Anaswara Rajan:అనస్వర రాజన్ (Anaswara Rajan).. ప్రధానంగా మలయాళ చిత్రాలలో నటిస్తూ నటిగా మంచి పేరు సొంతం చేసుకున్న ఈమె..’ ఉదాహరణం సుజాత’ అనే చిత్రంతో వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత సూపర్ శరణ్య సినిమాతో కమర్షియల్ సక్సెస్ అందుకున్న ఈమె.. తొలిసారి తెలుగులో శ్రీకాంత్ తనయుడు రోషన్ మేక హీరోగా వచ్చిన ఛాంపియన్ సినిమాలో హీరోయిన్గా నటించి తెలుగు తెరకు పరిచయమైంది. మొదటి సినిమాతో పరవాలేదు అనిపించుకున్న ఈమె.. ఇట్లు అర్జున అనే సినిమాలో కూడా నటించింది. మరొకవైపు 7/G బృందావన్ కాలనీ 2 లో నటిస్తోంది. తెలుగు, తమిళ్ భాషల్లో విడుదల కాబోతున్న ఈ సినిమా షూటింగు వేగంగా జరుపుకుంటోంది.
ఇదిలా ఉండగా మరొకవైపు ప్రముఖ డైరెక్టర్ బాబి కొల్లి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటిస్తున్న కాకా సినిమాలో అనస్వర హీరో కూతురుగా నటిస్తున్న విషయం తెలిసిందే. పైగా ఈమె పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా మేకర్స్ విడుదల చేశారు. అలా చిరంజీవి కూతురుగా ఒక వైపు నటిస్తూనే.. ఇప్పుడు మరో బంపర్ ఆఫర్ అందుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈ మేరకు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. తాజాగా ఇటీవల ఇరుముడి సినిమాతో ఘనవిజయం అందుకొని, జెట్ స్పీడ్ లో సినిమాలు ప్రకటిస్తున్నారు రవితేజ. అందులో భాగంగానే డైరెక్టర్ వివేక్ ఆత్రేయ తో కలిసి సినిమా ప్రకటించారు.
ఇందులో ఇప్పుడు అనవసర భాగమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు అందుతున్న సమాచారం ప్రకారం రవితేజ సరసన గ్లామర్ బ్యూటీ ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటించనుండగా.. మలయాళం లో మంచి గుర్తింపు తెచ్చుకున్న వర్సటైల్ నటి అనస్వర రాజన్ అత్యంత కీలకమైన పాత్రలో కనిపించనున్నారు. వీరిద్దరి ఎంట్రీ తో ఇప్పుడు ఈ ప్రాజెక్టు పై ఆసక్తి మరింత పెరిగింది.
ALSO READ:బుల్లితెరపై సందడి చేసిన స్వప్న దత్.. ఆ క్రేజీ మూమెంట్ చూసారా?
బ్రిడ్జ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమా కోసం మేకర్స్ ఇప్పటికే ప్రత్యేక ఫోటోషూట్ కూడా నిర్వహించినట్లు సమాచారం . అంతేకాదు ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం సీనియర్ నటుడు జేడీ చక్రవర్తిని కూడా దాదాపు ఫైనల్ చేసే పనిలో ఉన్నారట. రవితేజ, జే.డీ. చక్రవర్తిల మధ్య వచ్చే ముఖాముఖి సన్నివేశాలు థియేటర్లలో నెవర్ బిఫోర్ ఎక్స్పీరియన్స్ ను అందిస్తాయని, ఇది నిజం కావాలని అభిమానులు కూడా కోరుకుంటున్నారు. దసరా పండుగ సందర్భంగా ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించి, త్వరలోనే పూర్తి సాంకేతిక నిపుణుల వివరాలు, నటీనటుల వివరాలను ప్రకటించనున్నట్లు సమాచారం. అంతేకాదు ఈ చిత్రానికి తులాభారం అనే టైటిల్ ని కూడా పరిశీలిస్తున్నారట ఏది ఏమైనా అనస్వర రాజన్ మాత్రం ఇలా వరుస పెట్టి టాలీవుడ్ స్టార్ హీరోల చిత్రాలలో అవకాశాలు అందుకోవడం నిజంగా ప్రశంసనీయమంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు మరి ఈ గోల్డెన్ ఆఫర్ ఈమెకు నిజమవ్వాలని కోరుకుంటున్నారు.