Satyam Sundaram Collections : తమిళ హీరో కార్తీ రీసెంట్ గా నటించిన సినిమా ‘సత్యం సుందరం ‘.. ఈ మూవీ దేవరాతో పోటీగా విడుదలైంది. కథ కనెక్ట్ అయ్యేలా ఉండటం తో కార్తీ సినిమాకు కలెక్షన్స్ రోజు రోజుకు పెరుగుతున్నాయి. నిన్నటితో పోలిస్తే ఈరోజు కలెక్షన్స్ పెరిగినట్లు తెలుస్తుంది. 96 మూవీ ఫేమ్ దర్శకుడు సీ ప్రేమ్ కుమార్ డైరెక్షన్ లో రూపొందిన ఈ సినిమాను హీరో, హీరోయిన్లు సూర్య, జ్యోతిక నిర్మించారు. ఈ సినిమా బడ్జెట్ ఎంత? ఈ చిత్రానికి బ్రేక్ ఈవెన్ ఎంత? వసూలు చేస్తున్న కలెక్షన్స్..? నాలుగు రోజులకు ఎంత రాబట్టిందో ఇప్పుడు తెలుసుకుందాం..
కార్తీ మొదటి నుంచి విభిన్నమైన కథలతో ఆకట్టుకుంటూ వస్తున్నాడు. ఒక్కో సినిమాలో ఒక్కోలా విభిన్న పాత్రలతో ఆకట్టుకుంటూ వస్తున్నాడు. తెలుగులో ఈయన నటించిన అన్ని సినిమాలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు స్టార్ హీరో అరవింద స్వామితో తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. రొమాంటిక్ మూవీలతో పాటు యాక్షన్ సినిమాలను కూడా చేశాడు. ఇప్పుడు హార్ట్ టచింగ్ కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సత్యం సుందరం సినిమా అతి తక్కువ పాత్రలతో పూర్తిగా తెలుగు నేటివిటికి తగినట్టుగా హృదయాన్ని టచ్ చేసే విధంగా కథను తెరకెక్కించారు. ప్రతి సీన్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.. ఎమోషనల్ సన్నివేశాలకు జనాలు ఫిదా అయ్యారు. ఈ సినిమాను దాదాలుగా 43 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందించారు.. 1000 స్క్రీన్లు, ఓవర్సీస్‌లో 500 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమా 40 కోట్ల రూపాయల బ్రేక్ టార్గెట్ గా ఈ సినిమా థియేటర్లలోకి వచ్చేసింది. ప్రస్తుతం పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది.
ఇక సత్యం సుందరం కలెక్షన్స్ విషయానికొస్తే.. తమిళంలో ఈ సినిమా తొలి రోజు 3 కోట్ల రూపాయలు, రెండో రోజు 5 కోట్ల రూపాయలు రాబట్టింది. గత రెండు రోజుల్లో ఈ సినిమా తమిళం లో 8 కోట్ల రూపాయలు వసూలు చేసింది. మూడు రోజుల కు మరో 3 కోట్లు వసూల్ చెయ్యగా.. నాలుగో రోజు మాత్రం కాస్త డల్ అయ్యినట్లు కనిపిస్తుంది. ఈ మూవీ 2 కోట్లు వసూళ్ చేసిందని సమాచారం. ఇక తెలుగులో మొదటి రోజు కలెక్షన్స్ 40 లక్షలు, రెండో రోజు 40 లక్షలు వసూలు చేసింది. మూడో రోజు కూడా 40 లక్షలు వసూళ్ చెయ్యగా నాలుగో రోజు 35 లక్షలు కలెక్ట్ చేసిందని వార్తలు వినిపిస్తున్నాయి. సండే తో పోలిస్తే మండే కలెక్షన్స్ కాస్త తగ్గినట్లు సమాచారం. ఈ మూవీ కలెక్షన్స్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. మొత్తాని కి కార్తీ అకౌంట్ లో హిట్ పడినట్లే తెలుస్తుంది.. ఇక కార్తీ తన అన్న సూర్య కంగువా సినిమాలో నటిస్తున్నాడు. భారీ యాక్షన్ సన్నివేశాల తో పాటుగా , భారీ బడ్జెట్ తో రాబోతున్న ఈ సినిమా ఈ ఏడాది చివరిలో విడుదల కాబోతుంది. ఈ సినిమా కోసం తమిళ ఫ్యాన్స్ తో పాటుగా తెలుగు సినీ అభిమానులు కూడా వెయిట్ చేస్తున్నారు.