E-Paper
Advertisement

Balamrutham: తెలంగాణ ఫుడ్స్ వేదికగా సీఎం రేవంత్ సంచలన హామీ.. మహిళలకు బంపర్ ఆఫర్!

Balamrutham: తెలంగాణ ఫుడ్స్ వేదికగా సీఎం రేవంత్ సంచలన హామీ.. మహిళలకు బంపర్ ఆఫర్!
Advertisement

Balamrutham: తెలంగాణ ఫుడ్స్‌లో బాలమృతం కొత్త ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. గర్భిణీలను ఆదుకోవాలని ఆనాడు ఇందిరాగాంధీ మహబూబ్ నగర్ జిల్లాలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారని సీఎం రేవంత్ గుర్తు చేశారు. అంచెలంచెలుగా ఇది ఒక పరిశ్రమగా ఎదిగిందని, దాని ప్రతిఫలంగానే ఇవాళ మనం నూతన బాలామృతం ప్లాంట్‌‌ను ప్రారంభించుకున్నాం అని సీఎం అన్నారు.

మహిళలే యజమానులుగా..

ఇందిరా గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ నుంచి మంత్రి సీతక్క వరకు మహిళలు రాజకీయాల్లో రాణిస్తారని నిరూపించారు. ఇందిరమ్మ ఇండ్లను మహిళ పేరుతోనే ఇస్తున్నామని అన్నారు. 200 యూనిట్ల ఉచిత కరెంటు, పట్టణ ప్రాంతంలో పేదలను ఆదుకునేందుకు ఓక లక్ష ఇండ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని సీఎం తెలిపారు. రాష్ట్రంలో వెయ్యి బస్సులకు మహిళలను యజమానులను చేశామని అన్నారు. వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రాజెక్టును మహిళకు అప్పగించామని, 2034 లోగా కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయడమే నా లక్ష్యం అని, ఆ దిశగా చర్యలు చేపడుతూ ముందుకు వెళుతున్నాం అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

Advertisement

Also read: Prakash Raj: ప్రకాష్ రాజ్‌కు బిగ్ షాక్.. పోలీసులకు బీజేపీ నేత విష్ణు వర్ధన్ రెడ్డి ఫిర్యాదు..!

బ్రేక్ ఫాస్ట్ స్కీం..

ఆడబిడ్డలను ఆర్థికంగా నిలబెట్టడమే కాదు. గర్బిణీ ఆడబిడ్డలకు పౌష్టిక ఆహారం అందించాలనే బాలామృతం కొత్త ప్లాంటు ప్రారంభించుకున్నామని, అభివృద్ధి చెందిన ఆరోగ్య తెలంగాణ ఏర్పాటు చేయాలనే ఈ కార్యక్రమాన్ని చేపట్టామని అన్నారు. పేదల బిడ్డలు ఆకలితో ఉండకూడదనే ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్ ఫాస్ట్ స్కీం ను తీసుకొచ్చాం. విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులకు బ్రేక్ ఫాస్ట్, లంచ్ స్కీం మొదలు పెట్టామని అన్నారు. కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నామని అన్నారు.

రాజకీయాలకి అతీతం..

Advertisement

విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిచడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని సీఎం రేవంత్ అన్నారు. ఇది మేం ఖర్చుగా భావించడంలేదు విద్యార్థుల ఆరోగ్యం, చదువు పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టామని అన్నారు. ఓటు బ్యాంకు పథకాలు కాదు.. విద్యార్థుల భవిష్యత్ బాగు కోసమే మా ప్రభుత్వం పనిచేస్తోందని, రాజకీయాలకి అతీతంగా ఉప్పల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాం అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

Also read: భక్తులకు BSNL గుడ్ న్యూస్.. రూ.196కే ‘యాత్రా సిమ్’.. బెనిఫిట్స్ తెలిస్తే షాకే!

Related News

జగిత్యాల కలెక్టరేట్‌లో పొంగులేటి సమీక్ష.. తహసీల్దార్ సస్పెన్షన్, ఎమ్మార్వోకు షోకాజ్ నోటీసులు!

ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలుడు.. ఇద్దరు కార్మికులు మృతి, యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘటన

రాయదుర్గం భూముల వివాదం.. పిటిషనర్‌కు సుప్రీంకోర్టు బిగ్ షాక్

‘కేటీఆర్ పిల్లలే చెప్పారు’.. బీఆర్ఎస్ గుట్టు విప్పిన సామా రామ్మోహన్!

ఎల్బీనగర్‌లో విచ్చలవిడిగా స్పా సెంటర్లు.. మధు యాష్కీపై కాంగ్రెస్ మహిళా నేత ఫిర్యాదు

ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీని సందర్శించిన సీఎం రేవంత్.. కీలక అంశాలపై చర్చలు!

ఓర్నాయనో.. రాయదుర్గం భూమికి రికార్డు ధర.. ఎకరం ఏకంగా రూ.264 కోట్లు..

కాంగ్రెస్ వివాదంపై మౌనం వీడిన కొండా సురేఖ.. త్వరలో అసలు నిజాలు బయటపెడతా..!

Big Stories

Advertisement
×