EPAPER

Sahithi Infrastructure Fraud: ల‌క్ష్మీనారాయణ లీల‌లు.. మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే

Sahithi Infrastructure Fraud: ల‌క్ష్మీనారాయణ లీల‌లు.. మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే

Sahithi Infra MD Lakshmi Narayana Infrastructure Fraud: 2019లో అమీన్ పూర్ శర్వాని ఎలైట్ పేరుతో ప్రీలాంచ్ డిపాజిట్లు సేకరించి శఠగోపం పెట్టిన తర్వాతే సాహితీ లక్ష్మీనారాయణ గురించి చాలా మందికి తెలిసింది. కానీ అంతకు ముందు ఆయన కథ వేరు. అతడు వాడుకోని పార్టీ లేదు. వ్యక్తి లేడు అన్నట్లుగా గతంలో కథలు నడిచాయి. అసలు లక్ష్మీనారాయణా మజాకా అన్నంతగా సీన్ మారింది. ఎందుకంటే ఆయన స్పెషల్. ఎందులో అంటే మోసాలకే బ్రాండ్ అంబాసిడర్ అవడంలో. అవును ఇదే నిజం అంటున్నారు బాధితులు. ఇతడి బ్యాక్ గ్రౌండ్ చూస్తే ఎవరికైనా దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. అట్లుంటది మరి సాహితీ లక్ష్మీనారాయణతోని.


పొలిటికల్ లీడర్లు, సినిమా స్టార్లను ఈజీగా ఏమార్చిన ఘనత సాహితీ లక్ష్మీనారాయణది. అలాంటిది కామన్ మ్యాన్ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. అందుకే తియ్యటి మాటలకు చాలా మంది డబ్బులు సమర్పించుకుని బలైపోయారు. టీటీడీ బోర్డ్ మెంబర్ దాకా వెళ్లాడంటే పరపతి ఏ స్థాయిలో పెంచుకున్నాడో అర్థమవుతుంది. 2021 సెప్టెంబర్ లో టీటీడీ బోర్డ్ మెంబర్ అయ్యారు బూదాటి లక్ష్మీనారాయణ. అప్పుడు సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేయడంతో టీటీడీ బోర్డ్ మెంబర్ పదవికి రాజీనామా చేశారు లక్ష్మీనారాయణ. కథ తవ్వితే చాలా పెద్దది మరి.

ఒకసారి 2008కి వెళ్దాం. లక్ష్మీనారాయణ స్వస్థలం చిలకలూరిపేట. చిన్న బట్టల షాపుతో వ్యాపారం మొదలెట్టారు. అక్కడ ఐపీ పెట్టేసి గుడ్ బై చెప్పేశారంటారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు అందులో యాక్టివ్ గా మారాడు. చిరంజీవికి దగ్గరగా మసులుకున్నాడు. చివరికి చిరంజీవి పేరును చాలా వరకు మిస్ యూజ్ చేశాడంటారు. ఈ వ్యవహారం తేడాగా ఉందన్న కారణంతో ఆయన్ను PRP నుంచి బయటకు పంపించేశారు. ఇక అక్కడి నుంచి ఊసరవెల్లి రంగులు మార్చినట్లుగా స్టోరీ మార్చేశాడంటారు.


2014 నుంచి 2019 మధ్య లోకేశ్ కు దగ్గరయ్యే ప్రయత్నం చేశారు. అప్పట్లో లోకేశ్ ఐటీ శాఖ మంత్రిగా ఉండడంతో ఐటీ టవర్ల నిర్మాణం పేరుతో హడావుడి చేశారు లక్ష్మీనారాయణ. మొత్తం కెరీర్ లో పేరు ఒకరిది వాడుకోవడం, ఉపయోగించుకోవడం ఇదే కథ. అంటే లోకేష్ పేరు చెప్పడం, ఐటీ టవర్లలో స్పేస్ ఇస్తానని ఐటీ కంపెనీలకు బురిడీ కొట్టడం, తానే దగ్గరుండి టవర్లు కడుతున్నానని చెప్పుకోవడం ఇలాంటివెన్నో అప్పట్లో జరిగాయి. ఫుల్ పైసా వసూల్ కార్యక్రమమే. 30 అంతస్తుల పేరు చెప్పి ఒక్కటీ కట్టలేదు. అంతే కాదు రాజకీయ నేతలు ఎన్నికల్లో పోటీ చేసే టైంలో భారీగా చందాలు కూడా ఇచ్చిన దాఖలాలు ఉన్నాయంటారు.

Also Read: మోసాలకు బ్రాండ్ అంబాసిడర్.. ఒకే స్థలం నలుగురికి.. సాహితీ హిస్టరీ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

2019 వైసీపీ గెలిచాక ఆ పార్టీకి దగ్గరయ్యే ప్రయత్నం చేశారు లక్ష్మీనారాయణ. అంతకు ముందు స్వరూపానందకు దగ్గరై.. ఆయన ద్వారా టీటీడీ బోర్డు మెంబర్ పోస్టు తెచ్చుకున్నారని చాలా మంది చెప్పుకుంటారు. సో చెప్పాలంటే మధ్యలో ఉన్న వారి పేరును వాడుకుని పనులు చేయించుకోవడంలో ఘనాపాఠిగా మారాడన్నది అభియోగం. వ్యాపారానికి ప్లస్ అవుతుందని చాలా మంది పేర్లు చెప్పుకుని వ్యవహారం నడిపించారంటారు. అంటే ఏ స్టేట్ మెంట్ ఇచ్చినా జనం ఈజీగా నమ్మాలి కదా. అందుకే.. సమాజంలో పేరున్న వాళ్ల పేర్లు చెబితే జనం ఈజీగా అట్రాక్ట్ అయ్యి.. ముందుకొస్తారు.. అడ్వాన్స్ లు భారీగా సమర్పించుకుంటారని స్కెచ్ వేశాడు. అనుకున్నట్లుగానే అది చాలా వరకు వర్కవుట్ అయింది కూడా. అంతెందుకు 2018లో మంగళగిరి విల్లా వెంచర్ లో పవన్ కల్యాణ్ ఓ ఇల్లు స్వయంగా కట్టుకుంటే.. అది తమ వెంచర్ లోనే ఉందని, మొత్తం వర్క్ తామే చూస్తున్నామంటూ ప్రచారం చేసుకున్నాడంటారు. సో అక్కడ పవన్ కల్యాణ్ పేరు వాడుకున్నారు. పవన్ కల్యాణే కొన్నారు. మనకూ గ్యారెంటీ ఉంటుందని చాలా మంది ముందుకొచ్చారు. అదే అదనుగా రేట్లు కూడా భారీగా పెంచేశాడన్నది అప్పటి ఆరోపణ.

సినీ నటులతో బ్రోచర్లు.. కార్పొరేట్‌ తరహాలో ప్రకటనలు.. సినీ నటుల సమక్షంలోనే ప్లాట్ల కేటాయింపు.. ఇంధ్రభవనాలను తలపించేలా గ్రాఫిక్స్‌ ఇలాంటివెన్నో చేస్తూ సాహితీ ఎండీ చేసిన కథలు అన్నీ ఇన్నీ కావు. ఏపీ, తెలంగాణ కాదేదీ అనర్హం అన్నట్లుగా పెద్ద ఎత్తున వెంచర్లు వేస్తున్నట్లు బిల్డప్ ఇవ్వడం, ముందుగానే డబ్బులు వసూల్ చేయడం, ఆ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లడం. ఇదే స్టోరీ. గతేడాది గుంటూరు జిల్లా కాజా వద్ద వెంచర్‌ ప్రచారం కూడా ఇలాంటి స్కెచ్ లో భాగమే అని తేలింది. అప్పుడు బాధితులు పోలీసులను కూడా ఆశ్రయించారు. పలువురు సినీ నటులతో ప్రచారం చేయడం, సినీ నటులు ప్లాట్లు కొనకపోయినా కొన్నట్లుగా జనంలో ప్రచారం చేసుకోవడంతో… కృష్ణా, గుంటూరు జిల్లాలు, హైదరాబాద్‌తో సహా ఏపీలో వందలాది మంది కొనుగోలుదారులు ప్లాట్లు, విల్లాస్‌ను కొనుగోలు చేసేందుకు కోట్ల రూపాయలు అడ్వాన్స్‌గా చెల్లించారు. సీన్ కట్ చేస్తే విల్లా లేదు, ఫ్లాట్ లేదు. కనీసం స్థల రిజిస్ట్రేషన్లు కూడా చేయలేదు. డబ్బులు తిరిగి ఇచ్చేయాలని అడిగితే ఇచ్చిన చెక్కులు కూడా బౌన్స్ అయ్యాయి. వాయిదాల మీద వాయిదాలు వేసి చివరికి స్విఛాఫ్ చేసుకోవడం, ఒత్తిడి పెరిగినప్పుడల్లా అజ్ఞాతంలోకి వెళ్లడం ఇదే నడిచిందంటారు.

కాబట్టి ఒక్కో విల్లాను నలుగురైదుగురికి అమ్మడం, అది కూడా అగ్రిమెంట్ చేసి ఇవ్వడం, తీరా పొజిషన్ లోకి వచ్చే సరికి గొడవలు ముదరడం, అవి ఎవరికీ దక్కుకుండా చేయడం ఇదే అసలు స్కెచ్. రైతుల నుంచి భూములు కొన్నా అగ్రిమెంట్లు చేసుకుని డబ్బులు కట్టకపోవడం, ఇటు కస్టమర్ల నుంచి ప్రీలాంచ్ పేరుతో వసూళ్లు చేసి బిల్డింగ్ లు కట్టకపోవడం అంటే రెండువైపులా భారీగా శఠగోపం పెట్టిన పరిస్థితి. బాధితులంతా నెత్తీ నోరు కొట్టుకోవడం తప్ప ఏమీ మిగలలేదు. ఇలాంటి కేసులన్నీ హైకోర్టుకూ చేరాయి. ఇదే కాదు… ఇక హైదరాబాద్ లో అంతా నా చేతుల్లోనే ఉంటారు.. చెప్పివన్నీ జరుగుతాయని ప్రచారం చేసుకుని అగ్రిమెంట్లు, ప్రీలాంచ్ ఆఫర్లతో గేమ్ నడిపిస్తున్నారన్న ఆరోపణలకు లెక్కలేదు. CCS కేసులోనూ ముగ్గురు అధికారులు మారారని, కొత్తవారు వచ్చినప్పుడల్లా విచారణ మొదటికి వస్తుందంటున్నారు బాధితులు. పోలీసుల దగ్గరికి ఎన్నిసార్లు వెళ్లినా బలమైన ఆధారాలు లేవని చెప్పడం, కొంత వరకు భరోసా ఇవ్వడం వంటివి జరిగాయి. కానీ ఇప్పుడు మనీలాండరింగ్ ఇష్యూలో ఈడీ ఎంట్రీ అవడంతో సాహితీ ఇన్ ఫ్రా ఎండీ కథ ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.

 

Related News

Narsingi: నార్సింగిలో బంగారు గని..?

Sabarmati and Thames River: సబర్మతి, థేమ్స్ నదులు ఎలా బాగుపడ్డాయి?

Israel-Iran War: ఇరాన్‌పై దాడికి ఇజ్రాయెల్ వ్యూహం ఇదే!

Osho Rajneesh: కళ్ళకు కట్టినట్టుగా ఓషో రజనీష్ నిజస్వరూపం

YS Jagan: కడపలో జగన్ ప్లాన్ సక్సెస్.. ఎలాగంటే..

YS Jagan in Confusion: అంబటి, రజిని దెబ్బకి.. అయోమయంలో జగన్

Bigg Boss 8 Day 33 Promo1: మార్నింగ్ మస్తీ.. చిలకజోస్యంతో అదరగొట్టిన మణికంఠ..!

×