E-Paper
Advertisement

నెల్లూరు క్లీన్ స్వీప్.. రెండేళ్లకే రివర్స్ సీన్? బాబు క్లాస్‌తో తమ్ముళ్లలో వణుకు!

నెల్లూరు క్లీన్ స్వీప్.. రెండేళ్లకే రివర్స్ సీన్? బాబు క్లాస్‌తో తమ్ముళ్లలో వణుకు!
Advertisement

Nellore: గత అసెంబ్లీ ఎన్నికల్లో నెల్లూరు జిల్లా ఓటర్లు పదికి పది అసెంబ్లీ స్థానాలను, ఉన్న ఏకైక ఎంపీ స్థానాన్ని టీడీపీకి కట్టబెట్టారు. వైసీపీకి జిల్లాలో అసలు ప్రాతినిధ్యమే లేకుండా చేశారు. అలాంటి జిల్లాలో అధికార పార్టీ పరిస్థితి రెండేళ్లు గడవకుండానే డిఫెన్స్‌మోడ్‌లోకి వెళ్తున్నట్లు కనిపిస్తోంది. జిల్లా కంచుకోటలా మారింది అనుకుంటున్న తరుణంతో, అది రెండేళ్లు గడవకుండానే.. బీటలు వారుతున్నట్లు కనిపిస్తుండటంతో అలెర్ట్ అయిన టీడీపీ అధిష్టానం రంగంలోకి దిగింది. జిల్లాకు చెందిన మంత్రి ఆనం పార్టీపై కూడా ఫోకస్ పెట్టాలని అధినేత సూచించారంట. ఇక చంద్రబాబు జిల్లాలో రెండు సార్లు పర్యటించినప్పుడు ఓ ఎమ్మెల్యేకు, పార్టీ నేతలకు చురకలు అంటించారంట. అసలు జిల్లా టీడీపీలో ఈ పరిస్థితికి కారణమేంటి?

నెల్లూరులో టీడీపీకి బీటలు

గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కి 10 కి పది స్థానాలను అందించిన జిల్లా నెల్లూరు జిల్లా. అటువంటి జిల్లాలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు కూడా గడవక ముందే బీటలు వారుతోందన్న వాదన వినిపిస్తోంది. ఇదే విషయం పార్టీ అధిష్టానానికి కూడా తెలిసిపోయినట్లుంది. దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. స్వయంగా టీడీపీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రంగంలోకి దిగి నాలుగు గోడల మధ్య నేతలను మందలించాల్సింది పోయి, ప్రజాక్షేత్రంలో టిడిపి నేతలకు చురకలు అంటించే వరకు వచ్చింది పరిస్థితి.

మంత్రికి కూడా చంద్రబాబు హెచ్చరికలు

Advertisement

తన శాఖ వ్యవహారాలకే పరిమితమవుతూ పార్టీ విషయంలోసైలెంట్ గా ఉన్న మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పార్టీ బాగోగులు కూడా పట్టించుకోవాలని చంద్రబాబు సూచించారట. పార్టీ పరిస్థితి జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో ఎలా ఉందో పార్టీ అధినేత చంద్రబాబు వరకు వెళ్లింది అనడానికి ఇవి రెండు మచ్చుతునకలే అంటున్నారు. పార్టీ అధినేత పర్యటించని మిగిలిన 8 నియోజకవర్గాల్లో కూడా దాదాపు ఇదే పరిస్థితి ఉందంట. ఈ నేపధ్యంలో దిద్దుబాటు చర్యలకు పార్టీ అధినేత చంద్రబాబు చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది.

నెల్లూరులో టిడిపికి షాక్

ఇప్పటివరకు జిల్లా టీడీపీకి పెద్దదిక్కుగా ఉన్న నెల్లూరు ఎంపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, సీనియర్ మంత్రిగా ఉన్న నారాయణ, జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర పార్టీ బాధ్యతలు చూస్తూ వస్తున్నారు. వీరి ఆధ్వర్యంలో పార్టీ నేతలకు సమచిత స్థానం ఇవ్వడం లేదన్న విమర్శలు గుప్పమంటున్నాయి. దీంతో పలువురు పార్టీ నేతలు వైసీపీ వారికి టచ్‌లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. గత ఎన్నికల ముందు వరకు సామాజిక పరిస్థితుల నేపథ్యంలో నెల్లూరు వైసీపీకి బలమైన జిల్లా .అయితే 2024 ఎన్నికల్లో పదికి పది స్థానాలను తెలుగుదేశం పార్టీ గెలుచుకోవడంతో పరిస్థితి ఒక్కసారి తారు మారైంది. అయితే ఆ పరిస్థితి రెండేళ్లకే గాడి తప్పుతుండటంపై టీడీపీ హైకమాండ్ సీరియస్‌గా ఉందంట.

టిడిపి నేతలపై అసంతృప్తి… వైసీపీ వైపు చూపులు?

Advertisement

జిల్లా పార్టీ పెద్దల వైఖరితోటీడీపీలోని పలువురు నేతలు వైసీపీ వైపు చూస్తున్నారని, భేరసారాలు కూడా జరుపుతున్నారని పార్టీ శ్రేణులు గుసగుసలాడుకుంటున్నాయి. దాన్నిబట్టి టిడిపి ఎమ్మెల్యేలు, ఎంపీలతో తమకు పెద్దగా ఒరిగేదేమీ లేదని, పార్టీ నేతల్లో నమ్మకం సడులుతోందన్న ప్రచారం మొదలైంది. దాన్నిబట్టి పార్టీ మీద, పదవుల్లో ఉన్న నేతల మీద పార్టీ కేడర్ కు విరక్తి కలిగినట్లు అర్థమవుతుందంటున్నారు. అయితే నెల్లూరు జిల్లాలో పార్టీ పరిస్థితిపై చంద్రబాబు నాయుడు ఏప్పటికప్పుడు సమాచారం సేకరిస్తున్నారంట.

నెల్లూరుపై చంద్రబాబు ఫోకస్

చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు.. పరిస్థితి మారకముందే టీడీపీ అధినేత దిద్దుబాటు చర్యలకు దిగారంట. నెల్లూరు జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించి, ఒకే వారంలో జిల్లాలోని సూళ్లూరుపేట, ఉదయగిరి నియోజకవర్గాల్లో పర్యటనలు ప్లాన్ చేసుకున్నారంట. ఆ రెండు ప్రాంతాలను ఎంపిక చేసుకోవడంలో కూడా కారణం ఉందని ఆ పార్టీ నేతలు బాహాటంగా చెప్తున్నారు. సూళ్ళురుపేటలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే విజయశ్రీ మీద తనకు మంచి అభిప్రాయం ఉందని ఆయన మాటల్లో స్పష్టమైంది. ఆమెపై ఎలాంటి ఆరోపణలు లేకున్నా, అక్కడి నేతలు వ్యవహరిస్తున్న తీరు పార్టీకి చెడ్డ పేరు తెస్తుందని భావిస్తున్నట్లు ఆయన మాటల్లో స్పష్టమైంది.

అక్రమాలపై చంద్రబాబు ఫైర్

సూళ్లూరుపేట నుంచి చెన్నై నగరానికి ఇసుక, ఎర్రమట్టి దొంగ రవాణా జరుగుతున్న విషయం తనకు తెలుసని, ఇప్పటితో అక్రమాలు నిలిపివేయండని ఆ పార్టీ నేతలకు చంద్రబాబు గట్టిగానే హెచ్చరికలు జారీ చేశారట. ఈ మాటలు ఎవరికీ తగలాలో వారికి నేరుగా గుండెల్లో గుచ్చుకున్నాయంట. పనిలో పనిగా ఎమ్మెల్యే విజయశ్రీ తండ్రి నెలవల సుబ్రహ్మణ్యానికి కూడా చురకలు అంటించారట. ఇక మీరు రిటైర్డ్ అయితే బాగుంటుందని నవ్వుతూ సలహా ఇచ్చారట.

విజయశ్రీకి చంద్రబాబు క్లాస్

ఎమ్మెల్యే విజయశ్రీ తొలిసారిగా ఎన్నికవ్వడం పాలనపై అంతగా పట్టు లేకపోవడంతో, సీనియర్ నేతలు సిఫారసులు ఆమెకు పెద్ద తలనొప్పిగా మారినట్లు తెలుస్తోంది. ఆ క్రమంలో సూళ్లూరుపేట నియోజకవర్గంలో కార్యకర్తల సమన్వయ లోపం ఉందని.. కార్యకర్తలను కలుపుకుపోవడంలో వైపల్యం చెందుతున్నారని చంద్రబాబు ఎమ్మెల్యేకి చురకలు అంటించారట.. పార్టీ క్యాడర్ దెబ్బతినేలా వ్యవహరిస్తే ఒప్పుకునేది లేదని, ఇప్పటికైనా వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని, వ్యవహార శైలి తీరు మార్చుకొని పనిచేయాలని సూచించారట.

ఉదయగిరిలో చంద్రబాబు ఫైర్

తర్వాత ఉదయగిరి నియోజకవర్గం వింజమూరులో చంద్రబాబు పర్యటించారు. అక్కడకి రాకముందే సీఎం చంద్రబాబు అక్కడి పరిస్థితుల మీద పూర్తి సమాచారం తెలుసుకున్నారట. ఏకంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్‌కు లాఠి లేకుండానే కణుకు దెబ్బలు కొట్టారంట. ఆయనకి పైకి వాతలు కనబడలేదు కానీ, మాటలు మాత్రం బాణాలా గుచ్చుకున్నాయని కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నవారు అంటున్నారు. ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్న రెండు వర్గాలు మధ్య పోరు తలనొప్పిగా మారిందని.. ఎమ్మెల్యే మరో వర్గాన్ని దగ్గరికి తీసుకోకపోవడం, వారిని పట్టించుకోకపోవడంపై చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారట.

వర్గ రాజకీయాలపై అధినేత హెచ్చరిక

నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకోవడంలో లోపం స్పష్టంగా కనిపిస్తోందని.. క్యాడర్లో అసంతృప్తి ఎక్కువగా ఉందని. కొందరికి ప్రాధాన్యమివ్వడం, మరికొందరిపై నిర్లక్ష్యం చేస్తున్నారని.. అవన్నీ సరిదిద్దుకుని వర్గాలను ప్రోత్సహించకుండా ముందుకు సాగాలని అధినేత ఎమ్మెల్యేకి స్పష్టం చేశారంట. అయితే ఎమ్మెల్యే మటుకు ఇంటర్నల్ మీటింగులో జరిగిన ఆ మాటలను కొట్టిపారేస్తున్నారు.

చంద్రబాబు వ్యాఖ్యలపై సురేష్ స్పందన

కార్యకర్తల సమావేశంలో చంద్రబాబు గ్రామ కమిటీలు గురించి మాట్లాడారని, అయితే ఆ గ్రామ కమిటీల రిపోర్టు చంద్రబాబుకు తప్పుగా ఇవ్వడంతో కాస్త మందలించారని సురేష్ చెప్పుకొస్తున్నారు. తనపై గిట్టని వాళ్లు ఈ విధంగా ప్రచారం చేస్తున్నారని స్పష్టం చేస్తున్నారట. కానీ క్యాడర్లో కొంత అసంతృప్తి ఉందనేది గట్టిగా వినిపిస్తున్న టాక్. నియోజకవర్గంలో మరో మూడు నెలలు లోపు వర్గాలు లేకుండా చూడాలని కూడా చంద్రబాబు ఆదేశించారని,. దానికి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కూడా అలాగేనని హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

నెల్లూరుపై అధినేత స్పెషల్ అటెన్షన్

ఇలా నెల్లూరు జిల్లాలోని మిగిలిన నియోజకవర్గాల్లో కూడా పరిస్థితిని చక్కదిద్దడంపై చంద్రబాబు ఫోకస్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ క్రమంలోనే దేవాదాయ శాఖకు పరిమితమైన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని ఉద్దేశించి కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారట. మొత్తం దేవాలయాలు పైనే దృష్టి కాకుండా రాజకీయాలు కూడా చూసుకోవాలని సూచించారంట. . మొత్తం మీద నెల్లూరు జిల్లాలో పరిస్థితి చేయి జారకముందే ప్రక్షాళనకు పార్టీ అధిష్టానం సిద్ధమవడం తెలుగు తమ్ముళ్లలో ఉత్సహాం నింపుతోందంటున్నారు.

Also Read: బొత్సను పక్కన పెట్టిన వైసీపీ.. జగన్ ప్లాన్ ఇదేనా!

Story by: Apparao, Big Tv

Related News

యూట్యూబ్ లో అప్ లోడ్ అయిన మొదటి సినిమా ఏంటో తెలుసా ?

Construction Waste: హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో నివసిస్తున్నారా? అయితే బీ కేర్‌ఫుల్..?

స్మగ్లర్ల ధనదాహానికి 530 ప్రాణాలు బలి.. రోహింగ్యాలు జలసమాధి వెనుక ఉన్న బిగ్ స్కెచ్ ఇదేనా..?

Future City: ముచ్చర్ల పరిసర ప్రాంతాల్లో భూములు కొన్నారా?.. అయితే మీకో షాకింగ్ న్యూస్..!

యువ సంగ్రామ సదస్సు దేనికి సంకేతం?.. నిరుద్యోగుల కోసం కేసీఆర్ చేసిన టాప్ 5 స్టెప్స్ ఇవే!

బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుపై వివాదం.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలపై భారత్ క్లారిటీ!

అంగన్వాడీలకు గుడ్ న్యూస్.. ‘తల్లికి వందనం’ వర్తింపు.. ఆ మూడు రోజుల్లోనే అకౌంట్లలోకి రూ. 13 వేలు!

108 సంఖ్యకు అంత ప్రాముఖ్యత ఎందుకో ఎప్పుడైనా ఆలోచించారా ?

Big Stories

Advertisement
×