E-Paper
Advertisement

Ambati Rambabu: అంబటి షిఫ్ట్.. వాట్ నెక్ట్స్

Ambati Rambabu: అంబటి షిఫ్ట్.. వాట్ నెక్ట్స్

Ambati Rambabu:  ఓ పక్క వచ్చే ఎన్నికల్లో మళ్ళీ ఎలాగైనా గెలిచి చూపించాలని వైసీపీ ఇప్పట్నుంచే ప్రణాళికలు రచిస్తుంటుంటే.. సత్తెనపల్లి నియోజకవర్గంలో మాత్రం పార్టీను రెండు ముక్కలుగా విరగ్గొట్టి కర్రాబిళ్ళ గేమ్ ఆడుతున్నారట కొందరు వైసీపీ నేతలు. నియోజకవర్గంలో వర్గపోరుతో రాజకీయాలు అటూఇటూ తిరిగి చివరకు వైసీపీ నేతల వరుస రాజీనామాలకు దారితీయడంతో తాడేపల్లిలో పంచాయతీ పెట్టారట పార్టీ పెద్దలు. ఈ రాజీనామాల వ్యవహారంలో పైకి ఒకటి వినిపిస్తున్నా బ్యాగ్రౌండ్ లో మాత్రం ఆ సీనియర్ నేత ‘మనవి’ చేస్తేనే క్యూ కట్టి మరీ రాజీనామాలు చేసారని చెప్పుకుంటున్నారట పబ్లిక్. ఇంతకీ సత్తెనపల్లి వైసీపీలో ఏం జరుగుతోంది? పార్టీతో కర్రాబిళ్ళ గేమ్ ఆడుతున్న నేతలెవ్వరు?

1989లో రేపల్లె ఎమ్మెల్యేగా తొలిసారి విజయం

ఉమ్మడి గుంటూరు జిల్లాలో సత్తెనపల్లి నియోజకవర్గం గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. 2019 – 24 మధ్య అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ నియోజకవర్గం పేరు మారుమ్రోగిపోయింది. అందుకు కారణం ఇక్కడ వైసీపీ నుంచి గెలిచిన మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఎప్పుడో 1989 ఎన్నికల్లో రేపల్లె నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి, మళ్ళీ దాదాపు మూడున్నర దశాబ్దాల తర్వాత 2019 ఎన్నికల్లో సత్తెనపల్లి వైసీపీ నుంచి పోటీ చేసి గెలిచారు అంబటి రాంబాబు. జగన్ కు వీరవిధేయుడిగా ఉన్న అంబటి రాంబాబుకు అదే ప్రభుత్వంలో మంత్రివర్గ పునర్విభజనలో భాగంగా ఇరిగేషన్ శాఖా మంత్రిగా అవకాశం కూడా ఇచ్చారు అప్పటి సీఎం జగన్.

కాంట్రవర్సీలతో ఫేమస్ అయిన అంబటి రాంబాబు

కట్ చేస్తే.. అంబటి పనితీరు ఏమోగానీ ఆయన వ్యవహారశైలి, ప్రత్యర్ధులపై విసిరే వ్యంగ్యాస్త్రాలకు తోడు వరుస కాంట్రవర్సీల్లో ఇరుక్కోవడంతో ఓ రేంజ్ లో ఫేమస్ అయిపోయారు ఇక్కడ వరకూ అంతా బానే ఉన్నా 2024 ఎన్నికల తర్వాత పరిస్థితి మొత్తం మారిపోయింది. సత్తెనపల్లిలో పదేళ్ళపాటు చక్రం తిప్పిన అంబటి రాంబాబు ను కాదని మరో కొత్త నాయకత్వాన్ని దించింది వైసీపీ అధిష్టానం. దీంతో ఇపుడు ఈ నియోజకవర్గంలో నేతల తీరుతో పార్టీకు కొత్త తలనొప్పులు మొదలయ్యాయట.

గుంటూరు వెస్ట్ ఇన్ఛార్జ్‌గా అంబటి

వాస్తవానికి 2014 ఎన్నికలకు ముందు సత్తెనపల్లిలో అంబటి కు టికెట్ ఇవ్వొద్దు అంటూ అప్పట్లోనే కొంతమంది నియోజకవర్గ నేతలు పట్టుబట్టారట. ఎలాగొలా ఆ ఎన్నికల్లో టికెట్ దక్కించుకున్న అంబటి గెలవలేదు. తర్వాత 2019 ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా ఫ్యాన్ గాలిలో అంబటి కూడా అదే సత్తెనపల్లి నుంచి మరోసారి పోటీచేసి గెలిచి మంత్రి కూడా అయ్యారు. గత ఐదేళ్లలో నియోజకవర్గంలో ఆయన చేసిన అభివృద్ధి కంటే ఆయన మీద ఉన్న కాంట్రవర్సీలే ఎక్కువ. అప్పటికే అంబటి మీద అసంతృప్తిగా ఉన్న ఓ వర్గం మరోసారి తమ అసంతృప్తిని అధిస్థానం దృష్టికి తీసుకెళ్లింది. 2024 ఎన్నికల్లో కూటమి నేత కన్నా లక్ష్మీనారాయణ పై అంబటి ఘోర పరాజయం పాలవ్వడంతో ఆయనను నియోజకవర్గం నుంచి సాగనంపక తప్పలేదు. ఇక అంబటి అనుభవాన్ని గుంటూరులో వాడుకోవాలని నిర్ణయించుకున్న జగన్ ఆయన్ను గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా , గుంటూరు వెస్ట్ ఇన్చార్జ్‌గా నియమించారు.

వైసీపీ నేతలు వరుస రాజీనామాలు

సత్తెనపల్లి నుంచి అంబటిని పంపినా ఆయన నుంచి సత్తెనపల్లి ను మాత్రం వేరుచేయలేకపోతుందట పార్టీ. ఈ మధ్య నియోజకవర్గంలో జరిగిన తాజా రాజకీయ పరిణామాలు ఆ ప్రచారానికి మరింత ఊతం ఇస్తున్నాయి. వాస్తవానికి సత్తెనపల్లి నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గం నుంచి అభ్యర్థి కావాలనేది అక్కడ కొంతమంది నేతల పట్టు. అందుకు తగ్గట్టుగానే వైసీపీ అధిష్టానం వృత్తిరీత్యా డాక్టర్ అయిన గజ్జల సుధీర్‌భార్గవ్‌రెడ్డిని సత్తెనపల్లి ఇంఛార్జిగా నియమించింది. మొదట్లో బాగానే ఉన్నా క్రమేనా సత్తెనపల్లి వైసీపీలో లుకలుకలు మొదలైయ్యాయి. గజ్జల భార్గవ్ రెడ్డి నాయకత్వం నచ్చట్లేదని.. ఆయన తన వర్గానికే మద్దతిస్తూ పార్టీలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని పార్టీ నుంచి వివిధ పదవుల్లో ఉన్న పలువురు వైసీపీ నేతలు వరుస రాజీనామాలు చేసేశారు.

కీలక నేతల రాజీనామాలో హాట్ టాపిక్‌గా మారిన సత్తెనపల్లి

ముఖ్యంగా సత్తెనపల్లి మండల పార్టీ అధ్యక్షడు రావిపాటి పురుషోత్తం, సత్తెనపల్లి ZPTC సభ్యరాలు నాగేశ్వరమ్మ, SC సెల్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి చిలకా జయపాల్ తో పాటు మండల గ్రామస్థాయిలో ఉన్న కీలక నేతలు రాజీనామాలు చేయడంతో సత్తెనపల్లి మరోసారి హాట్ టాపిక్ గా మారింది. దీంతో పరిస్థితులు చేజారిపోకుండా అధిష్టానం రాజీనామాలు చేసిన అసంతృప్తి నేతలను పిలిచి బుజ్జగించే ప్రయత్నం చేసింది. మరి ఆ పంచాయతీ ఏమైందో ఇప్పటికీ క్లారిటీ లేదు. అయితే కావాలనే గజ్జల భార్గవ్ రెడ్డి వర్గాన్ని టార్గెట్ చేసేలా నియోజకవర్గంలో ఇంసైడ్ పాలిటిక్స్ జరుగుతున్నాయనేది లోకల్ టాక్. రాజీనామాలు చేసిన వారిలో కొంతమంది అంబటి రాంబాబుకు అత్యంత సన్నిహితులు కావడంతో ఈ రాజీనామాల వ్యవహారం వెనక అంబటి హ్యాండ్ ఉండే ఉంటుందనే టాక్ కూడా నడుస్తోందట కేడర్‌లో.

ఇక గుంటూరే నా చివరి మజిలీ.. అంబటి

మొన్నటి వరకూ సాఫీగా ఉన్న సత్తెనపల్లి రాజకీయాల్లో ఒక్కసారిగా కుదుపులు రావడంతో అంతా అంబటే చేస్తున్నారనే చర్చ మాత్రం జోరుగా నడుస్తోందట. మరోవైపు అంబటి అలాంటి కుతంత్ర రాజకీయాలు చేసే నేత కాదని అనే నేతలూ లేకపోలేదు. గతంలో అంబటిని గుంటూరుకు మార్చినప్పుడూ ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. “ఇక గుంటూరే నా చివరి మజిలీ.. బహుశా ఇక్కడితో నా రాజకీయ ప్రస్థానం ముగుస్తుందనుకుంటా” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు చూస్తే … సత్తెనపల్లిలో ఇపుడు జరుగుతున్న తాజా పరిణామాల వెనక అంబటి ఉన్నారనే ఆరోపణలకు సంబంధం ఉన్నట్టే అనిపించదు.

సత్తెనపల్లిని ఎట్టి పరిస్థితిలో వదిలేదే లేదు..

నిజానికి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టీడీపీకి కంచుకోట. 2019 లో ఫ్యాన్ గాలిలో కూడా ఈ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థే గెలిచారు. అలాంటి బలమైన నియోజకవర్గానికి తనను పంపడం పట్ల అప్పట్లో అంబటి అసంతృప్తి వ్యక్తం చేశారనే వార్తలూ వచ్చాయి. 2024 ఎన్నికలకు ముందు తాను సత్తెనపల్లిని ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదని.. ఇక్కడ సీటు గెలిచి జగన్ కు గిఫ్ట్ ఇస్తానంటూ టీ కప్పు ప్రచారాలు కూడా చేశారు అంబటి. తీరా చూస్తే అక్కడ ఘోర పరాజయం పాలయ్యారు. దీంతో ఇపుడు మళ్ళీ పాత కథే మొదలెట్టారట అంబటి.

టీడీపీను దెబ్బతీసి పట్టు సాధించేందుకు ప్రయత్నాలు

అంబటి రాంబాబు ప్రస్తుతం గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఇంచార్జిగా ఉన్నారు. ఇప్పటికే అక్కడ బలంగా ఉన్న టీడీపీను దెబ్బతీసి నియోజకవర్గంపై పట్టు సాధించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారట. అందులో భాగంగానే ఇటీవల శంకర్ విలాస్ బ్రిడ్జ్ వద్దకు వెళ్లి పనులు పరిశీలించిన అంబటి.. స్థానిక ఎంపీ పెమ్మసాని, లోకల్ టీడీపీ ఎమ్మెల్యేలపై తన స్టైల్ లో తీవ్ర విమర్శలు గుప్పించారు.

కూటమి ప్రభుత్వంపై విమర్శలు

ఇలా సందర్భం దొరికిన ప్రతీసారి కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ గుంటూరులో తన మార్క్ రాజకీయాలతో మార్కులు కొట్టేయాలని చూస్తున్నారట అంబటి. ఒకవేళ గుంటూరులో వర్కౌట్ కాకపోతే ఆల్టర్నేటివ్ ఏంటి అనే కోణంలో కూడా అంబటి ఇప్పట్నుంచే పరిస్థితులను సిద్ధం చేసుకుంటున్నారనేది రాజకీయ విశ్లేషకుల మాట. అందుకే ఇటీవల తన సొంతూరైన రేపల్లెలో కాపు వనసమారాధనకు హాజరైన అంబటి 1989 నాటి కబుర్లు చెప్పుకొస్తూ.. “నా తర్వాత ఇక్కడ మళ్ళీ కాపు ఎమ్మెల్యే రాలేదు.. ఇక్కడ ఎవరైనా కాపులు ఎమ్మెల్యే కావాలని నా కోరిక” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రేపల్లె పై అంబటి ఆసక్తిని తేటతెల్లం చేస్తున్నాయంటున్నారు.

తనదైన శైలిలో రాజకీయాలు చేస్తూ హాట్ టాపిక్‌గా మారిన అంబటి

మొత్తంగా ఇలా అటు సత్తెనపల్లి ఇటు గుంటూరు అలాగే రేపల్లెలో తనదైన శైలిలో రాజకీయాలు చేస్తూ హాట్ టాపిక్ గా మారారు అంబటి. మరి వచ్చే ఎన్నికలకు అంబటి గుంటూరు వెస్ట్ నుంచే పోటీ చేస్తారా? లేదా తనకు కావాల్సిన స్థానాన్ని తనకే వచ్చేలా పావులు కదుపుతారా? సత్తెనపల్లిలో రాజీనామాల వ్యవహారం ఎత్తుకుపైఎత్తు రాజకీయాలేనా? అసలు ఇవన్నీ కాకుండా తన సొంతగడ్డ రేపల్లెలోనే అంబటి పాగా వేస్తారా? అసలు ఎక్కడ నుంచి పోటీ చేసినా అంబటి గెలిచే ఛాన్స్ ఉందా? వీటన్నింటికీ ఆన్సర్ తెలియాలి అంటే వచ్చే ఎన్నికల వరకూ ఆగాల్సిందే.

Story by Ajay, Big Tv 

Related News

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు.. ‘పీపీపీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు!

పవన్ కళ్యాణ్ ‘సంకల్ప సభ’కు షాక్.. తెలంగాణ ప్రభుత్వం నో-పర్మిషన్!

Big Stories

×