BigTV English

Allu Arjun Journey: గంగోత్రి నుంచి పుష్ప వరకు.. యాక్టింగ్ స్టార్ అల్లు అర్జున్..

Allu Arjun Journey: గంగోత్రి నుంచి పుష్ప వరకు.. యాక్టింగ్ స్టార్ అల్లు అర్జున్..
Allu Arjun latest news

Allu Arjun latest news(Telugu cinema news):

టాలీవుడ్‌. ఘన చరిత్రకు కేరాఫ్‌. కానీ ఇప్పటి వరకు ఒక్క జాతీయ ఉత్తమ నటుడు అవార్డు మాత్రం రాలేదు. 68 ఏళ్లుగా ఆశగా అనౌన్స్‌మెంట్‌ను వినడమే తప్ప.. అవార్డును మాత్రం దక్కించుకున్న దాఖలాలు లేవు. మన గత సినిమాల్లో కథ, కథనం మనసుకు తాకేలా ఉండవనే ఆరోపణ ఉండేది. కానీ, కాలం మారింది. ప్రస్తుతం టాలీవుడ్ 2.0 నడుస్తోంది. RRR, పుష్పలు రికార్డులు బద్దలు కొట్టాయి. కమర్షియల్ వ్యాల్యూస్‌ ఉంటూనే.. స్టోరీ, మేకింగ్‌తో కుమ్మేశాయి. ఫలితం.. జాతీయ అవార్డుల పంట పండింది. అల్లు అర్జున్ ఏకంగా జాతీయ ఉత్తమ నటుడిగా టాలీవుడ్ చరిత్రలో నిలిచిపోనున్నారు.


అల్లు అర్జున్.. సరదాగా నవ్విస్తాడు.. డాన్స్‌తో షేక్ చేస్తాడు.. మేనరిజమ్‌తో కట్టిపడేస్తాడు.. వాట్ నాట్.. సినిమా కోసం అస్సలు తగ్గేదేలే అంటాడు. అందుకే 68 ఏళ్లుగా టాలీవుడ్‌కు అందని ద్రాక్షగా మారిన జాతీయ ఉత్తమ నటుడు అవార్డును కొల్లగొట్టేశాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌. టాలీవుడ్‌ చిరకాల కోరికను నెరవేర్చాడు. అంత ఈజీగా రాలేదు అవార్డు. బన్నీ డెడికేషన్ అంతాఇంతా కాదు. పుష్పలో హీరో మాట్లాడే చిత్తూరు యాస కోసం దాదాపు ఏడాది పాటు ప్రాక్టీస్‌ చేశాడు.

20 ఏళ్ల కెరీర్, 22 సినిమాలు, 19 విజయాలు, 14 మంది వేర్వేరు దర్శకులతో సినిమాలు.. స్టైలిష్‌ స్టార్‌ సినీ లైఫ్‌లో ఇవి ఇంట్రెస్టింగ్‌ నంబర్లు మాత్రమే కాదు.. గంగోత్రి నుంచి పుష్ప వరకు బన్నీ యాక్టింగ్‌లో, డాన్స్‌లో, మ్యానరిజమ్‌లో వచ్చిన మార్పులు ఎన్నో. అల్లు వారి నట వారసుడు క్లాస్, మాస్ అనే డిఫరెన్స్‌ లేకుండా అన్ని వర్గాలను మెస్మరైజ్ చేస్తున్నాడు.


సీనియర్ దర్శకుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో అల్లు అర్జున్ మొదటి సినిమా గంగోత్రి 2003 మార్చిలో వచ్చింది. హీరోగా అరంగేట్రానికి తండ్రి అల్లు అరవింద్, మామ మెగాస్టార్‌ అండదండలు ఉపయోగపడ్డా.. ఇండస్ట్రీలో సొంతంగా ఇమేజ్ సంపాదించడానికి మాత్రం చాలా కష్టపడ్డాడు బన్నీ.

గంగోత్రిలో అమాయకంగా కన్పించిన కుర్రాడికి.. పుష్పలో కరడుగట్టిన స్మగ్లర్‌లా కన్పించిన నటుడికి ఎంత చేంజ్‌ ఉందో స్క్రీన్‌ చూస్తే అర్థమైపోతుంది. తనను తాను ప్రూవ్‌ చేసుకోవడానికి వచ్చిన ఏ చాన్స్‌ను కూడా ఈ స్టార్‌ హీరో వదులుకోలేదు. గంగోత్రిలో కనిపించిన కుర్రాడి యాక్టింగ్‌కు అంత ప్రశంసలు రాకపోగా విమర్శలు వచ్చాయి. కానీ ఆ తర్వాత ఏడాది వచ్చిన ఆర్యలో తన నటనతో వారందరి నోరు మూయించి లవర్‌ బాయ్‌ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు.

ఆర్య, ఆర్య 2, హ్యాపీ, జులాయి సినిమాల్లో సరదాగా ఉండే పాత్రల్లో ప్రేక్షకులను నవ్విస్తే.. పరుగు, వేదం, వరుడు లాంటి సినిమాల్లో తన నటనతో ఆడియన్స్ గుండె బరువెక్కేలా చేశాడు బన్నీ. సన్ ఆఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో, దువ్వాడ జగన్నాథం లాంటి సినిమాల్లో యాక్టింగ్‌తో ఇంట్లో సభ్యుడిగా కనిపిస్తాడు. రేసుగుర్రంలో అల్లరి చేస్తూ.. సరైనోడు, నా పేరు సూర్య సినిమాల్లో సీరియస్‌గా కనిపిస్తూ.. తన మార్క్ నటనతో అదరగొట్టాడు అల్లు అర్జున్.

ఇక, స్టైలిష్‌ స్టార్‌ డాన్సింగ్ స్టైల్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. డ్యాన్స్ అంటే బన్నీ, బన్నీ అంటే డ్యాన్స్. అర్జున్‌కు డ్యాన్స్‌ అంటే ప్రాణం. పుష్ప సినిమాలో శ్రీవల్లి పాటలో చెప్పు జారిపోయే స్టెప్ ఓ చిన్న ఎగ్జాంపుల్. ఆయన నటించిన ప్రతి మూవీలో డాన్స్‌ మూవ్స్‌ ఓ రేంజ్‌లో క్రేజ్‌ క్రియేట్ చేస్తాయి. ప్రతి సినిమాలో ఓ సిగ్నేచర్ స్టెప్‌ ఉంటుంది.

డ్యాన్సే కాదు.. తన మేనరిజమ్స్‌తోనూ సినిమాకు ఓ హైప్ క్రియేట్‌ చేస్తాడు బన్నీ. పుష్పలో తగ్గేదేలే.. రేసు గుర్రంలో ద్యావుడా.. సన్నాఫ్‌ సత్యమూర్తిలో చాలా బాగోదు.. ఇలా ఒక్కో మూవీలో ఒక్కో మేనరిజమ్‌తో చింపేశాడు.

బన్నీ టాలీవుడ్‌లోనే కాదు.. కేరళలో కూడా కాసులు కురిపించే హీరో. మలయాళంలో బన్నీకి బ్రహ్మరథం పడతారు. పుష్ప రిలీజ్‌ తర్వాత హిందీ బెల్ట్‌లో కూడా సత్తా చాటాడు అల్లు అర్జున్‌. పుష్పకు ముందే ఓటీటీలో తన డబ్బింగ్ మూవీస్‌తో ఎప్పుడో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు బన్నీ.

డెడికేషన్, డిసిప్లేనే బన్నీని ఇంతవాడిని చేసింది. ప్రయోగాలకు నో చెప్పడం అస్సలు అలవాటు లేదనే చెప్పాలి. కథ నచ్చితే చాలు.. ఏం చేయడానికైనా రెడీ అయిపోతాడు. అది హీరోగా అయినా.. గెస్ట్‌ రోల్‌ అయినా తగ్గేదేలే అంటాడు. రుద్రమదేవిలో గోన గన్నారెడ్డి.. వేదంలో కేబుల్‌ రాజు అలాంటివే.

వివాదాలకు దూరంలో ఉంటూ.. బిజీగా సినిమాలు చేస్తూ.. ఖాళీ సమయంలో ఫ్యామిలీతో చిల్ అవుతూ.. ఐకానిక్ స్టార్ టాలీవుడ్‌కే ఐకాన్‌గా నిలిచాడు. బన్నీ.. ఎందులోనూ తగ్గేదేలే.

Tags

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×