E-Paper
Advertisement

బిడ్డెను ఎగ‌దోసి.. ఆపై ఆమెపైనే నెట్టేసి…. బెదిరింపు రాజ‌కీయాల్లో బెడిసికొట్టిన ముర‌ళి వ్యూహం..

బిడ్డెను ఎగ‌దోసి.. ఆపై ఆమెపైనే నెట్టేసి…. బెదిరింపు రాజ‌కీయాల్లో బెడిసికొట్టిన ముర‌ళి వ్యూహం..
Advertisement

అందితే జుట్టు.. అంద‌క‌పోతే కాళ్లు.. ! రాజ‌కీయాల్లో ఈ స‌మీక‌ర‌ణ పెద్ద‌గా ప‌నిచేయ‌దు. న‌మ్మ‌రు. విశ్వాసం కోల్పోతారు. అప్ప‌టి వ‌ర‌కు క‌ష్ట‌ప‌డి నిర్మించుకున్న సౌధాల‌ను వారికి వారే కూల్చేసుకునే చ‌ర్యే ఇది. సేమ్ అట్ల‌నే ఉంది కొండా ముర‌ళి వ్యూహం.

సుష్మిత‌ను ముందు పెట్టి సీఎం రేవంత్‌ను బెదిరించాల‌నుకున్నాడు. తెర వెనుకుండి ఆమెను ప్రోత్స‌హించాడు. ఆమె కూడా ఆ తండ్రి పెంప‌కంలో అంత‌కు మించి మెచ్యూరిటీ ప్ర‌ద‌ర్శిస్తార‌ని అనుకోవ‌డం కూడా పొర‌పాటే. మా నాన్న‌కు ఇస్తాన‌న్న ఎమ్మెల్సీ ఎందుకివ్వ‌లేదు..? అని అడ‌గ‌డంలో అర్థ‌ముంది? దానికో ప‌ద్ద‌తుంది.

Advertisement

కానీ హ‌ద్దులు మీరి బ‌హిరంగ వేదిక‌ల మీద ప‌నిలో ప‌ని త‌న తండ్రిని కీర్తించి ఆకాశానికెత్తే ప‌ని చేస్తే చేసుకుని ఉండొచ్చు. కానీ తండ్రిని మంచిన ఘ‌నుడే లేడు.. ఆయ‌న లేక‌పోతే.. ప్ర‌భుత్వ‌మే లేదు.. అస‌లు కాంగ్రెస్సే రాక‌పోతుండే అనే సుభాషితాలే అతిశ‌యోక్తిని మించి ఆకాశానికంటాయి. ఇక్క‌డే ప్లాన్ బెడిసికొట్టింది.

ఇక ఇది స‌రిపోదంటూ.. ఆ రేవూరి ప్ర‌కాశ్‌రెడ్డికి టికెట్ ఎట్లిస్తారు..? అది నాది క‌దా? నేను క‌దా పోటీ చేయాల్సింది..? అన‌డం మ‌రీ అతి. డైప‌ర్లు వేసుకునేటోడు అని సంబోధించ‌డం.. పెద్ద‌ల‌పై ఎలాంటి మ‌ర్యాద వచ‌నాలు ప్ర‌యోగించాలో ముర‌ళి పెంప‌కంలో నేర్చుకున్న ఓన‌మాలుగా మ‌నం ఇక్క‌డ చూడాలి.

Advertisement

నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌లో అస‌లు ఆ ప‌ర‌కాల ఉంటుందా? మారుతుందా? అనే లాజిక్ కూడా మ‌రిచారు. ఆ స‌భ‌లో సీఎం .. రేవూరి మ‌ళ్లీ బ్రహ్మాండ‌మైన మెజారిటీతో గెలుస్తార‌ని అన‌డం కూడా స‌రికాదు.. (రేవంత్‌కు ఇలా అన‌మ‌ని స‌ల‌హా ఇచ్చి త‌ప్పుదోవ ప‌ట్టించిన పెద్ద మ‌నిషిపై కూడా చ‌ర్చ జ‌రుగుతోంది..)

నీ త‌మ్ముడి బాగోతాలు ఇంకా ఉన్నాయి.. బ‌య‌ట‌పెడ‌తా.. జాగ్ర‌త్త‌! అని బెదిరించి లొంగ‌దీసుకోవాల‌నే పాత చింత‌కాయ న‌క్స‌లిస్టు పాల‌సీ కూడా తండ్రి ర‌చించిన స్క్రీన్ ప్లే నుంచి వ‌చ్చిందే. ఇంతా చేసి.. ఇప్పుడు మాకేంటీ సంబంధం.. ఆమె రాజ‌కీయాలు ఆమెకు..అని క‌వ‌రింగు ఇచ్చుకోవ‌డం.. కాపాడుకోవ‌డంలో ప‌డిపోయారు.

కొండ‌కు వెంట్రుకేసి లాగాల‌నుకున్నారు కొండా ఫ్యామిలీ. కానీ ఆ డ్రామాలో కొండా ఫ్యామిలీ కొండ మీద నుంచి కాలుజారి లోయ‌లో ప‌డిపోయిన‌ట్ట‌య్యింది. ఇప్పుడు ప‌నిలోప‌ని క‌విత పేరు కూడా బ‌య‌ట‌కు తీశాడు ముర‌ళి.. క‌విత కుటుంబం నుంచి వ‌చ్చి పార్టీ పెట్ట‌లేదా? ఆమెను ఎవ‌రైనా ఎందుకొచ్చావ‌ని అడుగుతున్నారా? అని.

కానీ పోలికే స‌రిపోలేదు. క‌విత‌కు, సుష్మిత‌కు న‌క్క‌కు నాగ‌లోకానికి ఉన్నంత తేడా ఉంది. అంటే ప‌రిస్థితి చేయిదాటింద‌ని తెలియ‌గానే.. బిడ్డెను కూడా బ‌లిపెట్టేందుకు వెన‌కాడ‌ని ది గ్రేట్ కింగ్ మేక‌ర్ ముర‌ళి గారు.. ఇక ఆ ప్రాంతంలో ఎలాంటి ప్ర‌భావం చూప‌గ‌లుగుతారు..? ప్ర‌జ‌లెలా విశ్వ‌సిస్తారు ఈయ‌న నాయ‌క‌త్వాన్ని.. అనే ప్ర‌శ్న‌లు కూడా ఉత్ప‌న్నం చేశారు వాళ్లే.

తండ్రి మాట‌ల‌ను ప‌ట్టుకుని న‌టించి మెప్పించిన సుష్మిత‌.. డ్రామా బాగానే ఉంది కానీ..సినిమా అట్ట‌ర్ ఫ్లాప్ అయ్యింది. చివ‌ర‌కు డైరెక్ట‌ర్ కూడా చేతులెత్తేశాడు. అంతిమంగా కొండా ఫ్యామిలీ పొలిటిక‌ల్ కెరీర్‌కు వారంత‌ట వారే స‌మాధిని త‌వ్వుకున్నార‌న‌డంలో పెద్ద ఆశ్చ‌ర్యం కూడా అక్క‌ర‌లేదు. సానుభూతి అస‌లే రావ‌డం లేదు..

Tags

Related News

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

కాంగ్రెస్ ను ఓడించేందుకు… బీజేపీ, బీఆర్‌ఎస్‌ రహస్య దోస్తానా? గ్రేటర్‌పై బీజేపీ పట్టు.. నల్లగొండపై గులాబీ పంతం..!

బిగ్ టీవీ ఇన్వెస్టిగేషన్ ఎఫెక్ట్.. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మరో ఫేక్ లెక్చరర్..?

టెన్త్ సర్టిఫికెట్ లేకున్నా జూనియర్ లెక్చరర్.. బిగ్ టీవీ ఇన్వెస్టిగేషన్‌లో వెలుగులోకి సంచలనాలు!

కర్నూలు టీడీపీ మేయర్ అభ్యర్థిగా బొల్లెద్దుల విజయ ప్రత్యూష.. ఫిక్స్ అయినట్టేనా..?

కేంద్ర మంత్రైనా… వాస్తవాలు చెప్పడంలో వెనక్కి రారు! మోడీ కేబినెట్‌లో ఉంటూనే జెన్‌జీ శక్తికి జై కొడతారు!

సంచి నిండదు.. జేబులు ఖాళీ.. సామాన్యుడిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ద్రవ్యోల్బణం!

మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ పైనా ఆరోపణలు..! ఆయనకు బ్యాంక్‌ చైర్మన్‌గా ఎందుకు అవకాశం ఇచ్చారు? కొత్త వివాదాన్ని తెరపైకి తెచ్చిన ప్రశాంత్‌ కిషోర్‌..

Big Stories

Advertisement
×