E-Paper
Advertisement

తాజ్‌మహల్ కింద ఉన్న రహస్యం ఏంటి? సమాధా.. శివాలయమా?

తాజ్‌మహల్ కింద ఉన్న రహస్యం ఏంటి? సమాధా.. శివాలయమా?
Advertisement

Taj Mahal: తాజ్‌మహల్‌ సమాధా.. శివాలయమా..? ఇప్పుడిదే అంశం.. అంతుచిక్కని ప్రశ్నగా మారింది? చారిత్రాత్మక కట్టడాలను దేశసంపదగా చూడాలా.? ఓ మతానికి చెందిన ఆస్తిగా పరిగణించాలా? ఈ దేశంలో గతాన్ని తవ్వే తపన.. వివాదాన్ని రగిల్చే అగ్గికి మారుతుందా?

తాజ్ మహల్ ఒక శివాలయం..?

Advertisement

తాజ్‌మహల్‌ను ఇన్నేళ్లు. ఓ మత కట్టడంగా కాకుండా ప్రేమకు ప్రతీకగా చూశాం. కానీ కొద్దీరోజులుగా ఈ అద్భుత కట్టడం చుట్టూ వివాదాల పొగలు ముసురుతున్నాయి. అది మొఘలుల కట్టడం కాదు.. ఒకప్పటి శివాలయం అంటూ అలహాబాద్ హైకోర్టులో కొత్త పిటిషన్ దాఖలైంది. తాజ్‌మహల్ వాస్తవానికి ఒక శివాలయమని, దాని పేరు ‘తేజో మహాలయ’ అని పిటిషనర్ వాదిస్తున్నారు.దీనిపై విచారణ చేపట్టిన కోర్టు ఇచ్చిన నోటీసులు దేశంలో సరికొత్త చర్చకు తెరలేపాయి. అసలు ఇప్పటికే ఉన్న సామాజిక, మతపరమైన వివాదాలు చాలవా? వందల ఏళ్లు వెనక్కి వెళ్లి, చరిత్రను తవ్వడం వల్ల ఈ సమాజానికి ఏం ప్రయోజనం..

సామాజిక సమతుల్యతకు దెబ్బ

Advertisement

చరిత్ర అనేది నిరంతరం మారే ప్రవాహం. రాజులు మారారు, సామ్రాజ్యాలు మారాయి, సంస్కృతులు ఒకదానిలో ఒకటి లీనమయ్యాయి. ఇలాంటి సమయంలో కాలగర్భంలో కలిసిపోయిన వందల ఏళ్ల నాటి చరిత్రను తవ్వి తీయాలనే తపన గొప్పదే. కానీ అది వర్తమాన సామాజిక సమతుల్యతను దెబ్బతీయకూడదు. మన దేశం అనేక సంస్కృతులు, మతాలు, సామ్రాజ్యాల సమ్మేళనం. ప్రతి కాలంలోనూ మార్పులు జరిగాయి. కానీ, వందల ఏళ్ల నాటి చరిత్రను తవ్వి, నేటి తరాల మధ్య గోడలు కట్టడం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్నలు వస్తున్నాయి.

Also Read: పవన్‌పై చీటింగ్ కేసు.. సుగాలి ప్రీతి ఎపిసోడ్ వెనుక అసలు కథ ఇదేనా?

తాజ్ మహల్‌పై పిటిషన్లు

తాజ్‌మహల్‌పై పిటిషన్లు రావడం ఇదేం మొదటిసారి కాదు, బహుశా చివరిదీ కాకపోవచ్చు. అయితే, ఇక్కడ ప్రాథమికంగా వేసుకోవాల్సిన ప్రశ్న ఒకటి ఉంది.. చరిత్రను మనం పాఠంగా మార్చుకోబోతున్నామా? లేక సమాజంలో విభజనకు ఆయుధంగా వాడుకోబోతున్నామా? అన్నది విశ్లేషించుకోవాలి. ఒకవైపు దేశం ఆర్థికంగా, సాంకేతికంగా ముందుకు దూసుకుపోవాలని కలలు కంటుంటే… ఇలాంటి వివాదాలు సమాజాన్ని వెనక్కి నెడుతున్నాయనేది నిపుణుల అభిప్రాయం. చారిత్రక కట్టడాలు ఓ మతానికి చెందినవి కాకుండా.. అవి దేశ సంపద అని గుర్తించాల్సిన అవసరం ఉంది.

Related News

పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కాం.. నీరవ్ మోడీ లండన్ జైలు టు ఇండియా.. పూర్తి వివరాలు!

పవన్‌పై చీటింగ్ కేసు.. సుగాలి ప్రీతి ఎపిసోడ్ వెనుక అసలు కథ ఇదేనా?

ధరణి ‘ఘోస్ట్’ దందా.. ఓటీపీ లేదు, ఓనర్ లేడు.. అర్ధరాత్రి వేల ఎకరాలు మాయం!

ఫ్రూట్స్, ఫిష్ కోడ్‌లతో డ్రగ్స్ దందా.. హైదరాబాద్‌లో నయా ట్రెండ్!

మెట్రో ప్రయాణికులకు తిప్పలు: డిజిటల్ జోరు.. సామాన్యుడికి బేజారు!

సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులపై ఉక్కుపాదం.. తెలంగాణ కొత్త బిల్లు ప్రత్యేకతలు!

Suicide Harassment: నాతో ఎఫైర్ కంటిన్యూ చేయాల్సిందే.. వేధింపులు తట్టుకోలేక యువకుడు ఆత్మహత్య!

Big Stories

Advertisement
×