BigTV English

MLA Raja Singh: కమలం పార్టీలో పాత, కొత్త నేతల పంచాయితీ.. ఆ ఫల్తూగాళ్లు ఎవరు?

MLA Raja Singh: కమలం పార్టీలో పాత, కొత్త నేతల పంచాయితీ.. ఆ ఫల్తూగాళ్లు ఎవరు?

బీజేపీలో రాజాసింగ్ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి … రాష్ట్ర నాయకత్వాన్ని టార్గెట్‌ చేస్తూ రాజాసింగ్‌ చేసిన వ్యాఖ్యలపై బీజేపీలో హాట్‌ టాపిక్‌గా మారాయి. పార్టీలో పాత, కొత్త నేతల పంచాయితీ తారా స్థాయికి చేరిందనడానికి రాజాసింగ్‌ వ్యాఖ్యలే నిదర్శనమన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది… నాయకత్వాన్ని ప్రశ్నిస్తూ రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎలా స్పందించబోతుంది? రాజాసింగ్‌పై చర్యలు తీసుకుంటారా…లేక ఆయన లేవనెత్తిన అంశాలపై పోస్ట్‌మార్టం చేస్తారా? అనే అంశాలపై పార్టీలో డిబేట్‌ నడుస్తోందట.


కమలం పార్టీలో మళ్లీ రచ్చ మొదలైంది. పాత, కొత్త నేతల పంచాయితీ కాషాయపార్టీ సెగలు పుట్టిస్తోంది. గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్ కమలం పార్టీని ఫుట్ బాల్ ఆడేసుకుంటున్నారు. ఆయన చేసిన ఆరోపణలతో ఎమ్మెల్సీ ఎన్నికల గెలుపును ఏ మాత్రం ఎంజాయ్ చేసుకోనివ్వని పరిస్థితులు రాష్ట్ర బీజేపీలో నెలకొన్నాయి. సొంత పార్టీపై తరచూ రాజాసింగ్ చేస్తున్న వాఖ్యలు సంచలనంగా మారుతున్నాయి. పార్టీలో పాత నేతలను టార్గెట్ చేస్తూ ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇటు పార్టీలో, అటు పొలిటికల్ సర్కిల్లో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి.

రాజాసింగ్ వ్యాఖ్యలతో ఆ పార్టీలో మరో కొత్త చర్చ మొదలైంది. గోషామహల్ ఎమ్మెల్యే టార్గెట్ చేసిన సీనియర్లు ఎవరని కాషాయ శ్రేణులు ఆరాలు మొదలుపెట్టాయి. ఎవరు రాజాసింగ్‌ను టచ్ చేసింది?.. అంతలా రాజాసింగ్ పార్టీపై విరుచుకు పడటానికి కారణం ఏంటనేది అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్‌గా మారింది. రాజాసింగ్ టార్గెట్ చేసిన నేతలు కిషన్ రెడ్డి, బండి సంజయ్, లక్ష్మణ్ లేనా.? వారిని ఉద్దేశించే రాజసింగ్ ఆ వ్యాఖ్యలు చేశారా.? అనే చర్చ పార్టీ కేడర్లో జోరుగా జరుగుతోందంట.


ఇప్పుడు రాష్ట్ర బీజేపీలో కీలకంగా వ్యవహరిస్తుంది రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి అయిన కిషన్ రెడ్డి, మరో కేంద్రమంత్రి బండి సంజయ్, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్‌లే. సీనియర్లుగా ఉన్నదీ కూడా వారే కావడంతో వారిని ఉద్దేశించే రాజసింగ్ .. పాత సామాను అంటూ.. ఘాటైన వ్యాఖ్యలు చేసినట్లు పార్టీ వర్గాలు అనుమానిస్తున్నాయి. అయినా ఈ ముగ్గురు నేతలను టార్గెట్ చేయాల్సిన అవసరం రాజసింగ్ కు ఏమొచ్చింది..? అనే చర్చ సైతం పార్టీ నేతల మధ్య జరుగుతోంది.

గత ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ లక్ష్యానికి గండి పడటానికి ఆ పాత నేతల వ్యవహారమే కారణమా? అన్న చర్చ కూడా నడుస్తోంది. పార్టీ ఫెయిల్యూర్ అవుతుంది పాత నేతల వళ్లేనని రాజాసింగ్ స్పష్టంగా వెల్లడించారు. పార్టీ వర్గాల్లో కూడా అదే అభిప్రాయం ఉందంటున్నారు. ఎన్నికల సమయంలో పార్టీలో నుంచి కీలక నేతలు బయటకు వెళ్ళిపోవడానికి పాత నేతలే కారణమన్న ప్రచారం ఉంది. కొంత మంది ఫల్తూ గాళ్లు వెళ్లిపోతే బీజేపీ విజయం ఖాయమని రాజాసింగ్ మాట్లాడుతున్న వీడియో ఒకటి చక్కర్లు కొడుతోంది. దీంతో ఎవరా ఫల్తూ గాళ్లు అని సోషల్ మీడియాలో పలువురు ప్రశ్నిస్తున్నారు.

అంతేకాదు అధికారంలోకి వచ్చిన పార్టీల ముఖ్యమంత్రులతో బీజేపీ సీనియర్లు రహస్య ఒప్పందాలు చేసుకుంటున్నారని కూడా రాజాసింగ్ ఆరోపించారు. ఆ ఒప్పందాల వెనక ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి అనేది పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. ఇప్పటికే సంస్థాగతంగా కొత్త, పాత నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంది. ఇక తాజాగా రాజాసింగ్ కామెంట్లతో నేతల మధ్య ఇంకాస్త నిప్పులు పోసినట్టు అయ్యింది.

రేపోమాపో స్టేట్ చీఫ్ అనౌన్స్ మెంట్ జరుగుతున్న తరుణంలో రాజాసింగ్ వాఖ్యలు బీజేపీలో దుమారం రేపుతున్నాయి. పదవులు ఏవీ కొత్త నేతలకు రాకుండా పాత నేతలు అడ్డుకుంటున్నారా…అన్న చర్చ నడుస్తోంది. రేపు ప్రకటించబోయే అధ్యక్ష పదవి సైతం కొత్త నేతలకు కాకుండా, పాత నేతలకే కట్టబెడుతున్నారనే టాక్ వినిపిస్తుంది. ఆ క్రమంలో ఔట్‌డేటెడ్ రాజకీయాల వల్లే పార్టీల్లో అంతర్గత కుమ్ములాటలు పెరుగుతున్నాయని పార్టీ వర్గాలు అంటున్నాయి.

Also Read: జగదీశ్‌రెడ్డి వ్యాఖ్యలపై కేసీఆర్ సీరియస్?

కొత్త నేతలకు కీలక పదవులు వస్తే తమ పప్పులుడకవని సీనియర్లు భయపడుతున్నారన్న వాదన వినిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో రాజాసింగ్ కామెంట్స్‌పై పార్టీ ఎలా స్పందింస్తుందనేది సస్పెన్స్‌గా మారింది. గతంలో రాజసింగ్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఈసారి పాత నేతలను టార్గెట్ చేసి ఘాటైన విమర్శలు చేయడంతో డిల్లీ పెద్దలు రాజాసింగ్ పై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారా? లేకపోతే ఆయన లేవనెత్తిన అంశాలపై పోస్ట్‌మార్టం చేస్తారా?అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది.

Tags

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×