Srikakulam Politics: రాజకీయ చైతన్యానికి పెట్టింది పేరు శ్రీకాకుళం జిల్లా. అయితే సిక్కోలులో రాజకీయ విమర్శలు ప్రతి విమర్శలు సవాళ్లు మాత్రమే ఉంటాయి. హత్య రాజకీయాలకు అసలు చోటే ఉండదు. అయితే తనను హత్య చేయడానికి కుట్ర జరుగుతుందని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ చేసిన కామెంట్స్ కామెంట్స్ శ్రీకాకుళంలో రాజకీయంగా పెను దుమారానికి దారితీసాయి. ధర్మాన సోదరులు టార్గెట్‌గా దువ్వాడ ఆరోపణలు గుప్పించడం హాట్‌టాపిక్‌గా మారింది.. అసలు సిక్కోలు వైసీపీలో ఏం జరుగుతోంది?
ధర్మాన, కింజరాపు ఫ్యామిలీలు కేంద్రంగా సిక్కోలు రాజకీయాలు
శ్రీకాకుళం జిల్లా రాజకీయాలు ధర్మాన, కింజరాపు ఫ్యామిలీల కేంద్రంగా నడుస్తుంటాయి. ఈ రెండు ఫ్యామిలీలు రెండు వేరువేరు పార్టీల్లో ఉన్నప్పటికీ అవగాహన రాజకీయాలు చేస్తాయన్న ఆరోపణలు ఉన్నాయి. పొలిటికల్ సర్కిల్స్‌లో ఆ ఆరోపణలు కనుమరుకు కాకుండా ఎప్పటికప్పుడు నేనున్నానంటూ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఏదో ఒక అంశం మీద మాట్లాడుతూ ఉంటారు. అయితే ఇదే అంశం ఇప్పుడు రాజకీయాలను వేడెక్కించడానికి కారణమైంది. ధర్మాన కృష్ణదాస్ తనను హత్య చేయడానికి ప్లాన్ చేస్తున్నారని దువ్వాడ శ్రీనివాస్ బాంబు పేల్చారు. అప్పన్న అనే కార్యకర్త తమకు కాల్ చేసి చెప్పాడని ఓ ఆడియో కూడా రిలీజ్ చేశారు.
సంచలనంగా మారిన అప్పన్న ఆడియో
దువ్వాడ శ్రీనివాస్‌పై నరసన్నపేట లేదా నిమ్మడలో అటాక్ చేయడానికి ప్లాన్ జరుగుతుందని అప్పన్న ఆయనతో చెబుతున్న ఆడియో సంచలనంగా మారింది. ధర్మాన కృష్ణదాస్ అటాక్ చేయించడానికి ప్లాన్ చేశారని ఈ ఆడియో సారాంశం. నిజంగానే దువ్వాడపై దాడి చేస్తామని ధర్మాన చెప్పారా? దాడి చేయడానికి ప్లాన్ గీసారా? అనేది కృష్ణదాస్‌కి మాత్రమే తెలియాలి. శ్రీకాకుళం జిల్లాలో దాడులు హత్య రాజకీయాలకు చోటు లేకపోయినప్పటికీ.. ధర్మాన, కింజరాపు కుటుంబాలతో దువ్వాడ శ్రీనివాస్ వైరం మాత్రం ఆ స్థాయిలో ఉండటంతో సిక్కోలులో ఆ సంస్కృతి పురులు విప్పుతుందేమో అని స్థానికులు భయాందోళనలు చెందుతున్నారంట…
ధర్మాన సోదరులపై విమర్శలు తీవ్రతరం చేసిన దువ్వాడ
వైసీపీ అధ్యక్షుడు జగన్‌పై ఒత్తిడి తీసుకొచ్చి ధర్మాన సోదరులు తనను వైసీపీ నుంచి సస్పెండ్ చేయించారని దువ్వాడ శ్రీనివాస్ మొదటి నుంచి ఆరోపిస్తున్నారు. పార్టీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత ధర్మాన సోదరులపై దువ్వాడ శ్రీనివాస్ విమర్శలు తీవ్రం చేశారు. ధర్మాన సోదరులతో పాటు కింజరాపు ఫ్యామిలీని కూడా విమర్శల్లో కలుపుకుపోవడం దువ్వాడ శ్రీనివాస్ స్టైల్. తన రాజకీయంగా తొక్కేయడానికి కింజరాపు, ధర్మాన కుటుంబాలు కుట్రలు చేస్తున్నాయని దువ్వాడ విమర్శలు గుప్పిస్తున్నారు.
తన సామాజికవర్గాన్ని కూడా ఎదగనీయడం లేదని దువ్వాడ విమర్శలు
తనను మాత్రమే కాదు తన సామాజిక వర్గాన్ని కూడా రాజకీయంగా ఎదగనివ్వడం లేదని ఆ రెండు కుటుంబాలపై దువ్వాడ విమర్శలు ఎక్కువ పెడుతున్నారు. ఈ మధ్యకాలంలో దొరికిన ఏ అవకాశాన్ని వదులుకోకుండా ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరి వరుస ఆరోపణలు చేస్తున్నారు. ఇటీవల జగన్ పుట్టినరోజు వేడుకల్లో ధర్మాన కృష్ణదాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గం సమన్వయకర్తగా ఉన్న తమ్మినేని సీతారాంను తప్పించి ఆయన స్థానంలో కొత్త వ్యక్తిని నియమించే ఆలోచనలో జగన్ ఉన్నారని అన్నారు. తమ్మినేనికి మరో పదవి ఇచ్చి.. అనుభవజ్ఞులైన వ్యక్తిని శ్రీకాకుళం ఎంపీగా పోటీ చేయిస్తామని తెలిపారు. దీనిపై దువ్వాడ శ్రీనివాస్ ఫైరయ్యారు.
Also Read: కష్టమేనా? రాజాసింగ్ కథ రివర్స్..
తమ్మినేని సీతారాం కంటే జిల్లాలో అనుభవజ్ఞులు ఎవరున్నారు అని ప్రశ్నించారు. తమ సామాజిక వర్గాన్ని రాజకీయంగా ఎదగనీయకుండా చేసే కుట్రలో భాగంగానే ఇదంతా జరుగుతోందని మండిపడ్డారు. చివరికి ధర్మాన కృష్ణదాస్ క్షమాపణలు చెప్పుకునే వరకు పరిస్థితి చేరింది. తాను క్షమాపణలు చెప్పే పరిస్థితి రావడానికి దువ్వాడ శ్రీనివాస కారణమని కృష్ణదాస్ బాధించి ఉంటారని పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చ నడుస్తుంది. ఆ కోపంతోనే దువ్వాడపై దాడి చేస్తామని ధర్మాన కృష్ణదాస్.. కింజరాపు అప్పన్న దగ్గర చెప్పారా? లేకపోతే అందులో ఏమైనా కల్పితం ఉందా? అన్నదానిపై కృష్ణ దాస్ క్లారిటీ కోసం అందరూ ఎదురుచూడాల్సి వస్తోందిప్పుడు.
Story By Ajay Kumar, Bigtv