E-Paper
Advertisement

Municipal elections 2026: త్రిముఖ పోరులో ‘హస్తం’ హుందాతనం వెనుక.. అసలు మతలబు ఇదేనా..

Municipal elections 2026: త్రిముఖ పోరులో ‘హస్తం’ హుందాతనం వెనుక.. అసలు మతలబు ఇదేనా..
Advertisement

Municipal elections 2026: ఏ రాజకీయ  పార్టీ అయినా ప్రత్యర్ది పార్టీని బలహీన పరిచి లబ్ది పొందాలనుకుంటుంది. మరీ ముఖ్యంగా ఎన్నికల సమయంలో అటువంటి స్ట్రాటజీలు మరింత బలంగా అమలు చేయాలని చూస్తుంటాయి. కానీ రాష్ట్ర కాంగ్రెస్ మాత్రం మున్సిపల్ ఎన్నికల్లో ప్రత్యర్థి బలం పెంచి లబ్ది పొందాలని చూస్తోందంట. ఎన్నికల తరుణంలో కాంగ్రెస్ అమలు చేస్తున్న ఈ కొత్త వ్యూహం అత్యంత ఆసక్తికరంగా మారింది. అసలు హస్తం పార్టీ ఆ వ్యూహాన్ని అమలు చేయడం వెనక ఉన్న మతలబు ఏంటి?… ఆ గేమ్‌ప్లాన్‌తో కాంగ్రెస్ అనుకున్న ఫలితాలు సాధిస్తుందా?

మున్సిపల్ ఎన్నికల హస్తం పార్టీ సరికొత్త వ్యూహం

మున్సిపల్ ఎన్నికల వేల హస్తం పార్టీ సరికొత్త వ్యూహం తో ముందుకు వెళ్లి లబ్ది పొందడానికి యాక్షన్ ప్లాన్ అమలు చేస్తోంది..ఏ రాజకీయ పార్టీ అయినా మాములుగా అయితే ప్రత్యర్దిని బలహీన పరచి గెలవాలనుకుంటుంది… కానీ అధికార కాంగ్రెస్  మాత్రం ప్లాన్ మార్చింది … ప్రత్యర్థి బలం పెంచి గెలవాలనుకుంటోందంట… ఇది కొంత విచిత్రంగా ఉన్నా తాము చేసేది కరెక్టే అంటున్నారు హస్తం పార్టీ నేతలు.

కారుకు బలం చేకూర్చడమే హస్తం మార్గమా?

Advertisement

ప్రస్తుతం జరిగే మున్సిపల్ ఎన్నికలు పట్టణ ప్రాంతంలోనే జరగనున్నాయి ..తెలంగాణలో పట్టణ ప్రాంతాల్లో ప్రధాని మోడీ ప్రభావం, హిందుత్వ అజెండాలతో బీజేపీ పట్టుపెంచుకునే ప్రయత్నం చేస్తోంది. నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ వంటి జిల్లాల్లో లోకసభ ఎన్నికల్లో ఆ పార్టీ ఓటు షేర్ గణనీయంగా పెరిగింది.. ఆ క్రమంలో చాలా చోట్ల అధికార కాంగ్రెస్ కు బీజేపీ సవాల్ విసురుతోంది.. ఈ నేపథ్యంలో బీజేపీని కట్టిడి చేయాలంటే బీఆర్ఎస్‌కు బలం చేకూర్చడం ఒక్కటే మార్గమని కాంగ్రెస్ భావిస్తోందట.. తమ ప్రత్యర్ధులు ఇద్దరు అంతోఇంతో బలంగా ఉంటే ఓట్ల చీలిక జరుగుతుందని, ఫైనల్ గా అది తమకు లాభం చేకూర్చుతుందని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు అంచనా వేసుకుంటున్నారంట.

సిట్ విచారణ వెనుక కాంగ్రెస్ మున్సిపల్ లెక్కలు!

అందుకు సంబంధించి సిట్ విచారణను అస్త్రం గా చేసుకుంది టీ కాంగ్రెస్..రాజకీయ కుట్ర గా బీఆర్ఎస్ ఆరోపిస్తుంటే , తమకు ఏం సంబంధం లేదని కాంగ్రెస్ వాదిస్తుంది. ఏది ఏమైనా గత కొద్దిరోజులుగా సిట్ విచారణ సెంట్రిక్ గా కాంగ్రెస్ – బీఆర్ఎస్‌ల మధ్యే పొలిటికల్ వార్ నడుస్తోంది… కేసీఆర్ వంటి బీఆర్ఎస్ ముఖ్యనేతలను సిట్ అధికారులు విచారించడం తమకు సానుభూతిపరంగా ప్లస్ అవుతుందని గులాబీ పార్టీ లెక్కలు వేసుకుంటోంది. కాంగ్రెస్ కు కావాల్సింది కూడా ఇదే. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి బీజేపీ బలం తగ్గితే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు లబ్ది చేకూరుతుందన్నది ఆ పార్టీ నేతల ప్లాన్‌‌ అంటున్నారు.

సిట్ విచారణే అస్త్రం.. కక్షసాధింపే నినాదం

Advertisement

అటు బిఆర్ఎస్ కూడా మున్సిపల్ ఎన్నికలను సీరియస్‌గా తీసుకుంది. పార్టీ అధిష్టానం ముఖ్యనేతలను సిట్ విచారించడాన్ని, ప్రభుత్వ కక్షసాధింపు చర్యగా ఫోకస్ చేస్తూ దాన్ని గట్టిగా వాడుకోవాలని చూస్తోంది. ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ గుర్తులతో జరుగుతున్న ఎన్నికలు కావడంతో.. ఈ అవకాశాన్ని సమర్దవంతంగా వాడుకోవాలని డిసైడ్ అయింది . కాంగ్రెస్ వ్యూహాన్ని గమనించిన బీఆర్ఎస్… నేతల చేరికలు ప్రోత్సహిస్తూ కాంగ్రెస్  గేమ్‌ప్లాన్‌కు చెక్ పెట్టి  ఓడించాలని వ్యూహం రచిస్తుందట…మొత్తంగా హస్తం పార్టీ రివర్స్ వ్యూహం ఆ పార్టీ ని గట్టెక్కిస్తుందో లేక నిండా ముంచుతుందో చూడాలి మరి.

Also Read: తెలంగాణ బీజేపీలో ‘జన’గణం.. పవన్ ఫ్యాక్టర్ వెనుక అసలు కథ ఇదేనా?

Related News

కృష్ణా-గోదావరి ప్రాజెక్టుల్లో డేంజర్ బెల్స్.. నిజాంసాగర్‌లో పడిపోయిన నీటి నిల్వలు!

ఇకపై నో సైలెంట్.. దూకుడు పెంచడమే.. గులాబీ పార్టీ నెక్స్ట్ వ్యూహం ఇదే?

ఎల్‌నినోతో జాడలేని ఎవుసం పనులు.. ! అనూహ్యంగా పెరిగిన కూలీల హాజరు! గత ఏడాది 25వేల మంది.. ఇప్పుడు 2.54లక్షల మందికి ‘ఉపాధి’!

హైదరాబాద్‌లో ఫ్లాట్ కొంటున్నారా.. అయితే మీరు కోనే ఆస్తి సేఫేనా.. ఇలా చెక్ చేయండి?

వరి లేకుండానే సిరుల సాగు! అది ఆదర్శ వ్యవసాయ గ్రామం! సంప్రదాయ పంటలుండవు.. అంతా లాభదాయక సాగే..!

ఉమ్మడి ఏపీలో ఐదు సార్లు.. తెలంగాణ ఏర్పడిన తరువాత మూడోసారి! ప్రతిసారీ వ్యవసాయ రంగం కుదేలు! ఈసారి తెలంగాణలో 10 లక్షల ఎకరాల్లో వరిసాగుపై ప్రభావం!

కరువును జయించేందుకు సర్కార్‌ సమగ్ర కార్యాచరణ! రైతులు, ప్రజలు, మీడియాకు రేవంత్‌ ప్రత్యేక విజ్ఞప్తి..! సాగు, తాగు, విద్యుత్‌ అంశాలపై అత్యంత ప్రయార్టీ..!

లక్షల్లో జీతాలు మెక్కుతూ.. బిజినెస్‌మెన్‌ల అవతారమెత్తుతూ! దాదాపు 20వేల మంది ఇదే దారిలో..! విద్యార్థుల చదవులు అంధకారంలో..!

Big Stories

Advertisement
×