Big Stories

Woman Suicide for IPL Betting: పచ్చని కుటుంబంలో చిచ్చు రేపిన IPL.. బెట్టింగ్ లో 1కోటీ నష్టం.. మహిళ సూసైడ్!

IPL Betting Woman suicide
IPL Betting Woman suicide

Woman Suicide due to Lost 1 Crore in IPL 2024 Betting: పచ్చగా ఉండే ఆ జంట కాపురంలో ఐపీఎల్ బెట్టింగ్ చిచ్చురేపింది. కేవలం పెళ్లయిన మూడేళ్లలో ఈ లోకాన్ని విడిచిపెట్టింది ఆ ఇల్లాలు. కేవలం డబ్బు సులువుగా సంపాదించాలన్న ఆశ.. ఆ ఇంజనీరుని నిందితుడ్ని చేసింది. సంచలనం రేపిన ఈ ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది.

- Advertisement -

కర్ణాటకలో చిత్రదుర్గంకి చెందిన దర్శన్ ప్రభుత్వ ఉద్యోగి. కర్ణాటక మైనర్ ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్ ఇంజనీర్. మూడేళ్ల కిందట అంటే 2020 ఏడాది రంజితతో మ్యారేజ్ అయ్యింది. ఈ జంటకు రెండేళ్ల కొడుకు కూడా ఉన్నాడు. ఈ జంటను చూసి చుట్టు పక్కలవారు మురిసిపోయేవారు. జంట అంటే ఇలా ఉండాలని అనుకునేవారు. అంతా సాఫీగా సాగుతున్న జంట జీవితంలో ఒక్కసారి భారీ కుదుపు.

- Advertisement -

పెళ్లన మరుసటి ఏడాది దర్శన్‌కు బెట్టింగుల అలవాటు ఉందని ఆ ఇల్లాలకు తెలిసింది. అక్కడ నుంచి ఇద్దరి మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. ఐపీఎల్ టోర్నీ మొదలుకాగానే దర్శన్ మనసు అటువైపు లాగేసేది. బెట్టింగుల్లో నిమగ్నమయ్యేవాడు. తక్కువ మొత్తంలో వచ్చేది.. ఎక్కువగా డబ్బులు పొగొట్టుకునే వాడు. కొడుకు ఎదుగుతున్నాడు.. భర్త మారుతాడులే అని భావించింది రంజిత. నష్టం వచ్చిన ప్రతీసారి అప్పులుచేసి బెట్టింగులకు దిగేవాడు.

Also Read: RR vs DC IPL 2024 Match Preview: గెలిచేది.. ఢిల్లీ రాజా ? రాజస్తాన్ రాజా?

అప్పులన్నీ కలిసి దాదాపు కోటి రూపాయలకు చేరింది. ఈ క్రమంలో అప్పులవాళ్లు రోజూ ఇంటికి రావడం మొదలుపెట్టారు. ఒక్కోసారి గట్టిగా మాట్లాడేవాళ్లు అప్పు ఇచ్చినవాళ్లు. ఈ టార్చర్ భరించలేకపోయింది రంజిత. ఐపీఎల్ సీజన్ మళ్లీ మొదలైంది. ఈసారైనా తన భర్త మారుతాడని భావించింది. కానీ దర్శన్ మాత్రం కంటిన్యూ చేశారు. చివరకు చిత్రదుర్గలోని తన ఇంట్లో ఉరేసుకుని సూసైడ్ చేసుకుంది.

రంజిత చనిపోయిన విషయం పేరెంట్స్‌కి తెలిసింది. వెంటనే అల్లుడు ఇంటికి వచ్చారు. కూతురు చనిపోయిన ఆవేదనతో కొన్నివిషయాలను బయటపెట్టారు రంజిత ఫాదర్. అప్పులు ఇచ్చినవాళ్ల వేధింపులు తాళలేక తన కూతురు ఆత్మహత్య చేసుకుందని ఆరోపించారు. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో అల్లుడికి రుణాలు ఇచ్చిన 13 మంది పేర్లు ప్రస్తావించాడు. బెట్టింగుల్లో సులువుగా డబ్బులు సంపాదించవచ్చన్న ఆలోచన బలవంతంగా ఈ ఉచ్చులోకి దింపిందని తెలిపారు. అంతేకాదు బ్లాంక్ చెక్కులు షూరిటీగా ఇచ్చి బెట్టింగులు కాసేవాడని మండిపడ్డారు.

Also Read: Big Boss winner Munawar arrest: వివాదాల్లో మునావర్, హుక్కాబార్‌లో ఏం జరిగిందంటే?

స్థానికులు, అంతర్గత సమాచారం ప్రకారం దర్శన్ అప్పులు దాదాపు కోటిన్నర పైమాటే. వాటిలో కొంత మొత్తాన్ని చెల్లించగా, ప్రస్తుతం మరో 84 లక్షలు అప్పు ఉన్నట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు మొదలుపెట్టారు. అంతేకాదు రంజిత రాసిన సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News