E-Paper
Advertisement

AP Politics: అన్యాయం చేస్తారా.. తిరగబడ్డ జన సైనికులు

AP Politics: అన్యాయం చేస్తారా..  తిరగబడ్డ జన సైనికులు
Advertisement

AP Politics: జనసేన నేతలకు అన్యాయం జరుగుతుందనే ప్రచారం పొలిటకల్ సర్కిల్‌లో హాట్ టాపిక్‌గా మారిందట. కూటమిలో జరిగిన ఒప్పందం ప్రకారం నియోజకవర్గాల్లో భర్తీ చేసే అన్నిరకాల పదవుల్లో 30 శాతం జనసేన కేడర్ కు దక్కాల్సివున్నా.. పదవులు మాత్రం దక్కడంలేదని జనసేన కేడర్ తీవ్ర అసంతృప్తితో ఉందంట. పదవుల విషయంలో జనసేనకు సరైన ప్రాధాన్యత దక్కడం లేదని మదనపడిపోతున్న జనసైనికులకు తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో అంతుపట్టడం లేదంట..

జనసేన క్యాడర్‌లో అసంతృప్తి పెరిగిపోతోందా?.. పదవుల విషయంలో కింద స్ధాయిలో నాయకులు ఆందోళనలకు గురవుతున్నారా?…అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. అందుకు నిదర్శనం జనసేన సీనియర్ నాయకుడు బొలిశెట్టి సత్యనారాయణ వ్యాఖ్యలే అంటున్నారు. కూటమిలో జరుగుతున్న పరిణామాలు, పదవుల విషయంలో జనసేన కోసం పనిచేసిన వారికి అన్యాయం జరుగుతుందంటూ పార్టీలోని సీనియర్ నేత బొలిశెట్టి సత్యనారాయణ సంచలన కామెంట్స్ చేశారు.

Advertisement

జనసైనికుల్లో నామినేడెట్ పదవులపై అసంతృప్తి
జనసేన పార్టీ కోసం ప్రాణాలకు తెగించి పనిచేసిన కార్యకర్తలకు, వీరమహిళలకు నామినేటెడ్ పదవుల విషయంలో తీవ్ర అన్యాయం జరుగుతోందంటూ ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ విడుదల చేసిన వీడియో ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కూటమి ఏర్పడిన సమయంలో కుదిరిన టీడీపీ, జనసేన, బీజేపీలకు 60:30:10 శాతం పదవుల పంపకం ఫార్ములా కేవలం లెక్కలకే పరిమితం అవుతోందని బొలిశెట్టి ఘాటుగా విమర్శించారు. క్షేత్రస్థాయిలో ఈ ఒప్పందం అమలు కాకపోవడం వల్ల జనసేన కేడర్‌లో తీవ్ర నిరాశ నెలకొందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. “30 శాతం రిజర్వేషన్ ఎక్కడ పోయింది? ” అని ఆయన ప్రశ్నించడం, కూటమి ధర్మాన్ని పాటించడం లేదని నేరుగా ఎత్తిచూపడం గమనార్హం. ఇది కేవలం ఒక నాయకుడి ఆవేదన మాత్రమే కాదు, క్షేత్రస్థాయిలో వేలాది మంది జనసైనికుల గొంతుకగా కనిపిస్తోందంటున్నారు.

కూటమికి వెన్నుదన్నులా నిలుస్తున్న ఉప ముఖ్యమంత్రి
కూటమిలో సమన్వయం కోసం అగ్రనేతలు ఎంతలా తాపత్రయపడుతున్నా.. అసంతృప్తి స్వరాలు వినిస్తూనే ఉండటం పొలిటికల్ సర్కిల్స్‌లో రకరకాల చర్చలకు దారితీస్తోంది. ప్రధానంగా కూటమికి వెన్నుదన్నులా నిలుస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పార్టీలో కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులు తీవ్ర అసహనంతో ఉన్నట్లు వారు చేస్తున్న కామెంట్స్‌తో బయటపడుతుండటం గమనార్హం. కూటమిలో పదవుల పంపకం విషయంలో తమ పార్టీకి అన్యాయం జరుగుతోందని, ఈ విషయమై తనకు రోజూ ఫోన్లు వస్తున్నాయని బొలిశెట్టి విమర్శించారు. విశాఖ నగరంలోని ఒక అయిదు ఆలయ కమిటీలకు సంబంధించిన అంశంపై ఆయన ఈ వ్యాఖ్యలు చేసినా, వాస్తవానికి రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి కనిపిస్తోందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

Advertisement

కూటమిలో సమన్వయం ఉండాలంటున్న ముఖ్యనేతలు
కూటమిలో టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య సమన్వయం ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ పదేపదే చెబుతున్నారు. ఈ ముగ్గురు ప్రధాన నేతలు ఏ ప్రధాన సమావేశానికి వెళ్లినా తమ పార్టీ కార్యకర్తలకు ఈ విషయంపై స్పష్టమైన మార్గనిర్దేశం చేస్తున్నారు. కూటమిలో విడాకులు, క్రాస్ ఫైర్లు ఉండవని, ఎవరికి నచ్చినా నచ్చకపోయినా మరో పదిహేనేళ్లు కలిసి ప్రయాణిస్తామని అగ్రనేతలు ముగ్గురు కుండబద్దలు కొట్టేలా చెబుతున్నారు. అదే సమయంలో చిన్నచిన్న సమస్యలు ఉంటే సర్దుకుపోవడాలని, పరిష్కారం కాని వాటిని తమ దృష్టికి తీసుకురావాలంటున్నారు.

క్షేత్రస్థాయిలో ప్రతిధ్వినిస్తున్న నిరసన స్వరాలు
అగ్రనేతలు ఇలా ఓపెన్ గా చెబుతున్నా, క్షేత్రస్థాయిలో నిరసన స్వరాలు మాత్రం ఆగడం లేదు. కూటమిలో 60-30-10 నిష్పత్తిలో పదవులను పంచుకోవాలని గతంలో తీర్మానించుకున్నారు. రాష్ట్రస్థాయిలో నామినేటెడ్ పదవులు భర్తీ విషయంలో ఈ విధానాన్ని పక్కాగా అమలు చేస్తున్నట్లు చెబుతున్నారు. కానీ, క్షేత్రస్థాయిలో అంటే గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో భర్తీ చేసే పదవుల్లో మాత్రం ఈ పద్ధతిని పాటించడం లేదని జనసేన వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఈ విషయంలో బీజేపీ నుంచి పెద్దగా విమర్శలు లేకపోయినా, గ్రామస్థాయిలో టీడీపీకి సమానంగా పదవులు ఆశిస్తున్న జనసేన కేడర్ మాత్రం తీవ్ర అసంతృప్తితో కనిపిస్తోంది.

అన్ని పదవుల్లో జనసేనకు 30 శాతం వాటా..
కూటమిలో జరిగిన ఒప్పందం ప్రకారం నియోజకవర్గాల్లో భర్తీ చేసే అన్నిరకాల పదవుల్లో 30 శాతం జనసేన కేడర్ కు దక్కాల్సివుంటుందని అంటున్నారు. అయితే జనసేన ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ చెప్పిన ప్రకారం రాష్ట్రంలో ఎక్కడా ఈ విధానం అమలు కావడం లేదంట. దీనికి తాజాగా విశాఖ తూర్పు నియోజకవర్గంలో భర్తీ చేసిన పదవులను ఉదాహరణగా చూపుతున్నారు. ఇక్కడ 5 దేవాలయాలకు ఒకేసారి ట్రస్టు బోర్డులు నియమించగా, జనసేనకు కనీస ప్రాతినిధ్యం కల్పించలేదని ఆ పార్టీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.

Also Read: కేసీఆర్ విచారణలో పార్ట్-1 కంప్లీట్.. మళ్ళీ విచారణకు పిలిచే అవకాశం ఉందా?

జనసేన బలంగా ఉన్న విశాఖ నగరంలోనే పరిస్థితి ఇలా ఉందంటే, రాష్ట్రంలో మిగిలిన నియోజకవర్గాల్లో ఇంకెలా పదవులు భర్తీ చేస్తున్నారో అర్థమవుతోందని జనసేన కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పొరపాట్లు అన్నిచోట్లా జరుగుతున్నాయని బొలిశెట్టి మీడియా ముఖంగా ప్రకటించడం పరిస్థితి తీవ్రతను వెలుగులోకి తెస్తోంది. అయితే ఈ విషయంలో టీడీపీ, జనసేన అగ్రనాయకత్వాలే కల్పించుకోవాల్సివుందని అంటున్నారు. లోపం ఎక్కడ ఉందో గుర్తించకుండా, కార్యకర్తలను బుజ్జగించడం వల్ల ప్రయోజనం ఉండదని హెచ్చరిస్తున్నారు. పరిస్థితి చక్కదిద్దకుంటే రాబోయే స్థానిక ఎన్నికల్లోనూ జనసేనకు నష్టం జరుగుతుందని ఆ పార్టీ కేడర్ ఆవేదన చెందుతోంది. ఈ విషయంలో చంద్రబాబు, పవన్, లోకేశ్ జోక్యం చేసుకోవాలని కార్యకర్తలు విజ్ఞప్తి చేస్తున్నారు.

Story By Apparao; Bigtv

Related News

యూట్యూబ్ లో అప్ లోడ్ అయిన మొదటి సినిమా ఏంటో తెలుసా ?

Construction Waste: హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో నివసిస్తున్నారా? అయితే బీ కేర్‌ఫుల్..?

స్మగ్లర్ల ధనదాహానికి 530 ప్రాణాలు బలి.. రోహింగ్యాలు జలసమాధి వెనుక ఉన్న బిగ్ స్కెచ్ ఇదేనా..?

Future City: ముచ్చర్ల పరిసర ప్రాంతాల్లో భూములు కొన్నారా?.. అయితే మీకో షాకింగ్ న్యూస్..!

యువ సంగ్రామ సదస్సు దేనికి సంకేతం?.. నిరుద్యోగుల కోసం కేసీఆర్ చేసిన టాప్ 5 స్టెప్స్ ఇవే!

బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుపై వివాదం.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలపై భారత్ క్లారిటీ!

అంగన్వాడీలకు గుడ్ న్యూస్.. ‘తల్లికి వందనం’ వర్తింపు.. ఆ మూడు రోజుల్లోనే అకౌంట్లలోకి రూ. 13 వేలు!

108 సంఖ్యకు అంత ప్రాముఖ్యత ఎందుకో ఎప్పుడైనా ఆలోచించారా ?

Big Stories

Advertisement
×