Kurnool TDP Corporator Sanjana Murder: కర్నూలులో మళ్లీ రాజకీయ పగలు మొదలయ్యాయి. ఇంతకాలం చాపకింద నీరులా కొనసాగిన రాజకీయ పగలు.. అందరూ చూస్తుండగానే నరికి చంపే స్థాయికి చేరాయి. ఆధిపత్య పోరుతో మరో కీలక నాయకుడు కిరాతకంగా హత్యకు గురయ్యాడు. టీడీపీకి చెందిన మాజీ కార్పొరేటర్ ను ప్రత్యర్థులు కత్తలతో వెంటాడి, వేటాడి నరికి చంపారు. ఈ మర్డర్ తో కర్నూలు నగరం ఉలిక్కిపడింది.
టీడీపీ మాజీ కార్పొరేటర్ సంజన్న దారుణ హత్య
కర్నూలులోని శరీన్ నగర్ కు చెందిన మాజీ కార్పొరేటర్ సంజన్న శుక్రవారం రాత్రి దారుణ హత్యకు గురయ్యాడు. తన కాలనీలోనే సంజన్నను గుర్తు తెలియని ఆగంతకులు కత్తులతో వెంటాడి నరికి చంపారు. అందరూ చూస్తుండగానే కిరాతకంగా హత్య చేశారు. ఈ మర్డర్ తో కర్నూలు నగరంలో ఉద్రిక్తత నెలకొన్నది. ఈ హత్యకు కారణంగా భావిస్తున్న వ్యక్తి వాహనంపై సంజన్న అనుచరులు దాడికి దిగారు. ఈ నేపథ్యంలో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
వైసీపీ కార్పొరేట్ గా కొనసాగున్న సంజన్న కొడుకు
సంజన్న రాజకీయ ప్రస్తానం సీపీఎంతో మొదలయ్యాయి. ఓసారి కార్పొరేటర్ గా పని చేశాడు. ఆ తర్వాత వైసీపీలో చేరాడు. తన కొడుకును కార్పొరేటర్ గా గెలిపించుకున్నారు. 2024 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాటసాని భూపాల్ రెడ్డితో విభేదాలు వచ్చాయి. ఆ తర్వాత సంజన్న టీడీపీలో చేరారు. ప్రస్తుతం బైరెడ్డి వర్గీయుడిగా కొనసాగుతున్నారు. అదే కాలనీలో బైరెడ్డి వర్గీయుడు, రౌడీ షీటర్ వడ్డె రామాంజనేయులు అలియాస్ వడ్డె అంజి ఉంటున్నాడు. అతడితో సంజన్నకు ఆధిపత్య పోరు కొనసాగేది. ఇద్దరి మధ్య కొంత కాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఇరు వర్గాల మధ్య గొడవలు కూడా జరిగాయి. నెమ్మదిగా ఆ గొడవలు మరింత ముదిరాయి. తాజాగా ఆలయానికి వెళ్లి వస్తున్న సంజన్నపై గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడుల చేశారు. సంజన్న తల మీద విచక్షణా రహితంగా కత్తులతో పొడిచారు. తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడిక్కడే కుప్పకూలిపోడు. స్థానికులు వెంటనే అతడిని కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే సంజన్న చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. సంజన్న హత్యతో ఆయన అనుచరులతో పాటు టీడీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాస్పిటల్ దగ్గరికి చేరుకున్నారు.
Read Also: భర్తను చంపేందుకు భార్య స్కెచ్, ఆపై సుపారీ గ్యాంగ్.. చివరకు
వడ్డె అంజి వాహనంపై సంజన్న అనుచరుల దాడి
అటు హత్యకు కారణం వడ్డె అంజి అని భావించిన సంజన్న అనుచరులు కోపంతో ఆయన వాహనంపై రాళ్లతో దాడికి పాల్పడ్డారు. ఈ దాడితో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో పోలీసులు అలెర్ట్ అయ్యారు. ఆ కాలనీలో బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఈ హత్యలో వడ్డె అంజి, అతడి కొడుకులతో పాటు మరికొంత మంది పాల్గొన్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్దారణకు వచ్చారు.
Read Also: ఈ కుల్ఫీ ఐస్‌లు కొన్నా, తిన్నా, అమ్మినా జైలుకే.. ఓర్ని హోలీని ఇలా వాడేస్తున్నారా?