దగ్గర ఏడుకొండల వర్క్ చేశారు. అలా కృష్ణ, మహేష్ బాబు, మోహన్ బాబు, శోభన్ బాబు వంటి ఎంతోమంది హీరోల దగ్గర వర్క్ చేశానని,నాకు హీరో కృష్ణ(Krishna) తర్వాత శోభన్ బాబు అంటే చాలా ఇష్టం అంటూ ఏడుకొండలు చెప్పుకొచ్చారు. ఇక ప్రస్తుతం ఏడుకొండలు చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఏది ఏమైనా జబర్దస్త్ ద్వారా వచ్చిన డబ్బుతో కోట్లు వెనకేసుకున్నాడని, లగ్జరీ ఇల్లు, కార్లు కొనుగోలు చేశాడు అంటూ వచ్చిన వార్తలలో ఎలాంటి నిజం లేదని ఆయనే స్పందించారు.
డిప్రెషన్ కి లోనై.. ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా..
అదే ఇంటర్వ్యూలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా అని చెప్పి అందర్నీ ఆశ్చర్యపరిచారు. “శ్యాం ప్రసాద్ రెడ్డి దగ్గర మేనేజర్ గా పనిచేయడం మానేసిన తర్వాత ఐదు సంవత్సరాలు ఖాళీగా ఉన్నాను. ఆ సమయంలో సొంతంగా షోలు చేయాలి అని, కాన్సెప్ట్ పట్టుకొని కొంతమంది దగ్గరకు వెళ్తే.. వారు నన్ను మోసం చేసి ఆ కాన్సెప్ట్ ను వేరేగా మార్చి షోలు చేశారు. ఇక చేతిలో పని లేదు.. పైగా నేను మోసం చేయడం వల్లే జబర్దస్త్ నుంచి నన్ను తీసేసారని కొంతమంది మాటలు మాట్లాడడంతో డిప్రెషన్ లోకి వెళ్లిపోయాను. అందుకే ఆత్మహత్య కూడా చేసుకోవాలనుకున్నాను. కానీ చచ్చి సాధించింది ఏమీ లేదు. బ్రతికి నిరూపించాలని ఇప్పుడు మళ్ళీ ఈ స్టేజ్ కి వచ్చాను ” అంటూ ఏడుకొండలు తెలిపారు.