Khairatabad By-Election: ఓవైపు పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద ఎమ్మెల్యే పదవిని కోల్పోయిన దానం నాగేందర్ మరోవైపు ఆయన 2023 లో ఎమ్మెల్యే గా గెలిచిన ఎన్నికే చెల్లదంటూ న్యాయ పోరాటం చేస్తున్న కాంగ్రెస్ నాయకురాలు పి విజయారెడ్డి. ఇంకోవైపు ఖైరతాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా దానం నాగేందర్ పేరును ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి. ఒకే నియోజక వర్గం ఒకే నాయకుడు కానీ రెండు వేరు వేరు న్యాయ పోరాటాలు ఇప్పుడు ఖైరతాబాద్ రాజకీయాల్లో ఇదే హాట్ టాపిక్. అసలు దానం నాగేందర్ ఎమ్మెల్యే పదవిని ఎందుకు కోల్పోయారు? హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టు సమర్ధించిన తర్వాత ఖైరతాబాద్‌లో ఉప ఎన్నిక అనివార్యమైందా? 2023 ఎన్నికల్లో దానం అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చారంటూ విజయారెడ్డి వేసిన పిటిషన్ లో ఏముంది? ఆ కేసులో ఆమెకు అనుకూలంగా తీర్పు వస్తే ఏం జరుగుతుంది? మరోవైపు దానాన్నే మళ్ళీ అభ్యర్థిగా ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ వ్యూహం ఏంటి? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలుసుకుందాం.
దానం నాగేందర్ పదవికి ఎసరు ఎక్కడ వచ్చింది..?
దానం నాగేందర్ ఎమ్మెల్యే పదవికి అసలు ఎసరు ఎక్కడ వచ్చింది అంటే ముందుగా 2023 అసెంబ్లీ ఎన్నికల దగ్గరికి వెళ్దాం. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ నియోజక వర్గంలో బిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన దానం నాగేందర్ విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన పి విజయారెడ్డి ఓటం చెందారు. దాదాపు 22వ000 ఓట్ల మెజారిటీతో దానం నాగేందర్ ఎమ్మెల్యే గా ఎన్నికయ్యారు. కానీ ఎన్నికైన కొద్ది నెలలకే రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. 2024 మార్చి 17వ తేదీన దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అప్పటికే బిఆర్ఎస్ ఎమ్మెల్యే గా ఉన్న ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయలేదు. అంతేకాదు 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా సికింద్రాబాద్ ఎంపి స్థానానికి పోటీ చేశారు. ఇక్కడే అసలు వివాదం మొదలైంది. ఒక పార్టీ బి ఫామ్ పై ఎమ్మెల్యే గా గెలిచి ఆ పార్టీకి రాజీనామా చేయకుండా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా మరో పార్టీ బి ఫామ్ పై ఎంపీ గా పోటీ చేయడం. ఇదంతా కూడా పార్టీ ఫిరాయింపుల నిరోధ చట్టం పరిధిలోకి వస్తుందా లేదా అన్నది న్యాయస్థానాల ముందుకు వెళ్ళింది. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ దానం అనర్హత పిటిషన్‌ను తిరస్కరించడంతో బిజెపి ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి బిఆర్ఎస్
ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.
ఎమ్మెల్యే పదవికి అనర్హుడిగా హైకోర్టు కీలక తీర్పు..
2026 సెప్టెంబర్ 18న తెలంగాణ హైకోర్టు కీలక తీర్పిచ్చింది. స్పీకర్ నిర్ణయాన్ని పక్కన పెట్టి దానం నాగేందర్‌ను ఎమ్మెల్యే పదవికి అనర్హుడిగా ప్రకటించింది. 2024 ఏప్రిల్ 23 నుంచి అనర్హత అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది కోర్టు. దానం సుప్రీం కోర్టును ఆశ్రయించిన అక్కడ కూడా ఊరట దక్కలేదు. 2026 సెప్టెంబర్ 24వ తేదీన సుప్రీం కోర్టు ఆయన పిటిషన్‌ను కొట్టేసింది. దీంతో ఖైరతాబాద్ ఎమ్మెల్య స్థానం ఖాళీ అయినట్లు 2అసెంబ్లీ గెడ్జెట్ నోటిఫికేషన్ జారీ చేసింది. సెప్టెంబర్ 26వ తేదీన గెజిట్ లో ఈ విషయం ప్రచురితమైంది. అంటే దానం నాగేందర్ ప్రజా ప్రాతినిధ్యం చట్టం కింద ఎమ్మెల్యే పదవి కోల్పోవడంతో ఖైరతాబాద్ లో ఉప ఎన్నికకు మార్గం ఏర్పడింది. కానీ కథ ఇక్కడితో ముగియలేదు. ఇక్కడే విజయారెడ్డి ఎంటర్ అయ్యారు.
అసలు విజయారెడ్డి పిటిషన్ లో ఏముంది.?
అసలు విజయారెడ్డి పిటిషన్ లో ఏముంది అంటే ఖైరతాబాద్ ఉప ఎన్నిక కథలో అసలైన ట్విస్ట్ అంతా కూడా ఇక్కడే ఉంది. 2023 ఎన్నికల్లో దానం నాగేందర్ చేతిలో ఓటమి చెందిన కాంగ్రెస్ నాయకురాలు పి విజయారెడ్డి ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత 2024 జనవరిలోనే తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఏమని అంటే దానం నాగేంద ఎన్నికల సమయంలో సమర్పించిన అఫిడవిట్ లో తన భార్య తనపై ఆధారపడ్డ కుటుంబ సభ్యులకు సంబంధించిన ఆస్తుల వివరాలను పూర్తిగా వెల్లడించలేదనేది ఆమె ప్రధాన ఆరోపణ అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు తమ ఆస్తులు అప్పులు ఆదాయ వనరులు కుటుంబ సభ్యులకు సంబంధించిన ఆస్తులు ఆ వివరాలన్నిటిని కూడా అఫిడవిట్లో వెల్లడించాలి. ఇది కేవలం ఒక ఫార్మాలిటీ కాదు ఓటరు తనకు ఓటు వేయబోతున్న అభ్యర్థి ఆర్థిక నేపథ్యాన్ని తెలుసుకునేందుకు రాజ్యాంగబద్ధమైన సమాచార హక్కులో భాగం.
హైకోర్టును ఆశ్రయించిన విజయారెడ్డి..
అయితే దానం నాగేందర్ అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చారన్నది విజయ రెడ్డి చేసిన ప్రధాన ఆరోపణ మాత్రమే. అది ఇంకా న్యాయస్థానంలో నిరూపితం కావలసి ఉంది. ఈ ఆరోపణల ఆధారంగా దానం నాగేందర్ ఎన్నిక చెల్లనిధిగా ప్రకటించి తనను ఎన్నికైన అభ్యర్థిగా గుర్తించాలని విజయారెడ్డి హైకోర్టును కోరారు. ఇక్కడ ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 లోని సెక్షన్ 100, సెక్షన్ 98, సెక్షన్ 101 కీలకంగా మారుతున్నాయి. సెక్షన్ 100 ప్రకారం ఎన్నికను చెల్లనిధిగా ప్రకటించడానికి చట్టంలో నిర్దేశించిన కారణాలు ఉండాలి. సెక్షన్ 101 ప్రకారం కొన్ని నిర్దిష్ట పరిస్థితుల్లో రెండవ స్థానంలో ఉన్న అభ్యర్థిని కూడా విజేతగా ప్రకటించే అవకాశం ఉంటుంది. అంటే విజయారెడ్డి పిటిషన్ లో రెండు అభ్యర్థనలు ఉన్నాయి. ఒకటి దానం ఎన్నికను రద్దు చేయడం. రెండవది తనను విజేతగా ప్రకటించడం. మరి ఈ రెండు ఒకటేనా అంటే కాదు. కేవలం దానం ఎన్నిక చెల్లదని ప్రకటించినంత మాత్రాన విజయారెడ్డికి ఎమ్మెల్యే పదవి వచ్చేయదు. ఆమెను విజేతగా ప్రకటించడానికి కూడా చట్టపరమైన ప్రమాణాలు నెరవేరాలి. అంటే మరి ఈ ఉప ఎన్నికకు ఎన్నికల సంఘమే బ్రేక్ వేసిందా అంటే న్యాయపరమైన చిక్కుల వల్ల వచ్చిన పరిస్థితి ఇది అనేది సుస్పష్టం.
ఉప ఎన్నికలు ఎలా నిర్వహిస్తారు..? విజయారెడ్డి
దానం నాగేందర్ అనర్హతతో ఖైరతాబాద్ స్థానం అయితే ఖాళీ అయింది. దీంతో ఉప ఎన్నిక నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సిద్ధమవుతుందని అంతా భావించారు. కానీ విజయారెడ్డి మరోసారి కోర్టును ఆశ్రయించారు. తన 2023 ఎన్నికల పిటిషన్ ఇంకా పెండింగ్ లో ఉండగా ఖైరతాబాద్ ను ఖాళీస్థానంగా పరిగణించి ఉప ఎన్నిక ఎలా నిర్వహిస్తారు.. ఇదెలా సాధ్యమని ప్రశ్నించారు. అక్టోబర్ ఒకటవ తేదీన ఈ అంశంపై విచారణ సందర్భంగా ఎన్నికల సంఘం హైకోర్టుకు కీలక హామి ఇచ్చింది. విజయారెడ్డి ఎన్నికల పిటిషన్ తుది పరిష్కారం అయ్యేవరకు ఖైరతాబాద్ ఉప ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేయబోమని తెలిపింది. దీనిపై అక్టోబర్ 6న అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు కూడా ఆదేశించింది. అక్టోబర్ఆరవ తేదీన ఎన్నికల సంఘం తన అఫిడవిట్ కూడా దాఖలు చేసింది. అంటే ఇప్పుడు ఖైరతాబాద్ ఉప ఎన్నికకు సంబంధించి ఎన్నికల సంఘం ముందుకు వెళ్ళడం లేదు అన్నమాట.
దానంకు కాంగ్రెస్ పార్టీ మళ్లీ అవకాశం ఇస్తుందా..?
ముందుగా 2023 ఎన్నికల పిటిషన్ పై హైకోర్టు నిర్ణయం వచ్చిన తర్వాతే ఆ ప్రాసెస్ జరుగుతుంది. మరి ఇక్కడే ఇంకొక ఆసక్తికరమైన అంశం ఉంది. దీన్ని బట్టి మనక ఏమ అర్థంవుతుంది అంటే దానం నాగేందర్ అనర్హతతో ఖైరతాబాద్ స్థానం ఖాళీ అయినప్పటికీ విజయారెడ్డి ఎన్నికల పిటిషన్ పెండింగ్ లో ఉండడం వల్ల ఆ స్థానాన్ని వెంటనే ఉపఎన్నికకు తీసుకెళ్లే పరిస్థితి లేదని కానీ ఇంతటి న్యాయపరమైన పరిణామాలు జరుగుతున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా మరో నిర్ణయం తీసుకుంది. ఖైరతాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి ఎవరనే దానిపై చాలా కాలంగా చర్చ జరుగుతుంది. 2023 లో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన విజయారెడ్డి పేరు కూడా సహజంగానే వినిపించింది. మరో వైపు దానం నాగేందర్ కు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అవకాశం ఇస్తుందా అన్న ప్రశ్న ఇన్నాలు ఉత్పన్నమైంది.
Also Read: గిరిజన మహిళపై వేటేస్తే.. మరి మీ సంగతేంటి? శ్రీధర్ బాబు టార్గెట్‌గా ఎంపీ వంశీకృష్ణ సెటైర్లు!
దానంను ఎమ్మెల్యే అభ్యర్ధిగా ప్రకటించిన రేవంత్..
ఈ ఊహాగానాలకు అక్టోబర్ 30వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెరదించారు. దానం నాగేందర్‌ను మళ్ళీ ఖైరతాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు రేవంత్ రెడ్డి. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన రేవంత్ ఖైరతాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా దానం నాగేందర్‌ను బరిలోకి దింపుతామని ప్రకటించారు. దీంతో కాంగ్రెస్ రాజకీయంగా దానం వెంటే నిలబడాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టమైంది. కానీ ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. 2023లో కాంగ్రెస్ అభ్యర్థిగా దానం నాగేందర్ పై పోటీ చేసి ఓడిపోయిన విజయారెడ్డి ఇప్పుడు ఆ దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడంతో అదే దానం నాగేందర్‌తో కాంగ్రెస్ పార్టీలో ఉండే 2023 లో దానం నాగేందర్ ఎన్నిక చెల్లదంటూ కోర్టులో పోరాడుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ అధిష్టానం మాత్రం దానం నాగేందర్‌నే తమ అభ్యర్థిగా ప్రకటిస్తుంది. ఒకవేళ విజయారెడ్డి పిటిషన్ లో ఆమెకు అనుకూలంగా తీర్పు వస్తే కాంగ్రెస్ పార్టీ తన నిర్ణయాన్ని మార్చుకుంటుందా లేక దానం అభ్యర్థిత్వానికే కట్టుబడి ఉంటుందా? ఇవి ఇప్పుడు రాజకీయంగా ఆసక్తికరమైన ప్రశ్నలు.
ఖైరతాబాద్‌పై చట్టం చెప్పే తీర్పు ఏంటి?
అయితే ఓవరాల్ గా చూస్తే ఖైరతాబాద్ భవిష్యత్తును నిర్ణయించబోయే మూడు పరిణామాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకటి విజయారెడ్డి వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేస్తే దానం నాగేందర్ 2023 ఎన్నిక చెల్లుబాటుపై ఆమె చేసిన సవాల్‌కు న్యాయపరంగా ముగింపు లభిస్తుంది. ఆ తర్వాత ఖాళీ అయిన స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించేందుకు మార్గం ఏర్పడుతుంది. రెండు దానం ఎన్నికను హైకోర్టు చెల్లనిధిగా ప్రకటిస్తే 2023 ఎన్నికల ఫలితంపై కొత్త న్యాయపరమైన పరిణామం వస్తుంది. అయితే విజయారెడ్డిని విజేతగా ప్రకటించాలంటే సెక్షన్ 101 లోని శరతులను కూడా కోర్టు పరిశీలించాలి. మూడు విజయ రెడ్డిని విజేతగా ప్రకటిస్తే ఆమెకు ఎమ్మెల్యే గా కొనసాగే అవకాశం ఏర్పడుతుంది. అలాంటి సందర్భంలో ఖైరతాబాద్ ఉప ఎన్నిక అవసరం ఉండకపోవచ్చు. అయితే ఆ తీర్పు అపీల్ పరిస్థితి అసెంబ్లీ పదవి కాలం వంటి అంశాలను కూడా ప్రభావితం చేస్తుంది. ప్రస్తుతానికయితే విజయారెడ్డి ఎన్నికల పిటిషన్ పై తుది తీర్పు వెలువడలేదు. ఓవైపు పార్టీ ఫిరాయింపుల కేసులో న్యాయ పోరాటం ముగిసింది. మరోవైపు 2023 ఎన్నికల ఆఫీడవిట్పై మరో న్యాయ పోరాటం కొనసాగుతుంది. రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించవచ్చు. కానీ ప్రజాస్వామ్యంలో అభ్యర్థుల భవిష్యత్తును నిర్ణయించేది చివరకు చట్టం న్యాయస్థానాలే. ఖైరతాబాద్‌లో మళ్ళీ ఎన్నికలు జరుగుతాయా? లేక 2023 ఎన్నికల ఫలితానికే న్యాయస్థానం మరో రూపం ఇస్తుందా? ఈ ఉత్కంటకు తెరపడాలంటే ఇప్పుడు అందరి చూపు తెలంగాణ హైకోర్టు వైపే ఉంది.