China Components: మేకిన్ ఇండియా పేరిట మేడిన్ చైనా వస్తువులనే మనమింకా వాడుతున్నామా? చైనా వస్తువులను అసెంబుల్ చేసి మేకిన్ ఇండియా స్టాంపులు వేయడమే పనా? ఇంతోటి దానికి ఇంత పెద్ద ఎత్తున క్యాంపెయినింగ్ ఎందుకు? పైకి ఏం చెబుతున్నారు? లోపల జరుగుతున్నదేంటి? గ్రౌండ్ లెవల్లో అసలేం జరుగుతోంది?
స్టాంప్ తయారీకి మాత్రమే మేకిన్ ఇండియా పరిమితం?
ఇదిగో ఈ స్మార్ట్ టీవీ యూనిట్ ని చూశారా? ఇక్కడ టెక్నీషియన్లు టీవీలను ఎలా సెట్ చేస్తున్నారో గమనించారా? ఇదంతా మేకిన్ ఇండియాలో భాగమే. ఇక్కడ జరుగుతోన్న అసలు బాగోతం ఏంటంటే మేకిన్ ఇండియా కేవలం స్టాంప్ తయారీ వరకు మాత్రమే పరిమితం. మిగిలినదంతా మేడిన్ చైనానే. దీంతో షాకవడం సామాన్యుల వంతు అవుతోంది. చైనా స్పేర్ పార్ట్స్ దిగుమతి చేసుకుని వాటిని అసెంబుల్ చేసుకోవడమే మేకిన్ ఇండియా. ఇదేంటి? మరి దానికంటూ ఇంత పెద్ద ఎత్తున ప్రచారం.. ఆత్మనిర్భర్ భారత్ అంటూ ఢంకా బజాయించడం.. ఏంటిదంతా.. మరిది తప్పు కాదా? ఈ ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించడం కాదా? ఇదేనా? మేకిన్ ఇండియా అంటే.. మరిలా చేస్తే దిగుమతులు ఎప్పుడు తక్కువ కావాలె.. ఎగుమతులు ఏనాటికి పెరగాలె? అన్నది అతి పెద్ద చర్చనీయాంశంగా మారింది.
మేకిన్ ఇండియా క్యాంపెయిన్ మొదలయ్యి పదేళ్లకు పైగా..
మేకిన్ ఇండియా క్యాంపెయిన్ మొదలయ్యి సుమారు పదేళ్లకు పైగా అయ్యింది. కానీ ఇప్పటికీ మనం ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రి విషయంలో చైనా పై ఆధార పడక తప్పడం లేదు. డిస్ ప్లే, మదర్ బోర్డ్ అన్నీ చైనా నుంచి రావల్సిందే. పైన డబ్బా మాత్రమే లోకల్. మిగిలినదంతా చైనా మేడ్. చైనీస్ సాఫ్ట్ వేర్, చైనీస్ కాంపోనెంట్స్.. పైకి మాత్రమే మేకిన్ ఇండియా. లోపలంతా చైనా సరుకే అన్న కఠిక వాస్తవం కలవరపెడుతోంది. బ్రాండ్ ఏదైనా కావచ్చు.. ఆల్ మాన్యు ఫాక్చరింగ్ ఇన్ చైనా అన్నది అసలు నిజం. ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ టోటల్లీ డిపెండ్ అప్ ఆన్ చైనా. నాట్ ఓన్లీ టీవీ, మొబైల్, ల్యాప్ టాప్ ఏదైనా కావచ్చు. మీరు చైనా వస్తు వాడకం నుంచి తప్పించుకోవడం అసాధ్యం. ఇదెప్పటికీ సాధ్యం కాని పని. అన్నీ అక్కడి నుంచి రావల్సిందే. కేవలం దానికి స్టిక్కరింగ్ వేయడం మాత్రమే మనకు సాధ్యమయ్యే పని. అంతగా చైనా ఈ పరిశ్రమను ఆక్రమించిందని అంటారీ తయారీ దారులు. మన యువతకు సొంతంగా చేయడం సాధ్యమైనది ఏదైనా ఉందంటే పకోడీలు వేసుకోవడమే అంటూ చలోక్తులు విసురుతున్నారు కొందరు.
టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషిన్ వస్తువు ఏదైనా చేనా మేడే..
ఒక్క మాటలో చెప్పాలంటే మేకిన్ ఇండియా కాదు అసెంబిలింగ్ ఇన్ ఇండియా అని దీని పేరు మార్చుకోవాలేమో. అంతగా చైనా పాతుకు పోయింది. కేవలం ఇదొక్కటే కాదు.. అది టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషిన్.. ఏదైనా కావచ్చు చైనా స్పేర్ పార్ట్స్ లేకుండా సాధ్యమయ్యే పనే కాదు. అంతగా చైనా ప్రాడక్ట్- భారతీయుల నట్టింట్లో తిష్ట వేసుకు కూర్చుంది. ఇక్కడ భారతీయుల ప్రతి కదలికా వారి అదుపాజ్ఞల్లో ఉన్నట్టు తెలుస్తోంది. మొన్నామధ్య ఒక జంట తాము ప్రైవసీగా ఉన్న విజువల్స్ పోర్న్ సైట్స్ లో చూసి షాకయ్యారు. ఇదెలా సాధ్యమని చూస్తే.. దీనంతటికీ కారణం తమ బెడ్రూంలో ఉన్న టీవీ స్మార్ట్ టీవీగా తేలింది. ఎక్కడి నుంచైనా ఆ టీవీని ఆపరేట్ చేయవచ్చని తెలిసి షాకయ్యిందా బాధిత జంట. దీనంతటికీ కారణమేంటి? అసెంబ్లింగ్ ఇన్ ఇండియా కాకుండా నిజమైన మేకిన్ ఇండియా సాకారం కావాలంటే ఏం చేయాలి? అవసరమైన విడి భాగాలు ఇక్కడ తయారు చేసుకునే వెసలుబాటు కల్పించాలి. ఉదాహరణకు మనంతట మనం ఒక సెమి కండక్టర్ యూనిట్ పెట్టడం వీలు కాని పని. కారణం అందుకు తగిన ఎకో సిస్టమ్ ఇక్కడింకా ఇంప్రూవ్ కాకపోవడమేనని తెలుస్తోంది. ఇలాంటి ఫ్యాక్టరీలు పెట్టడానికి కేంద్రం ఇచ్చే రుణాలకూ, వాటికయ్యే ఖర్చుకు తేడా పెద్ద ఎత్తున కనిపిస్తోంది. ఉదాహరణకు CGTMSE స్కీమ్ కింద కేంద్రం పది కోట్ల రుణాలను ఇస్తుందంటే.. అది ఒక సెమీ కండెక్టర్ యూనిట్ స్థాపించడానికి సరిపోదు. అందుకు 2 బిలియన్ డాలర్లు అవసరం. దీంతో చైనాపై ఆధార పడక తప్పని దుస్థితి.
ఎలాక్ట్రానిక్స్ బేస్ట్ ఇండస్ట్రీ మొత్తం చైనా ఆధారితమే
మనకు భారత్ లో ఎన్నో మేకిన్ ఇండియా యూనిట్లు నడుస్తున్నట్టు కనిపిస్తాయి. కానీ అవేవీ ఒరిజినల్ మేకిన్ ఇండియా యూనిట్స్ కావు. అన్నీ చైనా డిపెండెంట్లే. ఎందుకంటే ఇక్కడ ఇంకా ఆ స్థాయిలో మేకిన్ ఇండియా విస్తరణ సాధ్యపడలేదు. అంతా పేరుకే.. అన్నది మాన్యుఫాక్చరింగ్ యూనిట్ ఓనర్స్ అంటోన్న మాట. మరీ ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్ బేస్డ్ ఇండస్ట్రీ మొత్తం చైనా ఆధారితమే. ఆ దేశంతో మనకెన్ని తగువులాటలుండనీ.. సరిహద్దు గొడవలుండనీ.. చైనాను కాదని మనం మన నిత్య జీవితంలో ఏదీ చేయలేం. బ్యాన్ చైనా ప్రాడక్ట్స్, బ్యాన్ చైనా మాంజా, బ్యాన్ చైనా బాణ సంచా అంటూ పైపైకి అరుచుకోడం తప్ప.. ఏం చేయలేని పరిస్థితి. ప్రస్తుతం మనం చైనా బజార్ బదులు భారత్ బజార్లుగా పేరు మార్చేసుకున్నాం. ఎన్నో యాప్స్ ని కూడా నిషేధించేశాం. ఇక ఇక్కడున్నదంతా ఓన్ మేడ్ ఓన్ మాన్యుఫాక్చర్డ్ సరుకే అనడానికి వీల్లేదు. ఇప్పటికీ మనం చైనా వస్తువుల వాడకంతో విధిలేని పరిస్థితుల్లోనే జీవిస్తున్నాం. చైనా వస్తువులు లేనిదే జీవించడం సాధ్యంకాదన్న ధోరణిలో బతుకునీడ్చేస్తున్నాం. అంతగా చైనా మన నరనరాన జీర్ణించుకుపోయిన దృశ్యం కనిపిస్తోంది. కరోనా తర్వాత చైనా ప్రభావం మనం భారీగా తగ్గించేశామన్నది ఒట్టి భ్రమ మాత్రమే. గాల్వాన్ గొడవ తర్వాత మనం చైనాను పూర్తిగా నిషేధించామని సంతసించడానికి వీల్లేని దుస్థితి. వాస్తవం ఇదిగో ఈ చిన్న టీవీ అసెంబ్లింగ్ యూనిట్ చూస్తే ఇట్టే అర్ధమై పోతుంది.
భారత్‌తో ఏటా 150 బి.డా. వాణిజ్యం చేస్తోన్న చైనా
ఇటీవల భారత్ కూడా చైనీయులకు టూరిస్టు వీసాలను ఓకే చేసింది. దీంతో చైనీయులు సైతం భారత్ లో ఇక తిరగడం మొదలు పెడతారు. మనం కేవలం పోస్టర్లు మాత్రమే వేసుకుంటాం. అసలు సినిమా మొత్తం వారు చూపిస్తున్నారు. ఇంకా చూపిస్తూనే ఉంటారు. భారత్ అనే అతి పెద్ద మార్కెట్ ని వారు అప్పనంగా వాడుకుని ఏటా సుమారు 150 బిలియన్ డాలర్ల మేర లబ్ధి పొందుతున్నారు. ఒక పక్క మన నుంచి భారీ ఎత్తున లాభం పొందుతూనే.. మరోపక్క చైనా సైడ్ నుంచి పాకిస్థాన వంటి దేశాలకు అండగా నిలుస్తూ.. మనల్ని అలాక్కూడా దెబ్బ తీస్తోంది. దీంతో చోద్యం చూడ్డం తప్ప మరేమీ చేయలేని నిస్సహాయత కనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కొందరు. మన మేకిన్ ఇండియాపై చైనా ఫ్యాక్టర్ ఇప్పటి నుంచే కాదు ఎప్పటి నుంచో ప్రతిబంధకంగా ఉంది. గత కొన్నేళ్ల గణాంకాలు చూస్తే ఇదే తెలుస్తుందా? అంటే అవుననే చెప్పాలి. ఇంతకీ ఈ చైనా ఎఫెక్ట్ భారత్ ని ఏ విధంగా ఇబ్బంది పెడుతోంది? ఏయే రంగాల్లో చైనా ప్రమేయం ఇంకా కొనసాగుతోంది? దీన్ని అధిగమించాలంటే ఏం చేయాల్సి ఉంది?
మేకిన్ ఇండియాపై కమ్ముకున్న నీలి మేఘం చైనా
మేకిన్ ఇండియాపై కమ్ముకున్న నీలి మేఘం పేరు మరేదో కాదు చైనాయే. ఇదొక చెరగని ముద్రగా నిలుస్తోంది. భారత్ తన మార్కెట్ ని ముంచెత్తడం మాత్రమే కాదు. ప్రపంచ మార్కెట్లకు ఎగుమతులు పెంచాలన్నది ఒక టార్గెట్. ఇందులో భాగంగా మేకిన్ ఇండియా ప్రచారం ముమ్మరం చేసింది. దేశీయంగా వస్తు తయారీ చేసి ప్రపంచ అగ్రగామిగా నిలవాలన్నది ఒక లక్ష్యంగా పెట్టుకుంది. వీలైనంత వరకూ విదేశీ ఉత్పత్తులను తగ్గించాలని చూస్తోంది. అయితే ఇందుకు ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ పెద్ద ఎత్తున ఉన్నట్టు కనిపిస్తున్నాయి. ఇందుకోసం ప్రొడక్షన్ లింక్డ్ ఇన్ సెన్టివ్స్ పథకాలను ప్రవేశ పెట్టింది కేంద్ర ప్రభుత్వం. భారత్ లో పారిశ్రామికతను ప్రోత్సహించడమే ధ్యేయంగా పెట్టుకుంది. అయితే, ఎన్నో వస్తువులపై మన దేశం ఇంకా చైనాపైనే ఆధారపడుతోంది. మన సప్లై చైన్ లో చైనాది అతి పెద్ద పాత్ర ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో మేకిన్ ఇండియా కలలు నెరవేరడం లేదు. తొలి నుంచీ చైనా ఫ్యాక్టర్ మేకిన్ ఇండియాను వెంటాడుతూనే వస్తోంది.
చైనా బొమ్మల దిగుమతి కఠినతరం చేసిన భారత్
మేకిన్ ఇండియా.. మనం ఇప్పుడు మొదలు పెట్టాం.. అదే చైనా మేడిన్ చైనా తొలి నాటి నుంచీ మెయిన్ టైన్ చేస్తూ వస్తోంది. తరతరాల నుంచి చైనా మేడ్ ప్రాడక్ట్స్ వాడ్డం చూస్తూనే వస్తున్నాం. దీంతో మోడీ సర్కార్ ఎంత ట్రై చేసినా ఈ చైనా మరకను తుడిచిపెట్టడం సాధ్యం కావడం లేదు. ఎకనామిక్స్ టైమ్స్ రిపోర్ట్ ప్రకారం.. భారత్ బొమ్మల దిగుమతిని కఠినతరం చేసింది. గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇన్షియేటివ్ ప్రకారం 2019- 24 మధ్య బొమ్మల దిగుమతి దాదాపు 80 శాతం తగ్గింది. ఈ మొత్తం 304 మిలియన్ డాలర్ల నుంచి 65 మిలియన్ డాలర్లకు పడిపోయింది. 2019లో QCI నివేదిక భద్రత గురించి ఆందోళన వ్యక్తం చేయడంతో.. ఈ విషయంలో భారత్ జాగ్రత్తలు పాటించింది. దీంతో భారత్ వేల కోట్ల రూపాయల మేర బొమ్మల ఎగుమతులను మొదలు పెట్టింది. 2024 ఆర్ధిక సంవత్సరంలో ఈ బొమ్మల ఎగుమతి కూడా 154 మిలియన్ డాలర్ల నుంచి 152 మిలియన్ డాలర్లకు పడిపోయింది.
LEDల, సర్క్యూట్ బోర్డులు, ప్లాస్టిక్, ప్యాకేజింగ్
ఒకరకంగా బొమ్మల విషయంలో చైనాను నిలువరించగలిగిన భారత్.. LEDలు, సర్క్యూట్ బోర్డులు, ప్లాస్టిక్, ప్యాకేజింగ్ వంటి వాటిలో ఇప్పటికీ చైనా మీదే ఆధారపడాల్సి వస్తోంది. 2024 పాలిమర్ అప్ డేట్ ప్రకారం చూస్తే.. మన పాలిమర్‌లు చైనాతో పోల్చితే.. 10 శాతం ఖరీదైనవనే చెప్పాలి.. చైనా అంత చీప్ గా మనం తయారు చేయలేక పోతున్నాం. దీంతో విదేశీ మార్కెట్ లో చైనా డామినేషన్ కొనసాగుతూనే ఉంది. దేశంలో దూసుకెళ్తున్న మరో రంగం స్మార్ట్ ఫోన్. 2025లో మన దేశం 24 బిలియన్ డాలర్ల స్మార్ట్ ఫోన్లను ఎగుమతి చేసింది. ఇది గతేడాదితో పోలిస్తే 55 శాతం ఎక్కువ. వాణిజ్య శాఖ లెక్కల ప్రకారం.. ప్రపంచంలో రెండో అతి పెద్ద మొబైల్ ఉత్పత్తిదారుగా నిలుస్తోంది భారత్. కాదనడం లేదు కానీ మరింత లోతులకు వెళ్లి చూస్తే.. ఇక్కడా చైనా డామినేషనే ఎక్కువగా కనిపిస్తోంది. భారత్ సుమారు 260 మిలియన్ డాలర్ల విలువైన ఫినిష్డ్ స్మార్ట్ ఫోన్లను దిగుమతి చేసుకుంది. GTRI ప్రకారం చూస్తే..ఇందులో 50 శాతం పైగా చైనా నుంచి వచ్చినవే. స్మార్ట్ ఫోన్ విడి భాగాల దిగుమతులు సుమారు 760 మిలియన్లుండగా.. వీటిలో 55 శాతం వరకూ చైనావే ఉన్నట్టు తెలుస్తోంది.
చైనా నుంచి ప్రమాదం పొంచి ఉన్నట్టు హెచ్చరిస్తోన్న ICEA
చైనా నుంచి మనకింకా ముప్పు తప్పడం లేదని చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు. 2026 ఆర్ధిక సంవత్సరంలో భారత్ 32 బిలియన్ డాలర్ల ఎగుమతి లక్ష్యం పెట్టుకుంది. దీన్నెలాగైనా సరే దెబ్బ తీయాలన్న కుట్ర చేస్తోంది చైనా. ఈ విషయంపై ఇండియా సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ హెచ్చరిస్తోంది. దీంతో భారత్ తన ఎక్స్ పోర్ట్ టార్గెట్ రీచ్ కావడం కష్ట సాధ్యంగా కనిపిస్తోందని అంటున్నారు వీరు. అంతే కాదు 24 బిలియన్ డాలర్ల దిగుమతి, సంబంధిత వస్తు తయారీ ప్రమాదంలో ఉన్నట్టు తన నివేదికల ద్వారా హెచ్చరిస్తోంది ICEA. ఇప్పటికే దేశంలో పలు కంపెనీలు చైనా కంపెనీలతో టై అప్ చేసుకుని పని చేస్తున్నాయి. కున్షాన్ క్యూ-టెక్ తో పాటు చాంగ్కింగ్ యుహై.. ఇండియాలో మెజారిటీ వాటాలను కలిగి ఉంది. అయితే ప్రభుత్వం ఈ వాటాలపై నిఘా ఉంచింది. ఆపిల్, శాంసంగ్, షియోమి వంటి కంపెనీలు భారత్ లో ఫోన్లను తయారు చేస్తున్నాయి. ఈ ఫోన్లకు సంబంధించి విడి భాగాలు ఇప్పటికీ చైనా నుంచే వస్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పటికీ చాలా విషయాల్లో మన దేశం చైనాపై ఆధారపడి ఉన్న మాట నిజం.
Also Read: కన్‌ఫ్యూజన్‌లో కూటమి.. ఏం జరుగబోతుంది?
సెమీకండక్టర్లలో వాడే సిలికాన్ వేఫర్లు వగైరా
ఒక్క ఫోన్లు మాత్రమే కాదు.. కంప్యూటర్లు, సోలార్ ప్యానెళ్లు, మందులు ఇలా అనేక రకాల వస్తువుల కోసం మనం చైనా వైపే చూస్తున్నాం. ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్లలో వాడే సిలికాన్ వేఫర్లు, ఫ్లాట్ ప్యానెల్ డిస్ ప్లేలు, కంప్యూటర్ మానిటర్లు వంటి వాటిని ఎక్కువగా చైనా నుంచే కొంటున్నాం. ఇక కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్‌లో.. ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లలో చైనాదే గుత్తాధిపత్యం. సోలార్ ప్రొడక్టుల్లో చాలా వరకూ చైనావే. ఫార్మాస్యూటికల్స్‌లో ఎరిథ్రోమైసిన్, యాంటీబయాటిక్‌లు చైనా నుంచే ఎక్కువగా దిగుమతి అవుతున్నాయి. పారిశ్రామిక, విద్యుత్ పరికరాల విషయానికి వస్తే.. ఎంబ్రాయిడరీ యంత్రాలు, అల్యూమినియం ప్లేట్లను కూడా చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ఈ పరిస్థితుల్లో చైనా ఆధిపత్యం తగ్గించేందుకు భారత్ గట్టి వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగా దేశంలోనే ఎలక్ట్రానిక్ విడి భాగాలను తయారు చేయడానికి ప్రత్యేక ప్రణాళికలు రచిస్తోంది. ఇందు వల్ల భారతదేశంలోనే వస్తువులు తయారవడమే కాకుండా వేలమందికి ఉపాధి లభిస్తుంది. గుజరాత్‌లో సెమీకండక్టర్ ఫ్యాక్టరీ కూడా నిర్మిస్తున్నారు. చైనా డామినేషన్న వీలైనంత తక్కువ చేయాలన్నది కేంద్రం ఆలోచనగా తెలుస్తోంది.
Story By Adinarayana, Bigtv