Intinti Ramayanam Today Episode july 30th : నిన్నటి ఎపిసోడ్ లో.. పెళ్లి చూపులు కోసం పెల్లింటి వాళ్ళు వస్తారు. పార్వతి వాళ్ళని ఇంట్లోకి తీసుకొని వస్తుంది. అందరికీ పరిచయం చేస్తుంది. కానీ అవనిని పరిచయం చేయదు. రాజేంద్రప్రసాద్ అవనీని పెద్ద కోడలుగా పరిచయం చేస్తాడు. పార్వతిని ఎవరు అని అడుగుతాడు రాజేంద్రప్రసాద్.. అవనీకి అనుమానం వస్తుంది. ఈ విషయాన్ని ఎలాగైనా సరే కనిపెట్టాలి అని అనుకుంటుంది. మావయ్యకి తెలియకుండా చక్రధర్ బాబాయ్ కి ను అత్తయ్యకును తెలిసిన వాళ్లు అంటే ఏదో తేడాగా ఉంది అని ఆలోచిస్తూ ఉంటుంది అవని.. పెళ్ళికొడుకు మాత్రం అనుమానంగా అటు ఇటు వెతకడం చూసి అవనికి అనుమానం ఇంకాస్త పెరిగిపోతుంది. అవని రాజేంద్రప్రసాద్ ని పక్కకు తీసుకొచ్చి నాకు ఏదో అనుమానంగా ఉంది మావయ్య. మీకు తెలియకుండా అత్తయ్య వాళ్ళు ఎవరున్నారు అని అడుగుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే… ఆ వచ్చిన పెళ్లికొడుకు గదులన్నీ వెతుకుతూ అనుమానంగా తిరుగుతూ ఉంటాడు. అయితే అతని చూసిన అవని ఎవరు కావాలి ఏంటి అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంది. వాష్ రూమ్ కి వచ్చాను అని అంటాడు. అసలు నేనెవరో ఈ ఫంక్షన్ తర్వాత మీకే తెలుస్తుంది అని అతను అంటాడు. అయితే అవినీతో ఆ పెళ్లి కొడుకు వాళ్ళ నాన్న మీద అనుమానం మొదలవుతుంది. ప్రణతి భరతుల పెళ్లి విషయం ఎలాగైనా ఆటంకం కలగకుండా చెప్పాలి అని అనుకుంటుంది. అక్కడికి వచ్చిన పంతులు ఆలస్యమైనందుకు క్షమించాలి అని ఆ రోజు గురించి గొప్పగా చెప్తాడు.. ఇక పూజకి అన్ని సిద్ధం చేయమని చెప్తాడు. అలాగే పూజ కూర్చోవాల్సిన దంపతులు కూడా అన్ని సిద్ధం చేసుకుని ఉండాలని అంటాడు.
అక్షయ్ వెళ్తుంటే పార్వతి పిలుస్తుంది. నువ్వు అవనిని దూరం పెట్టి చాలా మంచి పని చేశావు. అవనిని దగ్గరికి రానివ్వకుండా చేయడం మంచిదిరా అని సలహాలిస్తూ ఉంటుంది.. అయితే అవనికి దగ్గరగా ఉండడం నాకు ఇష్టం లేదమ్మా కేవలం నీ ఫంక్షన్ కోసమే ఇక్కడికి వచ్చాము అని అంటాడు. నాకు తెలుసు రా నీకు అవని అంటే ఇష్టం లేదు అని అని పార్వతి అంటుంది. ఆ మాట విన్న రాజేంద్రప్రసాద్ నేను కూడా నువ్వు లేకుండా ఉంటే బాగుంటుందని అనుకుంటున్నాను అమ్మ అవని మనం ఇక వెళ్ళిపోదాం పదండి మీ అత్తయ్య ఒక్కటే ఫంక్షన్ చేసుకుంటుంది అని అంటాడు.
ఫంక్షన్ ఆగిపోతే మొదటికే మోసం వస్తుందని పల్లవి మావయ్య గారు అత్త ఏదో ఆవేశంలోని మీరు అవన్నీ పట్టించుకోవద్దు అని అంటాడు.. ఇప్పుడు అందరూ వచ్చిన తర్వాత ఈ ఫంక్షన్ జరగలేదు అంటే ఏం బాగుంటుంది మన ఇంటి పరువు పోతుంది అని ఏదో ఒకటి మేనేజ్ చేస్తుంది. రాజేంద్రప్రసాద్ ఈ ఫంక్షన్ ఎలాగోలాగా పూర్తి చేసి వెళ్లిపోదామని అనుకుంటాడు. ఆ తర్వాత ఎవరి కట్టుకోవాల్సిన చీర మీద దురదలు వచ్చే స్ప్రే కొట్టుతుంది పల్లవి. ఈ స్ప్రే కొట్టుకుంటే అవని పూజ చేయడం కాదు దురదలతో చచ్చిపోతుంది అని అనుకుంటుంది.
అందరు దంపతులు కలిసి పూజలో కూర్చుంటారు. అవని చూసిన పల్లవి దురదలతో కచ్చితంగా చచ్చిపోతుంది అని అంటుంది. అయితే అవని వెళ్లిపోయినట్లు కలగంటుంది పల్లవి. కానీ దురదలు పల్లవికి మొదలవడం చూసి అవని దెబ్బకి దెబ్బ తగిలింది అని అనుకుంటుంది. అంతే కాదు పల్లవి దురదలతో తట్టుకోలేక ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్లి చీర మార్చుకొని వస్తుంది. అప్పుడే ప్రణతి కిందికి రావడం చూసి పెళ్ళికొడుకు ఆయన తండ్రి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అమ్మాయి చాలా బాగుంది నాన్న ఇట్నుంచి ఇటే పెళ్లి చేసుకొని తీసుకొని వెళ్ళిపోతాను అని అతను మాట్లాడుతూ ఉంటాడు..
Also Read:సత్యం ఇంట్లో మళ్లీ రచ్చ.. మీనాను పనిమనిషి చేస్తున్న ప్రభావతి.. బాలు సీరియస్..
ఇక చీర మార్చుకొని రమ్మని పంతులుగారు చెప్తారు. ఈ సందర్భంగా నేను మీకు ఒక విషయం చెప్పాలి ఫంక్షన్ అయిన తర్వాత మీరు ఎవరు నా మాట కాదని అంటారని అనుకుంటున్నాను అని పార్వతి అంటుంది. రాజేంద్రప్రసాద్ మాట ఇస్తారని లాక్ చేస్తున్నావని అడుగుతాడు. లేదు నా మాటను కాదనుకున్న ఉంటారని అడుగుతున్నానని అంటుంది. దానికి అవని అత్తయ్య అందరిని ఈ ఫంక్షన్ ద్వారా కలిపింది. తను తీసుకుని నిర్ణయం కూడా మంచిదే ఉంటుంది మేమెవరము మీకు మాటిస్తున్నాను కాదనము అని అవని అంటుంది. అవని వదిన మాటిస్తే తప్పదు అని కమల్ అంటాడు. పల్లవి కూడా అవని అక్క మాట ఇచ్చిందంటే అది కచ్చితంగా జరుగుతుంది అత్తయ్య మీరేమి టెన్షన్ పడకండి అని అంటుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…