Naa Anveshana : బెట్టింగ్ యాప్స్ (Betting Apps) ప్రమోటర్ల పై పోలీసులు ఉక్కు పాదం మోపుతున్న సంగతి తెలిసి. సోషల్ మీడియా వేదికగా సజ్జనార్ (VC Sajjanar) ఈ విషయంపై ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తున్నారు. అలాగే “బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే ఇన్ఫ్లూయెన్సర్లను అన్ ఫాలో చేయండి, వారి ఎకౌంట్లను రిపోర్ట్ కొట్టండి” అని రిక్వెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ‘నా అన్వేషణ’ (Naa Anveshana) అనే యూట్యూబ్ ఛానల్ తో పాపులర్ అయిన అన్వేష్ సోషల్ మీడియా వేదికగా బెట్టింగ్ యాప్ తిమింగలం గురించి సంచలన విషయాలను బయట పెట్టారు. అంతేకాదు అతను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి ఎన్ని కోట్లు సంపాదించాడో కూడా వెల్లడించారు.
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ తో కోట్లకు కోట్ల సంపాదన
‘నా అన్వేషణ’ అనే యూట్యూబ్ ఛానల్ తో ప్రపంచ యాత్రికుడిగా ఫేమస్ అయిన తెలుగు వ్యక్తి అన్వేష్. తాజాగా అతను సోషల్ మీడియా వేదికగా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వాళ్ల గురించి షాకింగ్ విషయాలను వెల్లడించారు. అన్వేష్ మాట్లాడుతూ “బెట్టింగ్ యాప్స్ లో అతి పెద్ద తిమింగలం ఈ ఇమ్రాన్. పరేషాన్ బాయ్స్ అనే సోషల్ మీడియా ఖాతా ఉంది ఇతనికి. దగ్గర దగ్గరగా 25 కోట్ల రూపాయలను బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసి సంపాదించాడు. 6 స్పోర్ట్స్ బైక్ లు, నాలుగు కార్లు, 3 హోటల్స్ ఉన్నాయతనికి. అతి పెద్ద తిమింగలం అయిన ఈ అబ్బాయి పాకిస్తాన్ ముస్లిం. ఇప్పుడు అతను ఆ డబ్బంతా పట్టుకొని దుబాయ్ పారిపోవడానికి ట్రై చేస్తున్నాడు” అంటూ షాకింగ్ విషయాలను వెల్లడించారు. మరి పోలీసులు అతనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు అన్నది ఆసక్తికరంగా మారింది.
బెట్టింగ్ యాప్స్ జోలికెళ్తే జైలుకే
ఇక ఇప్పటికే పోలీసులు ఇలా సోషల్ మీడియా ద్వారా బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్న వారికి చుక్కలు చూపిస్తున్నారు. భయ్యా సన్నీ యాదవ్, లోకల్ బాయ్ నాని వంటి వారిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. సజ్జనార్ చొరవతో పోలీసులు బెట్టింగ్ యాప్ లపై సీరియస్ గా దృష్టి సారించారు. ఈ నేపథ్యంలోనే తెలుగు రాష్ట్రాల్లోని ఇన్ఫ్లూయన్సర్లు తమ సోషల్ మీడియా ఖాతాల్లో ఉన్న బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ వీడియోలను డిలీట్ చేస్తున్నారు. ఐపీఎల్ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో బెట్టింగులపై సీరియస్ గా దృష్టి పెట్టారు అధికారులు. ఇక సీనియర్ ఐపీఎస్ అధికారి సజ్జనార్ సోషల్ మీడియా వేదికగా బెట్టింగ్ యాప్స్ కు సంబంధించి వార్నింగ్ లు జారీ చేస్తున్నారు. అంతేకాకుండా ఎవరైనా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నట్టు తెలిస్తే వెంటనే కంప్లైంట్ చేయాలని కోరుతున్నారు. అలాగే హర్ష సాయి లాంటి వ్యక్తులు ఈ బెట్టింగ్ యాప్ లను ఎలాంటి పశ్చాత్తాపం లేకుండా ప్రమోట్ చేస్తున్నారని, ఎంతోమంది అమాయకులు ప్రాణాలు తీసుకోవడానికి కారణం అవుతున్నారని సజ్జనార్ ఫైర్ అయ్యారు. అలాంటి వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలని పోలీసులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు.
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">