E-Paper
Advertisement

పవన్‌పై చీటింగ్ కేసు.. సుగాలి ప్రీతి ఎపిసోడ్ వెనుక అసలు కథ ఇదేనా?

పవన్‌పై చీటింగ్ కేసు.. సుగాలి ప్రీతి ఎపిసోడ్ వెనుక అసలు కథ ఇదేనా?
Advertisement

Sugali Preethi: ఒకటి కాదు, రెండు కాదు.. వరుస దారుణాలు.. అకృత్యాలు.. ఏపీలో ఎన్ని ఘటనలు జరిగినా.. వాటిపై అధికార, విపక్షాలు మాటల యుద్ధానికి దిగడమే తప్ప.. బాధిత కుటుంబాలకు సత్వర న్యాయం చేసింది లేదు. సాయికృష్ణ లాకప్‌ డెత్‌ కేసు అటు తిరిగి ఇటు తిరిగి క్యాస్ట్‌ పాలిటిక్స్‌కు దారి తీశాయి. దీంతో ఈ ఘటన రాజీయాలకు కేంద్రంగా మారింది. అయితే, సాయి మరణించి 60 రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు బాధిత కుటుంబానికి అతని బూడిదను కూడా అందించలేకపోయింది అధికార యంత్రాంగం.

పనన్ కళ్యాణ్ తొలి సంతకం ఆ కేసు పైనే..

Advertisement

ఇక, 2017 నుంచి సుగాలి ప్రీతి కుటుంబం న్యాయం కోసం పోరాడుతోంది. తాను అధికారంలోకి రాగానే చేసే తొలి సంతకం సుగాలి ప్రీతి కేసు ఫైలుపైనే అని గతంలో పవన్‌ కల్యాణ్‌ హామీ ఇచ్చారు. అయితే, తీరా అధికారంలోకి వచ్చాక మాట మార్చారు. ఈ కేసులోని సాక్ష్యాలను గత వైసీపీ సర్కార్‌ ధ్వంసం చేసిందని కామెంట్స్‌ చేశారు. దీంతో ప్రీతి తల్లి తీవ్ర స్థాయిలో ఫైర్‌ అయింది. ఇచ్చిన హామీని నిలుపుకోలేదని నేరుగా డిప్యూటీ సీఎంపై గన్నవరంలో చీటింగ్ కేసు పెట్టింది.

కూటమి ప్రభుత్వంపై వైసీపీ ఒత్తిడి..

Advertisement

సుగాలి ప్రీతి కుటుంబం కర్నూలు జిల్లాకు చెందినది. కానీ ఫిర్యాదు చేసింది మాత్రం కృష్ణా జిల్లాలోని గన్నవరం PSలో.. విజయవాడ పరిసర ప్రాంతాల్లో సాయికృష్ణ లాకప్ డెత్ కేసు వల్ల కూటమి ప్రభుత్వంపై YCP తీవ్ర ఒత్తిడి తెస్తోంది. ఇలాంటి సమయంలోనే ఈ ఫిర్యాదు రావడం వెనుక విపక్షాల రాజకీయ వ్యూహం అందనే అనుమానాలు జనసేన లేవనెత్తుతోంది. పవన్ ఎప్పుడూ మహిళల రక్షణ, సామాజిక న్యాయం గురించి మాట్లాడతారు. సరిగ్గా ఆయన అస్త్రంతోనే ఆయన్ని దెబ్బతీయడానికి ప్రతిపక్షాలు ఈ ఇష్యూను రాజకీయంగా వాడుకుంటున్నాయనే వాదనలు పొలిటికల్‌ సర్కిల్స్‌లో బలంగా వినిపిస్తున్నారు.

Also Read: ధరణి ‘ఘోస్ట్’ దందా.. ఓటీపీ లేదు, ఓనర్ లేడు.. అర్ధరాత్రి వేల ఎకరాలు మాయం!

ఇచ్చిన హామీని నెరవేర్చాలి..

అయితే, ఒక తల్లిగా పార్వతికి తన బిడ్డకు న్యాయం జరగాలనే తపన, ఆవేదన ఉంటుందనేది 100 శాతం నిజం. ఆమెకు ఇచ్చిన హామీని నెరవేర్చాల్సిన బాధ్యత పవన్‌పై ఉంది. ఇలా ఏ కేసు తీసుకున్నా.. నేరాలను, ఘోరాల చుట్టూ ఏపీలో రాజకీయాలు తిరుగుతున్నాయి. కేసు పరిష్కారం మాట అటుంచి మాటల యుద్ధానికి దిగుతున్నారు. ఏపీలో పెరుగుతున్న ఈ రాజకీయ రుగ్మతకు తెర పడేది ఎప్పుడు? ప్రజల్లో పెరుగుతున్న అసహనాన్ని నాయకులు ఇప్పటికైనా గుర్తిస్తారా? అనేది ప్రస్తుతం మిలియన్‌ డాలర్ల క్వశ్చన్‌.

Related News

ఒబామాకే ఇచ్చారు.. నాకెందుకివ్వరు.. నోబెల్ శాంతి బహుమతిపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు!

ఉపాధి హామీ పనుల్లో సంచలన రికార్డ్.. గత ఐదేళ్లలో ఇదే టాప్ హజరు శాతం

ఆ నలుగురు… ప్రజాస్వామ్యం ఖూనీ చేశారు..! ప్రభుత్వ పతనంపై రాహుల్‌ శపథం..! ఆ నలుగురు టార్గెట్‌గా ఢిల్లీ ఆందోళన..

ఎలాన్ మస్క్ సంచలన పోస్ట్.. స్టార్‌లింక్ రాకపై భారత్‌లో మళ్లీ చెలరేగిన వివాదం!

తెలంగాణ సచివాలయంలో సెకండ్ ఫ్లోర్ మిస్టరీ.. అసలు అక్కడ ఏం జరుగుతోంది?

సీఎం రేవంత్ నిర్ణయంపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల విమర్శలు.. అసలేం జరిగిందంటే?

ఇదేం విచిత్రం వరికే అగ్రతాంబూలమా.. ఆ పంటలపై వ్యవసాయ పరిశోధకులు శీతకన్ను..?

సర్‌పై ఢిల్లీ దద్దరిల్లుతున్న వేళ.. రెండు తెలుగు రాష్ట్రాల ప్రతిపక్షాల్లో నిస్తేజం..! బీఆరెస్‌ సైలెంట్‌ మోడ్‌.. వైసీపీ గప్‌చుప్‌..!

Big Stories

Advertisement
×