EPAPER

Russia vs Ukraine War: మోసపోయి..రష్యా ఆర్మీలో చేరి.. యుద్ధం చేసి తిరిగివచ్చిన భారతీయ యువకుల కథ

Russia vs Ukraine War: మోసపోయి..రష్యా ఆర్మీలో చేరి.. యుద్ధం చేసి తిరిగివచ్చిన భారతీయ యువకుల కథ

Indian recruits in Russian Army: యుద్ధం చేయాలంటే దేశంపైన అమితమైన భక్తి, గౌరవం ఉండాలి. అవేమీ లేని వాళ్లను యుద్ధంలో వాడుతున్నారంటే, వాళ్లని బానిసలుగా చూస్తున్నారని అర్థం. సుఫియాన్ లాంటి వారి విషయంలోనే అదే జరిగింది. యుద్ధ వీరులుగా కాకుండా వారిని బానిసలుగా వాడారు. ఇలాంటి బానిసలు ఇప్పుడు రష్యాన్ ఆర్మీలో చాలా మందే ఉన్నట్లు తెలుస్తుంది. వారిలో భారతీయులను బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక, ఇలా ఇంకెవ్వరూ బలి కాకూడదని కూడా బాధితులు కోరుకుంటున్నారు.


విపరీతమైన దేశభక్తి ఉంటే తప్ప దేశం తరఫున యుద్ధం చేయడం సాధ్యం కాదు. వాస్తవానికి, అలాంటి వారినే ఆర్మీలోకి చేర్చుకుంటారు. అలా లేకపోతే, యుద్ధానికి సంబంధించిన వ్యూహాలు శత్రువుకి లీక్ అవ్వొచ్చు.. లేదా, ఏదైనా జరగొచ్చు. అసలు, యుద్ధం అనేది ఆ దేశ సామర్థ్యానికి, గర్వానికి సంబంధించిన అంశం. అలాంటి చోట విదేశీయులను చేర్చుకోవడం కాస్త విచిత్రంగానే అనిపిస్తుంది. కానీ, నేటి వార్ వ్యవస్థలు మారిపోయాయి. ప్రయివేట్ ఆర్మీలతో దేశాలు యుద్ధానికి దిగుతున్నాయి. ఈ విషయం దేశాధినేతలకు అవగాహన లేకపోవచ్చు. దేశ రక్షణ మంత్రులకు కూడా తెలియకపోవచ్చు. కానీ, ఇది ప్రయివేట్ ఆర్మీ.. వీరంతా కాంట్రాక్ట్ కూలీల కిందే పనిచేయాల్సి ఉంటుంది. దాదాపుగా వీళ్లను బానిసలుగానే చూస్తారు. అలా తాను పడిన కష్టాలను సుఫియాన్ బిగ్ టీవితో పంచుకున్నాడు.

భారతదేశం నుండి వెళ్లిన ఈ బాధితుల్లో తెలంగాణ, యూపీ, గుజరాత్‌, పంజాబ్‌, జమ్ముకశ్మీర్‌లకు చెందిన వారు ఉన్నారు. రష్యా ఉక్రెయిన్‌ల మధ్య రెండేళ్ళుగా కొనసాగుతున్న ఈ క్రూరమైన యుద్ధంలో లక్షల మంది ప్రాణాలు కోల్పోగా.. అంతకుమించి, గాయాలపాలయ్యారు. అయితే, యుద్ధభూమిలో రష్యా సైన్యంలో కొంత భాగం క్షీణించడంతో, రష్యా, వాగ్నర్ గ్రూప్ ద్వారా, ముఖ్యంగా నేపాల్, భారత్ వంటి దేశాల నుండి ఫ్రీలాన్స్ ఫైటర్లను నియమించుకున్నారు. రిక్రూటర్లు ఒక్క నేపాల్ నుండే 15 వేల మందిని రష్యా ఆర్మీలోకి తీసుకున్నట్లు సమాచారం. అభివృద్ధి చెందుతున్న దేశాల నుండి నిరుద్యోగ యువతను ఈ విధంగా మోసగించడంలో బాబా బ్లాగ్స్ పేరుతో యూట్యూబ్ నిర్వహించే ఫైసల్ ఖాన్ లాంటి వారు చాలా మంది ఉండి ఉంటారు.


Also Read:  గురి తప్పింది.. టార్గెట్ ట్రంప్.. వెనక ఉన్నది ఎవరు?

సుఫియాన్‌తో పాటు భారత్‌కు తిరిగి వచ్చిన 45 మంది భారతీయ యువకులు ఇప్పుడు ఎంతో మందిని ఇలాంటి మోసాల బారినపడొద్దని చెబుతున్నారు. ఆ యుద్ధ భూమిలో నుండి వీళ్లు రావడానికి పట్టిన సమయం 9 నెలలే కావచ్చే కానీ, వారు అనుభవించిన బాధ మాత్రం జీవితానికి సరిపోయేంత ఉందనడంలో ఆశ్చర్యం లేదు. తమ కాంట్రాక్ట్ ముగిసిందని తెలిసిన తర్వాత ఉక్రెయిన్ సరిహద్దు నుంచి సెప్టెంబరు ఆరో తేదీన బయల్దేరిన వీళ్లంతా.. దాదాపు 36 గంటలపాటు ప్రయాణించిన తర్వాత మాస్కోకు చేరుకున్నాం. అప్పుడు గానీ వారికి స్వదేశానికి వెళ్తామనే నమ్మకం కలిగింది. అక్కడ డాక్యుమెంటేషన్ ప్రక్రియ పూర్తయ్యాక సెప్టెంబర్ 10వ తేదీన భారత్‌కు బయల్దేరారు. అయితే, ప్రాణాలకు తెగించి కష్టపడిని వీరికి గత నాలుగైదు నెలలుగా జీతం కూడా ఇవ్వలేదని సుఫియాన్ తెలిపాడు.

అయితే, రష్యా ఆర్మీలో పనిచేసే చాలామంది భారతీయులకు చట్టపరమైన వీసాలు లేవని న్యూ ఢిల్లీలోని రష్యా రాయబార కార్యాలయం గతంలో స్పష్టం చేసింది. రష్యా ఉద్దేశ్యపూర్వకంగా సైన్యంలో భారతీయులను చేర్చుకోలేదనీ… ఈ యుద్ధంలో వారి ఎలాంటి పాత్ర లేదనీ.. భారత ప్రభుత్వానికి రష్యా అండగా నిలుస్తుందని కూడా రష్యా రాయబార కార్యాలయం ప్రకటించింది. అయితే, అక్కడ చిక్కుకున్న మిగిలిన వారిని కూడా తీసుకురావడానికి చర్యలు చేపడతామని అంటున్నారు. అయితే, ఈ మోసం బయటపడిన తర్వాత కూడా యూట్యూబర్ ఫైజల్ ఖాన్ లాంటి వాళ్లు ఇంకా సమాజంలో తిరుగుతూనే ఉన్నారు. ఆ మధ్య ఓ మీడియా ఛానల్‌తో మాట్లాడిన ఫైజల్ ఖాన్ నేను ఎలాంటి మోసం చేయలేదని కూడా బుకాయించాడు. ప్రస్తుతం అతను ఎవ్వరికీ అందుబాటులోకి రావట్లేదని తెలుస్తోంది. ఏదైతేనేమీ, ప్రాణం కోసం పడిన పాట్లలో సుఫియాన్ లాంటి వాళ్లు అయితే సురక్షితంగా బయటపడ్డారు. ఆ కష్టం అనుభవించాడు గనుకనే ఇకపై, ఎవ్వరూ ఇలాంటి మోసాలబారిన పడొద్దని సుఫియాన్ కోరుకుంటున్నాడు.

Related News

BRS On Navy Radar station: అప్పుడు అనుమతులు.. ఇప్పుడు అసత్య ప్రచారాలు.. దామగుండం చుట్టూ గులాబీ రాజకీయం

Rapaka Varaprasad: రాపాక దారెటు.. కూటమిలోకి ఎంట్రీ ఇస్తారా ? కలవరమే మిగులుతుందా?

Baba Siddique Murder: బిష్ణోయ్ కులదైవానికి సల్మాన్ బలి..

What is the THAAD: థాడ్ అంటే ఏంటి? ఇది వాడితే ఏ దేశమైనా నాశనమేనా?

JC Prabhakar Reddy: వాటా ఇవ్వాల్సిందే.. దుమారం రేపుతున్న జేసీ మాటలు..

Harish Rao: నెంబర్ 2 నేనే..!

Vijayasai Reddy EVM: ఈవీఎంలు ట్యాంపర్ అయ్యాయి విజయ్‌సాయిరెడ్డి ట్వీట్.. 2019లో టాంపరింగ్ సాధ్యం కాదని చెప్పిన జగన్!

Big Stories

×