E-Paper
Advertisement

ఈ నెలాఖరులోగా పూర్తి చేస్తామన్న పీసీసీ చీఫ్‌! అయినా, క్యాడర్‌లో విశ్వాసం నింపని వైనం! సంక్రాంతి దాకా డౌటేనా?

ఈ నెలాఖరులోగా పూర్తి చేస్తామన్న పీసీసీ చీఫ్‌! అయినా, క్యాడర్‌లో విశ్వాసం నింపని వైనం! సంక్రాంతి దాకా డౌటేనా?
Advertisement

నామినేటెడ్‌ పదవుల భర్తీపై కాంగ్రెస్‌ దాటవేత దోరణిపై క్యాడర్‌లో తీవ్ర అసంతృప్తి నెలకొన్నది. ఎంతెంత దూరం.. ఇంకెంత దూరం..? అన్నట్టుగానే సాగుతోంది ఈ పదవుల భర్తీ ఎపిసోడ్‌. రేపు మాపు అంటున్నారు. ఆ పండుగ ఈ పండుగా అని దాటవేస్తూ వస్తున్నారు. దసరా పోయింది. దీపావళీ పోయింది. ఇప్పుడు ఈ నెలాఖరు లోగా కచ్చితంగా పదవులు పంచేస్తాం.. భర్తీ చేసేస్తామని స్వయంగా పీపీసీ చీఫ్ చెబుతున్నా.. పెదవి విరుపే కనిపిస్తుంది కాంగ్రెస్‌ క్యాడర్‌లో.

ప్రభుత్వం ఏర్పడి మూడేండ్లవుతుంది. కష్టపడి పార్టీని గెలిపించుకుని పార్టీ గెలుపులో కీలకంగా ఉన్న క్యాడర్‌కు మాత్రం తగినంత గౌరవం దక్కడం లేదనే అసంతృప్తి నానాటికీ పెరుగుతూ పోతోంది ఆ పార్టీలో.నామినేటెడ్ పదవుల భర్తీ విషయంలో తీవ్ర తాత్సారం చేస్తూ వస్తోంది అధిష్టానం. ఇప్పటికే రెండు మంత్రి పదవులను ఖాళీ పెట్టేశారు. వీటిని ఇక భర్తీ చేయబోరని డిసైడ్‌ అయిపోయింది ఆ పార్టీ. మరి నామినేటెడ్ పదవులన్నా భర్తీ చేస్తారా? పార్టీ పదవుల సంగతేందీ? కష్టపడ్డవారికి ఇదేనా అధిష్టానం ఇచ్చే గౌరవం? అని నేతలను నిలదీసే పరిస్థితి వచ్చింది. మున్సిపాలిటీ ఎన్నికలను ఎలాగోలా అయిందనిపించారు. మరి ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల గురించి ఎందుకు ఊసెత్తడం లేదు? అనే ప్రశ్నలు కూడా ఆ పార్టీ నుంచి ఉత్పన్నమవుతున్నాయి.

Advertisement

తెలంగాణ వచ్చిన తరువాత పదేండ్లు బీఆరెస్‌ ఎన్ని కష్టాలు పెట్టినా భరించాం, పార్టీ మారలేదు అనే అంశాన్ని కూడా ఇప్పుడు గుర్తు చేస్తున్నారు. పార్టీ మారాలని ఎంత ఒత్తిడి తెచ్చినా కష్టనష్టాల కోర్చి నిలబడ్డామని, ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చినా ఏం ప్రయోజనం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిత్రపక్షాలకు కూడా హామీలిచ్చింది అధిష్టానం. వారికే దిక్కులేవు.. ఇక మాకేం ఇస్తారు? అనే దాకా వచ్చింది పరిస్థితి. ఈ నెలాఖరులోగా పదవులు భర్తీ చేస్తాం, మిత్రపక్షాలకు కూడా ఇస్తున్నాం.. అని పదే పదే ప్రకటించి అధిష్టానం పలుచనే అవుతుంది తప్ప.. క్యాడర్‌ ఎవరూ నమ్మే పరిస్థితి లేదంటున్నారు. మళ్లీ సంక్రాంతికి చూద్దాం అన్నా అంటారనే సెటైర్లు వేసుకుంటున్నారు ఆ పార్టీ క్యాడర్‌.

కొత్త, పాత నేతల మధ్య పంచాయతీ కూడా పదవుల భర్తీ ఆటంకానికి ఓ ప్రధాన కారణంగా చెబుతున్నారు. మా లీడర్లు, మీ లీడర్లు అనే వర్గవిభేదాలు, సీనియర్లు, కొత్త వారు అనే బేధాభిప్రాయాలు కూడా అధిష్టానానికి తలనొప్పిని తెచ్చిపెడుతున్నట్టుగా తెలుస్తోంది. దీంతో రేపు మాపు అంటూ తాత్సారం చేస్తూ రావడం.. పార్టీకి మరింత నష్టాన్ని కలిగిస్తుందనే అభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి. నామినేటెడ్ పోస్టులతో పాటు డైరెక్టర్‌ పదవులు, సొసైటీ చైర్మన్‌ పదవులు.. పార్టీ పదవులు చాలా ఉన్నాయి. ఈ పదవులు లభిస్తే ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు తీసుకుళ్లేందుకు ఓ దారి దొరుకుతుందనే భావనలో వారున్నారు. ఎలాంటి పదవులు లేకపోవడంతో జనం వద్దకు కూడా పోయే పరిస్థితి లేదని వాపోతున్నారు హార్డ్‌ కోర్‌ పార్టీ క్యాడర్.

Tags

Related News

చిరంజీవి, పవన్ బాటలో విజయసాయి రెడ్డి.. ఏపీ పాలిటిక్స్‌లో పాత చరిత్ర పునరావృతమవుతుందా?

అనుకున్నది సాధించాలి! అప్పటిదాకా అధికారంలో ఉండాలి! మూసీ పునర్జీవం ప్రారంభోత్సవానికి నన్నూ పిలవండి!

భారీ బహిరంగ సభల నిర్వహణ చేతగాక చేతులెత్తేసేలా! కేసీఆర్‌లా ప్రజెంట్ చేద్దామనుకున్నా సహకరించని నేతలు.. ! నిర్మల్‌ సభపై కేటీఆర్ అంసతృప్తి!

ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా! ఈనెలాఖరులోగా ఇంటింటి సర్వే! వచ్చే నెల నుంచి పేదలందరికీ రూ.5లక్షల బీమా వర్తింపు!

తాపీమేస్త్రీ టు స్కామ్ మాస్టర్‌మైండ్.. రూ. 670 కోట్లు ఎలా కొల్లగొట్టాడో తెలుసా?

పోయిన చోట వెతుక్కోవడం.. ఫేమస్‌ అయిన పేరునే ఎంచుకోవడం! రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో నూతన ఒరవడి!

పెంచి ఇవ్వకున్నా.. పింఛన్లు పెంచారు! కొత్తగా 4,50 లక్షల మందికి పింఛన్లు..! రూ. 110కోట్ల అదనపు భారం!

Big Stories

Advertisement
×